Whatsapp New Feature : ఐఫోన్ వాట్సాప్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్.. పిక్చర్-ఇన్-పిక్చర్ ఏంటి? అదేలా పని చేస్తుందంటే?
Whatsapp New Feature : వాట్సాప్ (WhatsApp) తమ Android, iOS, డెస్క్‌టాప్ యూజర్ల కోసం ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. ఈ కొత్త అప్‌డేట్‌లతో, మెటా యాజమాన్యంలోని ప్లాట్‌ఫారమ్ యూజర్ ప్రైవసీతో పాటు ఎక్స్‌పీరియన్స్ మెరుగుపర్చేందుకు సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తోంది.

Whatsapp New Feature _ WhatsApp users with iPhones can finally use picture-in-picture_ What is it, how it works
Whatsapp New Feature : ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) తమ Android, iOS, డెస్క్‌టాప్ యూజర్ల కోసం ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. ఈ కొత్త అప్‌డేట్‌లతో, మెటా యాజమాన్యంలోని ప్లాట్‌ఫారమ్ యూజర్ ప్రైవసీతో పాటు ఎక్స్‌పీరియన్స్ మెరుగుపర్చేందుకు సెక్యూరిటీ అప్‌డేట్స్ అందిస్తోంది. ప్రత్యేకించి వాట్సాప్ సరికొత్త ఫీచర్‌లను రిలీజ్ చేస్తుంది. ఈ నెలలో రిలీజ్ చేసిన లేటెస్ట్ అప్‌డేట్‌లో WhatsApp ఎట్టకేలకు iOS యూజర్ల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పిక్చర్-ఇన్-పిక్చర్ (PiP) మోడ్‌ను రిలీజ్ చేసింది.
PiP మోడ్ ఇప్పుడు వాట్సాప్ యూజర్లు వీడియో కాల్‌లో ఉన్నప్పుడు ఏకకాలంలో ఇతర యాప్‌లను ఓపెన్ చేసేందుకు అనుమతిస్తుంది. iOSలో వెర్షన్ 23.3.77 ఫీచర్ ప్రకారం.. iOS పిక్చర్-ఇన్-పిక్చర్ (PiP) మోడ్‌కు సపోర్టుతో యూజర్లు ఇప్పుడు WhatsApp వీడియో కాల్ సమయంలో వీడియో పాజ్ చేయకుండా మల్టీ టాస్క్ చేయొచ్చునని వాట్సాప్ వెల్లడించింది. ముఖ్యంగా, ఆండ్రాయిడ్ WhatsApp యాప్ యూజర్ల కోసం ఇప్పటికే PiP మోడ్ అందుబాటులో ఉంది. అయితే, iOS యూజర్ల కోసం WhatsApp గత ఏడాది నుంచి PiP మోడ్‌లో పనిచేస్తోంది డిసెంబర్‌లో ఫీచర్ టెస్టింగ్ కూడా ప్రారంభించింది.

Whatsapp New Feature _ WhatsApp users with iPhones can finally use picture-in-picture
iOS PiP మోడ్ ఎలా పనిచేస్తుందంటే? :
మీరు వీడియో కాల్ సమయంలో WhatsApp యాప్ నుంచి నిష్క్రమిస్తే.. PiP మోడ్ ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతుంది. వాట్సాప్ యూజర్లు ప్రస్తుతానికి కావాలనుకుంటే వీడియో కాల్ వ్యూలను పాజ్ చేసేందుకు లేదా హైడ్ చేసేందుకు కూడా అనుమతిస్తుంది. అయినప్పటికీ, PiP మోడ్ ప్రారంభం కాకపోతే.. మీ WhatsAppని అప్‌డేట్ చేయండి. అవసరమైన అన్ని సెట్టింగ్‌లను మార్చడానికి వాట్సాప్ Settings App అనుమతిని చెక్ చేయండి.
ఐఫోన్‌లో కొత్త వాట్సాప్ ఫీచర్లు ఇవే :
PiP మోడ్ కాకుండా వాట్సాప్ iOS యూజర్ల కోసం మరికొన్ని ఫీచర్లను కూడా రిలీజ్ చేసింది. అవేంటో ఓసారి చూద్దాం..
– Captions for documents : వాట్సాప్ ఇప్పుడు యూజర్‌లకు డాక్యుమెంట్లను పంపే ముందు వాటికి క్యాప్షన్‌లను యాడ్ చేసేందుకు యూజర్లకు అనుమతిస్తుంది. ఈ ఫోటోలు, వీడియోలు లేదా Gifల కోసం క్యాప్షన్‌లను యాడ్ చేయొచ్చు. వాట్సాప్ యూజర్లు ఇప్పుడు పర్సనల్ లేదా గ్రూపు చాట్‌లలో వారి కాంటాక్టులకు పంపే ముందు డాక్యుమెంట్లకు క్యాప్షన్లు యాడ్ చేసుకోవచ్చు.

Whatsapp New Feature _ WhatsApp users with iPhones can finally use picture-in-picture
– Support longer group subjects and descriptions : వాట్సాప్ యూజర్లు గ్రూపుకు సంబంధించి వివరణ ఇచ్చే విషయాలను యాడ్ చేయొచ్చు. వాట్సాప్ గ్రూప్ వివరణను 512 అక్షరాల నుంచి 2048 అక్షరాలకు పెంచుతోంది.
– Personalised Avatars : ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ మాదిరిగానే మెటా ఇప్పుడు తమ యూజర్లను ప్లాట్‌ఫారమ్ కోసం సొంతంగా కస్టమైజ్ చేసిన అవతార్‌ను క్రియేట్ చేసేందుకు అనుమతిస్తుంది. వినియోగదారులు తమ ప్రొఫైల్ ఫొటోగా వాట్సాప్ అవతార్‌ను క్రియేట్ చేయొచ్చు లేదా స్టిక్కర్ ప్యాక్‌ను తయారు చేయవచ్చు. ఈ ప్లాట్‌ఫారమ్‌లో వారి చాట్ సంభాషణలకు మరింత వినోదాన్ని యాడ్ చేయొచ్చు.
మీ అవతార్‌ని క్రియేట్ చేయడానికి :
– WhatsApp సెట్టింగ్‌లకు వెళ్లండి.
– అవతార్ Tap చేయండి> మీ అవతార్‌ని క్రియేట్ చేయండి.
– ఇప్పుడు మీ అవతార్‌ని క్రియేట్ చేయడానికి ఈ Steps ఫాలో అవ్వండి.
– ఆపై Done పై Tap చేయండి.
వాట్సాప్‌లో మీ అవతార్‌కి మీ ప్రొఫైల్ ఫొటో సెటప్ :
– Settings వెళ్లండి.
– మీ Profile Photo > Edit> Tap on Edit
– Use Avatar ఆప్షన్ Tap చేయండి.
PiPతో సహా ఈ ఫీచర్‌లు రాబోయే వారాల్లో అందుబాటులోకి వస్తాయని వాట్సాప్ చెబుతోంది. అయితే, అందరికీ అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పడుతుంది. మీ వాట్సాప్‌లో కొత్త అప్‌డేట్‌లను పొందాలంటే.. కొత్త అప్‌డేట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.