WhatsApp Animated Emoji : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. లేటెస్ట్ బీటాలో యానిమేటెడ్ ఎమోజీ వస్తోంది..!
WhatsApp Animated Emoji : వాట్సాప్ యూజర్లకు అలర్ట్.. త్వరలో వాట్సాప్ బీటాలో సరికొత్త ఫీచర్ రానుంది. లేటెస్ట్ బీటా వెర్షన్‌లో యానిమేటెడ్ ఎమోజీ వస్తోంది.

WhatsApp Animated Emoji Feature Spotted in Development on Latest Beta_ Report
WhatsApp Animated Emoji : ప్రముఖ మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ (Whatsapp) యానిమేటెడ్ ఎమోజీలను పంపేందుకు యూజర్లను అనుమతించే కొత్త ఫీచర్‌పై పనిచేస్తోంది. ప్రముఖ మెసేజింగ్ సర్వీస్ లేటెస్ట్ డెస్క్‌టాప్ బీటా వెర్షన్‌లో ఈ ఫీచర్ డెవలప్‌మెంట్‌లో గుర్తించింది. యానిమేటెడ్ ఎమోజీలు ప్రస్తుతం టెలిగ్రామ్ (Telegram) స్లాక్ వంటి మెసేజింగ్ సర్వీస్‌లలో సపోర్ట్ చేస్తుంది. ఫీచర్ ట్రాకర్ ప్రకారం.. ఆపిల్ (iOS), (Android) యూజర్ల కోసం WhatsApp బీటా ఫ్యూచర్ అప్‌డేట్ ఫీచర్‌ను యాడ్ చేసే పనిలో ఉంది. వాట్సాప్ కూడా అదే ఫీచర్‌పై పని చేస్తోంది. వాట్సాప్ ప్రస్తుతం స్టిక్కర్లు, GIFలతో పాటు స్టాండర్డ్, స్టాటిక్ ఎమోజీలను పంపేందుకు యూజర్లకు అనుమతిస్తుంది.
వాట్సాప్ ఫీచర్ ట్రాకర్ (WABetaInfo) నివేదిక ప్రకారం.. కొత్త యానిమేటెడ్ ఎమోజీకి సపోర్టును యాడ్ చేయడంలో సర్వీసు అందిస్తోంది. Lottie లైబ్రరీ నుంచి యానిమేషన్లను ఉపయోగించి రూపొందించారు. WABetaInfo ప్రకారం.. కొత్త యానిమేటెడ్ ఎమోజి డిఫాల్ట్‌గా పంపుతారు. అదనంగా, ఈ యానిమేషన్లు సైజులో చిన్నవి. క్వాలిటీ కోల్పోకుండా సైజు మార్చవచ్చు. ప్రస్తుతం అభివృద్ధిలో ఉన్న ఫీచర్ వాట్సాప్ డెస్క్‌టాప్ బీటా వెర్షన్‌లో కనిపించింది. ఈ ఫీచర్ ఇంకా డెవలప్ స్టేజీలో లేదు. చివరకు ఎప్పుడు లాంచ్ అవుతుంది అనేదానిపై ఎలాంటి సమాచారం లేదు.

WhatsApp Animated Emoji Feature Spotted in Development on Latest Beta
Read Also : WhatsApp Video Messages : వాట్సాప్ యూజర్లకు అలర్ట్.. త్వరలో వీడియో మెసేజ్‌లను కూడా పంపుకోవచ్చు..!
బీటా ఛానెల్‌లోని యూజర్లు ప్రస్తుతం ఈ యానిమేటెడ్ ఎమోజీలను వినియోగించలేరు. వాట్సాప్ iOS, Android యూజర్లు WhatsApp బీటా ఫ్యూచర్ అప్‌డేట్ అదే ఫీచర్‌ను తీసుకువస్తుందని ఫీచర్ ట్రాకర్ పేర్కొంది. గత నెలలో, ఆండ్రాయిడ్‌లో బీటా టెస్టర్ అప్‌డేట్‌ను ఎంచుకునేందుకు వాట్సాప్ యూనికోడ్ 15.0 ఎమోజీకి సపోర్టు అందించింది. అధికారిక వాట్సాప్ కీబోర్డ్‌కు 21 కొత్త ఎమోజీలను యాడ్ చేసింది. వాట్సాప్ యూజర్లు Google Play స్టోర్ నుంచి ఆండ్రాయిడ్ 2.23.5.13 లేదా నెక్స్ట్ వెర్షన్‌ల కోసం WhatsApp బీటాను డౌన్‌లోడ్ చేయడం ద్వారా ఎమోజీలను యాక్సెస్ చేయవచ్చు.
వాట్సాప్ ఇటీవలే ఆండ్రాయిడ్, iOS డివైజ్‌ల్లో యూజర్లందరికి మూడు కొత్త సెక్యూరిటీ ఫీచర్లను ప్రవేశపెట్టనున్నట్టు ప్రకటించింది. ‘Account Protect’, ‘Device Verification’, ‘automatic security codes’ యాప్‌ను యూజర్లకు సురక్షితమైనదిగా అందిస్తుంది. ‘Device Verification’ ద్వారా యూజర్లను మాల్వేర్‌ను ఇన్‌స్టాల్ చేయకుండా నిరోధిస్తుంది, మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ సర్వీస్ ప్రకారం.. అకౌంట్ పాత ఫోన్ నుంచి కొత్త డివైజ్‌కు మైగ్రేట్ అయ్యేందుకు ప్రయత్నిస్తే ‘Account Protect’ యూజర్లను హెచ్చరిస్తుంది.
Read Also : HP India New Laptops : ఇంటెల్ CPUతో HP ఇండియా నుంచి 4 కొత్త ల్యాప్‌టాప్స్.. ఏ మోడల్ ధర ఎంతంటే?