Whats App గ్రూప్‌లో చేర్చాలంటే మీ పర్మిషన్ కావల్సిందే

మీ వాట్సప్ నంబర్‌ను మీకు తెలియకుండా ఎవరో గ్రూపులకు యాడ్ చేసేస్తున్నారా?యాడ్ చేశాక రిమూవ్ అయితే బాగోదు అని మొహమాటమా? ఇక ఆ చింత లేదు. ఇకపై మిమ్మల్ని వాట్సప్ గ్రూపులకు యాడ్ చేయకుండా మీరు చేయవచ్చు. వాట్సాప్ సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకుని వచ్చింది.
ఈ ఫీచర్‌ను పొందాలంటే వాట్సాప్‌ను అప్‌డేట్ చేసుకుని క్రమంగా ఈ సూచనలు ఆచరిస్తే చాలు. Account > Privacy > Groups సెలెక్ట్ చేసుకుంటే అక్కడ మీరు Nobody, My Contacts, Everyone ఇలా ఎవరికి అనుమతి ఇవ్వాలో మీరే డిసైడ్ అవ్వవచ్చు. Nobody అని ఎంపిక చేసుకుంటే, కొత్త గ్రూప్‌లో మిమ్మల్ని యాడ్ చేయాలంటే మీ అనుమతి తప్పనిసరి.
My Contacts ఆప్షన్ ఎంచుకుంటే మీ ఫోన్‌లో ఉన్న కాంటెక్ట్‌లు మాత్రమే మిమ్మల్ని యాడ్ చేసే అవకాశం ఉంటుంది. ఈ సరికొత్త ఆప్షన్ వల్ల అనసవసర చేర్పులకు అడ్డుకట్ట వేయవచ్చునని వాట్సప్ చెబుతుంది. ఇదిలా ఉంటే ఎన్నికల వేళ నకిలీ వార్తలకు అడ్డుకట్ట వేసేందుకు ‘టిప్‌లైన్’ సర్వీసును తీసుకుని వచ్చింది.