ఎప్పటినుంచో తెలుసా? : విండోస్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు
మీరు విండోస్ ఫోన్ ఇంకా వాడుతున్నారా? అయితే కొత్త ఆండ్రాయిడ్.. ఐఓఎస్ బేసిడ్ డివైజ్ తీసుకోండి. ఎందుకంటే.. విండోస్ ఫోన్ లో వాట్సాప్ ఇకపై పనిచేయదు.

మీరు విండోస్ ఫోన్ ఇంకా వాడుతున్నారా? అయితే కొత్త ఆండ్రాయిడ్.. ఐఓఎస్ బేసిడ్ డివైజ్ తీసుకోండి. ఎందుకంటే.. విండోస్ ఫోన్ లో వాట్సాప్ ఇకపై పనిచేయదు.
మీరు విండోస్ ఫోన్ ఇంకా వాడుతున్నారా? అయితే కొత్త ఆండ్రాయిడ్.. ఐఓఎస్ బేసిడ్ డివైజ్ తీసుకోండి. ఎందుకంటే.. విండోస్ ఫోన్ లో వాట్సాప్ ఇకపై పనిచేయదు. విండోస్ ఫోన్లకు వాట్సాప్ సపోర్ట్ నిలిపివేస్తున్నట్టు మెసేంజర్ యాప్ సంస్థ ఇటీవల ప్రకటించింది. డిసెంబర్ 31, 2019 నుంచి విండోస్ ఫోన్లలో వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి.
మైక్రోసాఫ్ట్ సంస్థ నిర్ణయంతో… విండోస్ 10 మొబైల్ డివైజ్ లకు డిసెంబర్ నెలతో వాట్సాప్ సపోర్ట్ ఎండ్ అవుతుందని మెసేంజర్ సంస్థ ప్రకటనలో తెలిపింది. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కు.. వాట్సాప్ నుంచి ఎలాంటి డెవలప్ మెంట్స్ ఉండబోవని వాట్సాప్ తన బ్లాగ్ పోస్టులో పేర్కొంది. పాత ఆపరేటింగ్ సిస్టమ్, వాడుక లేని ఓఎస్ లకు వాట్సాప్ సంస్థ క్రమంగా తమ సపోర్ట్ ను నిలిపివేస్తోంది.
2020, ఫిబ్రవరి 1 నుంచి ఈ ఫోన్లలో కూడా :
ఇటీవల నోకియా సింబాయన్ ఎస్60, నోకియా సిరీస్ 40 ఆపరేటింగ్ సిస్టమ్, బ్లాక్ బెర్రీ ఓఎస్, బ్లాక్ బెర్రీ 10 అపరేటింగ్ సిస్టమ్ లకు వాట్సాప్ సంస్థ తమ సపోర్ట్ ను నిలిపివేసిన సంగతి తెలిసిందే. 2020, ఫిబ్రవరి 1 నాటికి వాట్సాప్ సంస్థ.. దశల వారీగా ఆండ్రాయిడ్ వెర్షన్ 2.3.7, ఓల్డర్ వెర్షన్స్, ఐఓఎస్7, అంతకంటే ఓల్డర్ వెర్షన్ ఫోన్లకు కూడా వాట్సాప్ సపోర్ట్ నిలిపియనున్నట్టు ప్రకటించింది.
ఎండ్ సపోర్ట్ అంటే.. లైఫ్ సైకిల్ పాలసీ ప్రకారం.. వాట్సాప్ మెసేంజర్ యాప్ కు ఈ కంపెనీల నుంచి ఎలాంటి ప్రొడక్ట్ లేదా సెక్యూరిటీ అప్ డేట్లను ఆఫర్ చేయడం జరగదు. విండోస్ 10 యూజర్లు ఎవరైతే ఉన్నారో.. వారంతా తక్షణమే ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ డివైజ్ లకు మైగ్రేట్ కావడం మంచిదని ఇటీవల మైక్రోసాఫ్ట్ కంపెనీ రికమండ్ చేసింది.
మరోవైపు WABetainfo కూడా తమ వాట్సాప్.. యూనివర్శల్ విండోస్ ప్లాట్ ఫాం (UWP)పై వర్క్ చేస్తుందని మైక్రోసాఫ్ట్ కంపెనీ.. తమ మొబైల్ ప్లాట్ ఫాంపై సెక్యూరిటీ, సాఫ్ట్ వేర్ అప్ డేట్స్ అందించడం.. ఏడాది అఖరి వరకు కొనసాగిస్తామని 2019 ఏడాది ఆరంభంలో పేర్కొంది. కానీ, ఇప్పటివరకూ ఆ సంస్థ ఎలాంటి మేజర్ వెర్షన్ అప్ డేట్స్ ను రిలీజ్ చేయలేదు. విండోస్ 10 మొబైల్, వెర్షన్ 1709 (అక్టోబర్ 2017లో రిలీజ్) కాగా, విండోస్ 10.. మైక్రోసాఫ్ట్ నుంచి రిలీజ్ అయిన చివరి అప్ డేట్ ఇదే కావడం గమనార్హం.