WhatsApp Multiple Chats : వాట్సాప్ డెస్క్‌టాప్ యూజర్లు త్వరలో మల్టీపుల్ చాట్లను ఒకేసారి ఎంచుకోవచ్చు..!
WhatsApp Multiple Chats : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) దాదాపు ప్రతి నెలా సరికొత్త ఫీచర్లు, సెక్యూరిటీ అప్‌డేట్‌లను ప్రవేశపెడుతోంది.

WhatsApp Multiple Chats _ WhatsApp will soon allow desktop users to select multiple chats, details here
WhatsApp Multiple Chats : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) దాదాపు ప్రతి నెలా సరికొత్త ఫీచర్లు, సెక్యూరిటీ అప్‌డేట్‌లను ప్రవేశపెడుతోంది. 2022 సంవత్సరంలో వాట్సాప్ అవతార్ (WhatsApp Avatar), కమ్యూనిటీ, స్టేటస్ (community), రియాక్షన్ (Reactions) మొదలైన అనేక కొత్త ఫీచర్‌లు వచ్చాయి. 2023లోకి అడుగుపెట్టబోతున్నాం. మెటా యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ యూజర్ ఎక్స్ పీరియన్స్, ప్రైవసీలను మెరుగుపర్చేందుకు మరిన్ని ఫీచర్‌లను తీసుకొచ్చేందుకు రెడీగా ఉంది. నివేదికల ప్రకారం.. WhatsApp కొత్త ఫీచర్‌పై పనిచేస్తోంది.
వాట్సాప్ వెబ్ (Whatsapp Web Users) యూజర్ల కోసం మల్టీ చాట్‌లను ఎంచుకోవడానికి అనుమతిస్తుంది. వాట్సాప్ డెస్క్‌టాప్ బీటా (Whatsapp Desktop Beta)లో మల్టీ చాట్‌లను ఎంచుకునే సామర్థ్యాన్ని యూజర్లకు అందించే ఫీచర్‌పై ప్లాట్‌ఫారమ్ ఇప్పుడు పనిచేస్తోందని WABetaInfo నివేదిక సూచిస్తుంది. కొత్త ఫీచర్‌తో వాట్సాప్ యూజర్లు తమ చాట్ లిస్ట్‌ని ఎంచుకుని, చాట్‌ని డిలీట్ చేయడంతో పాటు మరిన్నింటిని నిర్వహించుకోవచ్చు.
వాట్సాప్ లాంచ్ విడుదలైన తర్వాత ‘Selected Chat’ ఫీచర్ చాట్ మెనూలో అందుబాటులో ఉంటుంది. వాట్సాప్ యూజర్లు మల్టీ చాట్‌లను ఎంచుకోవచ్చు. వాట్సాప్ మ్యూట్ చేయడం లేదా Unread గుర్తించడం లేదా మల్టీ చాట్‌ల కోసం Read వంటి యాక్షన్లను తీసుకోగలరు. ముఖ్యంగా, ఈ ఫీచర్ ప్రస్తుతం డెవలప్ స్టేజీలో ఉంది. WhatsApp డెస్క్‌టాప్ బీటా భవిష్యత్తు అప్‌డేట్లతో టెస్టు నిర్వహించేందుకు త్వరలో లాంచ్ చేయనున్నట్టు భావిస్తున్నారు.

WhatsApp Multiple Chats _ WhatsApp will soon allow desktop users to select multiple chats
వాట్సాప్ రిపోర్ట్ స్టేటస్ అప్‌డేట్ ఫీచర్ :
వాట్సాప్ ప్లాట్‌ఫారమ్‌ను మరింత సురక్షితంగా చేసే కొత్త ఫీచర్‌పై కూడా పని చేస్తోంది. నివేదికల ప్రకారం, WhatsApp ప్లాట్‌ఫారమ్ నిబంధనలు షరతులను ఉల్లంఘించే ఏవైనా అనుమానాస్పద స్టేటస్ అప్‌డేట్స్ నివేదించడానికి యూజర్లను అనుమతించే ‘Report Status Status’ని డెవలప్ చేస్తోంది. WhatsApp ఇప్పటికే ప్రొఫైల్‌లు, మెసేజ్ రిపోర్టు చేసే యూజర్లను అనుమతించనుంది. ఏదైనా హానికరమైన స్టేటస్ అప్‌డేట్స్ రిపోర్టు చేసేందుకు యూజర్లకు మరింత సాయం చేస్తుంది. బీటా టెస్టింగ్ కోసం ఈ ఫీచర్ త్వరలో అందుబాటులోకి రానుంది. ముఖ్యంగా, స్టేటస్ రిపోర్ట్ ఫీచర్ ప్లాట్‌ఫారమ్ అందించిన ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను బ్రేక్ చేయదు. దానికి బదులుగా వాట్సాప్ తర్వాత మాత్రమే రిపోర్టు స్టేటస్‌ను పరిశీలిస్తుంది.
వాట్సాప్ Undo Delete For Me ఫీచర్ :
వాట్సాప్ (WhatsApp) ఇప్పటికే అందరి యూజర్ల కోసం గత వారమే ‘Delete For Me’ ఫీచర్‌ను Undo లాంచ్ చేసింది. iOS, ఆండ్రాయిడ్, డెస్క్‌టాప్ యూజర్లు అనుకోకుండా డిలీట్ మెసేజ్ చేసినప్పుడు Undo చేయవచ్చు. ఇప్పుడు వాట్సాప్ యూజర్లు కొన్ని సెకన్లపాటు ప్రమాదవశాత్తు డిలీట్ చేసిన మెసేజ్ సులభంగా తిరిగి పొందవచ్చు.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..
Read Also : WhatsApp Report : వాట్సాప్ డెస్క్‌టాప్ యూజర్లు త్వరలో స్టేటస్ అప్‌డేట్స్‌పై కూడా రిపోర్టు చేయొచ్చు!