Madhav Sheth : రియల్ మీ ఇండియా…బంపర్ ఆఫర్, ఆఫ్ లైన్ స్టోర్లు

దేశ వ్యాప్తంగా 100 ఆఫ్ లైన్ స్టోర్లను త్వరలోనే ప్రారంభించడం జరుగుతుందని ఇండియా రియల్ మీ సీఈవో మాధవ్ సేఠ్ ప్రకటించారు.

Madhav Sheth : రియల్ మీ ఇండియా…బంపర్ ఆఫర్, ఆఫ్ లైన్ స్టోర్లు

Real Me

Updated On : October 8, 2021 / 3:49 PM IST

Realme Stores Today : విదేశీ స్మార్ట్ తయారీ సంస్థలు భారతదేశంలో స్మార్ట్ ఫోన్ మార్కెట్ ను విస్తరించే పనిలో పడ్డాయి. ఇండియన్ ఆన్ లైన్ మార్కెట్ లో షావోమీ 28 (క్యూ 2) శాంసంగ్ 18 శాతం, వివో 15 శాతం సేల్స్ తో దూసుకెళుతున్న సంగతి తెలిసిందే. 15 శాతం మార్కెట్ షేర్ ను పెంచాలని రియల్ మీ ఆఫ్ లైన్ భావిస్తోంది. అందులో భాగంగా..ఆఫ్ లైన్ మార్కెట్ ను మరింత విస్తరించాలని నిర్ణయం తీసుకుంది. గత సంవత్సరం ఆగస్టు 20వ తేదీన తొలి ఆఫ్ లైన్ స్టోర్ ను ప్రారంభించింది.

Read More : RBI : ఇంటర్నెట్ లేకుండా…డిజిటల్ చెల్లింపులు!

ఇప్పుడా ఆ సంఖ్యను పెంచాలని కీలక నిర్ణయం తీసుకుంది. దేశ వ్యాప్తంగా ఆఫ్ లైన్ స్టోర్లను రియల్ మీ ఇండియా ప్రారంభించింది. ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 100 ఆఫ్ లైన్ స్టోర్లను త్వరలోనే ప్రారంభించడం జరుగుతుందని ఇండియా రియల్ మీ సీఈవో మాధవ్ సేఠ్ ప్రకటించారు. ఈ సంవత్సరం చివరి నాటికి దేశంలో 300 రియల్ మీ స్టోర్లను ప్రారంభించే విధంగా ప్రణాళికలు రచిస్తోంది.

Read More : IMPS : పండుగ వేళ, ఆర్బీఐ శుభవార్త..రూ. 5లక్షల వరకు ట్రాన్స్ ఫర్

2022 నాటికి ఈ సంఖ్యను 1000 స్టోర్లకు పెంచుతామని తెలిపారు. ఈ రియల్ మీ స్టోర్ లలో స్మార్ట్ ఫోన్స్, ల్యాప్ ట్యాప్స్, ట్యాబ్లెట్స్ తో పాటు ఇతర టెక్ గాడ్జెట్స్ ఉంటాయన్నారు. 2021, అక్టోబర్ 08, 09వ తేదీల్లో ఎక్స్ క్లూజివ్ ఆఫర్లను ప్రకటించింది.