WhatsApp New Feature : వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. ఆండ్రాయిడ్ బీటాలో ఆ మెసేజ్‌లపై స్పెషల్ బటన్ వస్తోంది..!
WhatsApp New Feature : మెటా (Meta) యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ (Whatsapp) అదృశ్యమయ్యే మెసేజ్ షార్ట్‌కట్ బటన్ (Message Shortcut)ను టెస్టింగ్ చేయడం ప్రారంభించింది. అందులోవాట్సాప్ కొన్ని ఆండ్రాయిడ్ బీటా టెస్టర్‌ల కోసం ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది.

WhatsApp begins to test disappearing messages shortcut for Android beta
WhatsApp New Feature : మెటా (Meta) యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ వాట్సాప్ (Whatsapp) అదృశ్యమయ్యే మెసేజ్ షార్ట్‌కట్ బటన్ (Message Shortcut)ను టెస్టింగ్ చేయడం ప్రారంభించింది. అందులో వాట్సాప్ కొన్ని ఆండ్రాయిడ్ బీటా టెస్టర్‌ల కోసం ఈ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. నివేదిక ప్రకారం.. ఆండ్రాయిడ్ 2.22.24.9 అప్‌డేట్ ద్వారా వాట్సాప్ బీటాలో కొత్త డిజప్పయర్ మెసేజ్ సెక్షన్ రీడిజైన్ చేసేందుకు వాట్సాప్ కృషి చేస్తోంది. కొత్త, పాత చాట్‌లను disappearing మెసేజ్ థ్రెడ్‌లుగా గుర్తించేందుకు ఈ ఫీచర్ సాయపడుతుంది. అదృశ్యమయ్యే మెసేజ్ సెక్షన్ కోసం 2.22.25.10 అప్‌డేట్ మరింత మంది టెస్టర్లకు అందుబాటులో ఉంది. ఆసక్తికరంగా, మెసేజింగ్ యాప్ అదృశ్యమవుతున్న మెసేజ్ ఫీచర్ కోసం అదనపు ఎంట్రీ పాయింట్‌ను ప్రారంభిస్తోంది.
WABetaInfo నివేదిక ప్రకారం.. ఆండ్రాయిడ్ (2.22.25.11 వెర్షన్) కోసం అప్‌డేట్ చేసిన WhatsApp బీటా వెర్షన్‌ను డౌన్‌లోడ్ చేసిన తర్వాత కొంతమంది టెస్టర్లు కొత్త ఫీచర్‌ను యాక్సెస్ చేయవచ్చు. కొత్త షార్ట్‌కట్ ఫీచర్‌ని మేనేజ్ స్టోరేజ్ సెక్షన్ నుంచి యాక్సెస్ చేయవచ్చు. ఈ కొత్త సెక్షన్ ద్వారా కొత్త, పాత చాట్‌లను ‘disappearing threads’గా గుర్తించవచ్చు.

WhatsApp begins to test disappearing messages shortcut for Android beta
యూజర్లు అవసరం లేని మీడియాను ఆటోమాటిక్‌గా డిలీట్ చేసేందుకు టైమర్‌తో కూడిన అదృశ్యమవుతున్న మెసేజ్‌లను సెట్ చేయవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. వాట్సాప్ యూజర్లు తమ ప్రైవసీ సెట్టింగ్‌లలో లేదా చాట్ డేటాను ఓపెన్ చేయడం ద్వారా ఈ ఫీచర్‌ను కాన్ఫిగర్ చేసే ఆప్షన్ కూడా పొందవచ్చు. ఇంతలో, WhatsApp కొంతమంది యూజర్లు తమ అకౌంట్‌ను ఒకటి కన్నా ఎక్కువ డివైజ్‌లలో ఉపయోగించేందుకు అనుమతిస్తుంది.
BGR నివేదిక ప్రకారం.. ఇన్‌స్టంట్ మెసేజ్ ప్లాట్‌ఫారమ్ బీటా టెస్టర్‌లతో WhatsApp అకౌంట్ రెండవ డివైజ్ అంటే.. టాబ్లెట్‌తో లింక్ చేసేందుకు అనుమతిస్తుంది. వాట్సాప్ టాబ్లెట్ వెర్షన్‌తో తమ అకౌంట్ లింక్ చేసేందుకు బీటా ఛానెల్‌లోని యూజర్లను వాట్సాప్ అలర్ట్ చేస్తోందని నివేదిక పేర్కొంది. WhatsApp బీటా ప్రోగ్రామ్‌లో నమోదు చేసుకున్న Android యూజర్లు Android టాబ్లెట్ కలిగి ఉన్నారా? అయితే టాబ్లెట్ కోసం WhatsApp బీటా టెస్టర్లకు అందుబాటులో ఉంది. బ్యానర్‌పై ద్వారా స్క్రీన్ దిగువన పాప్-అప్ ఓపెన్ అవుతుంది. వాట్సాప్ అకౌంట్‌ను టాబ్లెట్ వెర్షన్‌తో ఎలా కనెక్ట్ చేయాలో ఓసారి చూద్దాం..
– మీ టాబ్లెట్‌లో Google Play Storeకి వెళ్లి WhatsApp కోసం సెర్చ్ చేయండి.
– ఇన్‌స్టాల్‌పై క్లిక్ చేయండి. ఇప్పటికే డౌన్‌లోడ్ చేసి ఉంటే, లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేయండి
– ఈ అకౌంట్‌కు లింక్ చేసేందుకు యాప్‌ను ప్రారంభించి, స్క్రీన్‌పై సూచనలను ఫాలో అవ్వండి.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..