Whatsapp Block Spam : వాట్సాప్‌లో సరికొత్త సెక్యూరిటీ ఫీచర్.. లాక్ స్క్రీన్ నుంచే నేరుగా స్పామ్ నంబర్‌లను బ్లాక్ చేయొచ్చు!

Whatsapp Block Spam : వాట్సాప్ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్ వచ్చేసింది. లాక్ స్క్రీన్ నుంచి స్పామ్ కాంటాక్టులను నేరుగా బ్లాక్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

Whatsapp Block Spam : వాట్సాప్‌లో సరికొత్త సెక్యూరిటీ ఫీచర్.. లాక్ స్క్రీన్ నుంచే నేరుగా స్పామ్ నంబర్‌లను బ్లాక్ చేయొచ్చు!

WhatsApp now allow users to block spam numbers directly from the lock screen

Whatsapp Block Spam : ప్రస్తుత రోజుల్లో ఆన్‌లైన్ స్కామ్ కేసులు గణనీయంగా పెరిగాయి. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి స్పామ్ కాల్స్, మెసేజ్‌లు వస్తున్నాయి. చాలామంది వీటిని గుర్తించలేక స్కామర్ల చేతిలో మోసపోతున్నారు. వేలాది మంది వినియోగదారులు లక్షల రూపాయలను కోల్పోయిన ఘటనలు అనేకం ఉన్నాయి.

Read Also : WhatsApp Passkey : ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. వాట్సాప్ పాస్‌కీ వచ్చేసింది.. ఇదేలా పనిచేస్తుందంటే?

స్కామర్లు మోసాలకు పాల్పడే ప్రాథమిక ప్లాట్‌ఫారమ్‌లలో వాట్సాప్ ఒకటి. ప్రైవసీ ఫీచర్లు ఎన్ని అందుబాటులో ఉన్నప్పటికీ వినియోగదారులు ఇప్పటికీ స్కామర్ల మోసాలకు బలైపోతూనే ఉన్నారు. అందువల్ల, ఈ సమస్యను గుర్తించి వాట్సాప్ అదనపు ప్రొటెక్షన్ లేయర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో కొత్తగా ఫీచర్ తీసుకొచ్చింది. లాక్ చేసిన స్క్రీన్‌లో నోటిఫికేషన్‌లోనే స్పామ్ లేదా అనుమానాస్పద కాంటాక్టులను నేరుగా బ్లాక్ చేసేందుకు యూజర్లను అనుమతిస్తుంది.

మీ ఫోన్‌లో ఈ సెట్టింగ్ ఎనేబుల్ చేశారా? :
వాట్సాప్ కొత్త ఫీచర్ వినియోగదారులకు ఫిషింగ్ అటాక్స్, పోంజీ స్కీమ్‌లు లేదా ఇతర స్కామ్‌లు వంటి అనుమానాస్పద సందేశాలను పంపే కాంటాక్టులను బ్లాక్ చేసేందుకు అనుమతిస్తుంది. కొత్త వాట్సాప్ ఫీచర్‌ని ఉపయోగించి ఇప్పుడు నోటిఫికేషన్‌లోనే రిప్లయ్ బటన్ పక్కన ఉన్న బ్లాక్ ఆప్షన్ నొక్కండి. లాక్ స్క్రీన్‌లో నోటిఫికేషన్ కనిపించేలా మీ ఫోన్‌ సెట్టింగ్స్ ఎనేబుల్ చేసి ఉండాలి. అప్పుడు మాత్రమే వాట్సాప్ ఓపెన్ చేయకుండా లాక్ స్క్రీన్ నుంచి నేరుగా కాంటాక్టులను సులభంగా బ్లాక్ చేయగలరని గమనించాలి.

WhatsApp now allow users to block spam numbers directly from the lock screen

WhatsApp block spam  

బ్లాక్ అండ్ రిపోర్టు ఆప్షన్ :
వాట్సాప్‌లో ఇప్పటికే బ్లాక్ అండ్ రిపోర్ట్ ఆప్షన్ ఉంది. అయితే, మరో ఫీచర్ ఎందుకు? అని అంటారా? ఇప్పటివరకు వాట్సాప్ నోటిఫికేషన్లలో గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చే స్పామ్ మెసేజ్‌లపై వార్నింగ్ మాత్రమే కనిపించేది. అయితే, ఈ కాంటాక్ట్‌లను బ్లాక్ చేయాలంటే తప్పనిసరిగా చాట్‌ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు.. కొన్నిసార్లు యూజర్లు తరచుగా స్పామ్ మెసేజ్‌లను అన్‌బ్లాక్ చేసి వదిలివేస్తారు.

కాంటాక్టు బ్లాక్ చేసేందుకు మెసేజ్ ఓపెన్ చేయడం మర్చిపోతుంటారు. ఈ కొత్త ఫీచర్‌తో వినియోగదారులు నోటిఫికేషన్‌ను పొందిన వెంటనే లాక్ స్క్రీన్ లేదా నోటిఫికేషన్ షేడ్ నుంచే నేరుగా స్పామ్ కాంటాక్టులను బ్లాక్ చేయవచ్చు. అనుమానాస్పద ఖాతాలను బ్లాక్ చేయడంలో యూజర్లకు సాయపడుతుంది. రెడ్ ఫ్లాగ్ చేసిన అకౌంట్లను తిరిగి చెక్ చేయడానికి నిబంధనలు, షరతులను ఉల్లంఘిస్తే పూర్తిగా బ్లాక్ చేసేందుకు వాట్సాప్ అనుమతిస్తుంది.

Read Also : Flipkart Mobile Bonanza Sale : ఫ్లిప్‌కార్ట్ మొబైల్ బొనాంజా సేల్.. ఆపిల్ ఐఫోన్లపై బిగ్ డిస్కౌంట్లు.. ఇతర ఫోన్లపై కూడా..!