WhatsApp Group Call : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. గ్రూపు చాట్‌లో త్వరలో కాల్ లింక్ షార్ట్‌కట్ క్రియేట్ చేయొచ్చు!

WhatsApp Group Call : గ్రూపు చాట్ కాల్‌లో జాయిన్ అయ్యేందుకు ఈ ఫీచర్ అనుమతిస్తుంది. ప్రస్తుతానికి ఈ కొత్త కాల్ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది. ఈ ఫీచర్ ద్వారా కాల్ లింక్‌లను క్రియేట్ చేసుకోవచ్చు. 

WhatsApp Group Call : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. గ్రూపు చాట్‌లో త్వరలో కాల్ లింక్ షార్ట్‌కట్ క్రియేట్ చేయొచ్చు!

WhatsApp is working on a call link shortcut for group chats ( Image Source : Google )

WhatsApp Group Call : వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్.. అతి త్వరలో గ్రూపు చాట్‌లో సరికొత్త కాలింగ్ ఫీచర్ రాబోతోంది. గ్రూపు చాట్ కాల్‌లో జాయిన్ అయ్యేందుకు ఈ ఫీచర్ అనుమతిస్తుంది. ప్రస్తుతానికి ఈ కొత్త కాల్ ఫీచర్ టెస్టింగ్ దశలో ఉంది. ఈ ఫీచర్ ద్వారా కాల్ లింక్‌లను క్రియేట్ చేసుకోవచ్చు.

Read Also : Reliance Jio Plans : రిలయన్స్ జియో 8వ వార్షికోత్సవం.. సబ్‌స్క్రైబర్‌ల కోసం స్పెషల్ ప్లాన్లు, ఓటీటీ బెనిఫిట్స్ ఇవే!

అంతేకాదు.. ఇతర వాట్సాప్ యూజర్లకు కూడా షేర్ చేయొచ్చు. ఇతరులు కేవలం ఒక ట్యాప్‌తో వాయిస్ లేదా వీడియో కాల్‌లో చేరవచ్చు. అన్నీ కాల్స్ ట్యాబ్‌లో నుంచి ఇతరులతో కనెక్ట్ అయ్యే ప్రక్రియను వాట్సాప్ క్రమబద్ధీకరిస్తుంది. గో-టు మెసెంజర్ యాప్ ప్రస్తుతానికి గ్రూప్ చాట్‌లకు మాత్రమే కాల్ లింక్ షేరింగ్ ఫీచర్‌ను చేర్చాలని ప్లాన్ చేస్తోంది.

నివేదిక ప్రకారం.. కాల్ లింక్‌ క్రియేట్ చేసే ఆప్షన్ ఫొటో లేదా డాక్యుమెంట్‌ని యాడ్ చేసే ఇతర ఆప్షన్లతో అందుబాటులో ఉంటుందని మెసేజింగ్ దిగ్గజం వెల్లడించింది. యూజర్ ఎక్స్‌పీరియన్స్ మరింత మెరుగుపరిచేందుకు ఈ కొత్త ఫీచర్‌ను వాట్సాప్ తీసుకొస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈ ఫీచర్ గ్రూపు సభ్యులందరినీ ఆటోమాటిక్‌గా రింగ్ చేయకుండా కాల్‌ను ఎనేబుల్ చేసేందుకు అనుమతిస్తుంది. అవసరమైన సమయంలో కాల్‌లో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. గ్రూపు కాల్‌లను మరింత సౌకర్యవంతంగా, ఎలాంటి అవాంతరాలు లేకుండా కాల్ కొనసాగించవచ్చు.

కాల్ లింక్ షార్ట్‌కట్ ఫీచర్ :
ప్రస్తుతం వాట్సాప్ గ్రూప్‌లోని ప్రతి పార్టిసిపెంట్‌కు కాల్ రింగ్ అవుతుంది. అయితే, త్వరలో ఈ ఫీచర్ నిలిపివేయనుంది. వాట్సాప్ గత రెండు ఏళ్లుగా కాల్ లింక్‌లను క్రియేట్ చేసే అవకాశం అందిస్తోంది. రాబోయే అప్‌డేట్ యూజర్లను గ్రూపు చాట్స్‌లో నేరుగా లింక్‌లను క్రియేట్ చేయడం, షేర్ చేసేందుకు అనుమతిస్తుంది. ఈ షార్ట్‌కట్ ఫీచర్ ప్రక్రియను సులభతరంగా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. లింక్‌ను షేర్ చేసిన తర్వాత యూజర్లు త్వరగా గ్రూప్ చాట్‌కి పంపుకోవచ్చు.

ఇతర సభ్యులు గ్రూప్-వైడ్ రింగ్ నోటిఫికేషన్ లేకుండానే ట్యాప్ చేయవచ్చు. ఈ రాబోయే ఫీచర్ గ్లోబల్ మెంబర్‌లతో కూడిన పెద్ద గ్రూప్‌లకు బెస్ట్ అని చెప్పవచ్చు. ప్రస్తుతానికి ఈ కొత్త ఫీచర్ ఇంకా టెస్టింగ్ దశలో ఉంది. రాబోయే అప్‌డేట్‌లలో అందరికి అందుబాటులో రావడానికి మరికొంత సమయం పడుతుంది. మెటా ఏఐ వాయిస్ మోడ్ వాట్సాప్ ఇటీవల చాట్ ఇంటర్‌ఫేస్‌కు మెటా ఏఐని ప్రవేశపెట్టింది. రాబోయే అప్‌డేట్‌లో కొత్త వాయిస్ మోడ్ ఫీచర్‌ని తీసుకురానుంది.

Read Also : Airtel Festive Plans : ఎయిర్‌టెల్ పండుగ ఆఫర్లు.. 3 సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు.. బెనిఫిట్స్ ఇవే..!