ఆండ్రాయిడ్ బీటా టెస్టింగ్ : వాట్సాప్ లో కొత్త ఎమోజీ కేటగిరీ ఫీచర్

ప్రముఖ మొబైల్ మెసేంజర్ యాప్ వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా యూజర్ల కోసం కొత్త ఎమోజీ కేటగిరీ ఫీచర్ ను ప్రవేశపెట్టనుంది.

  • Published By: sreehari ,Published On : April 25, 2019 / 12:49 PM IST
ఆండ్రాయిడ్ బీటా టెస్టింగ్ : వాట్సాప్ లో కొత్త ఎమోజీ కేటగిరీ ఫీచర్

Updated On : April 25, 2019 / 12:49 PM IST

ప్రముఖ మొబైల్ మెసేంజర్ యాప్ వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా యూజర్ల కోసం కొత్త ఎమోజీ కేటగిరీ ఫీచర్ ను ప్రవేశపెట్టనుంది.

ప్రముఖ మొబైల్ మెసేంజర్ యాప్ వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా యూజర్ల కోసం కొత్త ఎమోజీ కేటగిరీ ఫీచర్ ను ప్రవేశపెట్టనుంది. వాట్సాప్ స్టిక్కర్లలోని ఎమోజీలను వేరుచేసే డూడుల్ పిక్కర్ లో కేటగిరీ ఫీచర్ పై ఆండ్రాయిడ్ బీటా టెస్టింగ్ చేస్తోంది. WABetaInfo నివేదిక ప్రకారం.. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ 2.19.106 బీటా అప్ డేట్ ను ప్రవేశపెట్టింది. కానీ, ఈ ఫీచర్ ప్రస్తుతం డెవలప్ మెంట్ స్టేజీలో ఉన్నట్టు WAబీటాఇన్ఫో తెలిపింది. 

వాట్సాప్ ఎమోజీ కేటగిరీని Doodle Picker ఆప్షన్ స్టేటస్ పై ఒకసారి క్లిక్ చేస్తే చాలు.. ఈ ఫీచర్ ను యాక్సస్ చేసుకోవచ్చు. కొత్త ఎమోజీ కేటగిరీ ఫీచర్ ద్వారా.. రెండు వేర్వేరు ట్యాబ్స్ లో ఎమోజీలు, స్టిక్కర్లను డిసిప్లే చేస్తుంది.

ఈ రెండు Tabsను డూడుల్ పిక్కర్ ఆధారంగా ఆపరేట్ చేయొచ్చు. వాట్సాప్ లో అప్ డేట్ చేసిన సమయంలో యూజర్లు ఈజీగా ఎమోజీలు, స్టిక్కర్లను గుర్తించేందుకు వీలుగా ఉంటుంది. ఈ కొత్త New Emoji Category  ఫీచర్ కు సంబంధించి ఓ స్ర్కీన్ షాట్ ను వాట్సాప్ పోస్టు చేసింది.

కొత్త అఫిషియల్ Emojiలు ప్రస్తుతం డెవలప్ మెంట్ స్టేజ్ లో ఉండగా.. వాట్సాప్ ఆండ్రాయిడ్ బీటా యూజర్లు మాత్రం ఇప్పుడు అందుబాటులో లేదు. బీటా టెస్టింగ్ యూజర్లతో పాటు ప్రతి యూజర్లకు ఈ కొత్త ఎమోజీ కేటగిరీ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది అనేదానిపై క్లారిటీ లేదు.

ఆర్చీవ్ చాట్ ఆప్షన్ కింద 2.19.101 Beta Updateలోని Main Menuపై టెస్టింగ్ జరుగుతున్నట్టు నివేదిక తెలిపింది. లేటెస్ట్ బీటా వెర్షన్ 2.19.116 మెనూ కిందకు మూవ్ చేసినట్టు పేర్కొంది.