WhatsApp Username : వాట్సాప్‌లో ప్రైవసీ ఫీచర్.. పిన్ సపోర్టుతో యూజర్‌నేమ్‌.. ఇక ఫోన్ నెంబర్ అక్కర్లేదు..!

WhatsApp Username : యూజర్ నేమ్ పిన్ అనేది మీ ప్రొఫైల్ పిన్ లాంటిది. ఎవరైనా యాదృచ్ఛికంగా చాట్‌ని చేయకుండా నిరోధిస్తుంది. నివేదిక ప్రకారం.. యూజర్ నేమ్ సెటప్ చేసేటప్పుడు వినియోగదారులు పిన్‌ను సెట్ చేయవచ్చు.

WhatsApp Username : వాట్సాప్‌లో ప్రైవసీ ఫీచర్.. పిన్ సపోర్టుతో యూజర్‌నేమ్‌.. ఇక ఫోన్ నెంబర్ అక్కర్లేదు..!

WhatsApp Platform To Introduce Advanced Username Feature ( Image Source : Google )

WhatsApp Username : వాట్సాప్ యూజర్ల కోసం సరికొత్త ప్రైవసీ ఫీచర్ తీసుకొస్తోంది. కొన్ని నెలలుగా ప్లాట్‌ఫారమ్‌లో యూజర్ నేమ్ అనే కొత్త ఫీచర్ టెస్టింగ్ చేస్తోంది. ఇప్పుడు, వాట్సాప్ లేటెస్ట్ బీటా వెర్షన్ యూజర్ నేమ్ కోసం పిన్ ఫీచర్‌ను యాడ్ చేయాలని కంపెనీ యోచిస్తోందని వెల్లడించింది.

Read Also : JioAirFiber Offer : జియోటీవీ+ టూ-ఇన్-వన్ ఆఫర్ : ఒకే కనెక్షన్‌తో రెండు టీవీల్లో కంటెంట్ చూడొచ్చు!

వినియోగదారులకు ప్లాట్‌ఫారమ్‌లో వారి ప్రైవసీ, సెక్యూరిటీపై మరింత కంట్రోలింగ్ అందిస్తుంది. ఆండ్రాయిడ్ వెర్షన్ 2.24.18.2 కోసం వాట్సాప్ బీటా యూజర్‌నేమ్‌లను క్రియేట్ చేస్తున్నప్పుడు పిన్ సపోర్ట్‌ను కలిగి ఉందని నివేదిక నివేదించింది. సెక్యూరిటీ,ప్రైవసీ అడ్వాన్స్‌డ్ లేయర్ ఫీచర్ అందిస్తోంది. ఫోన్ నెంబర్ బదులుగా యూజర్ నేమ్ ద్వారా ఇతర యూజర్లతో కనెక్ట్ అవ్వొచ్చు.

వాట్సాప్‌లో యూజర్ నేమ్ పిన్ అంటే ఏంటి? :
యూజర్ నేమ్ పిన్ అనేది మీ ప్రొఫైల్ పిన్ లాంటిది. ఎవరైనా యాదృచ్ఛికంగా చాట్‌ని చేయకుండా నిరోధిస్తుంది. నివేదిక ప్రకారం.. యూజర్ నేమ్ సెటప్ చేసేటప్పుడు వినియోగదారులు పిన్‌ను సెట్ చేయవచ్చు. ఈ ప్లాట్‌ఫారమ్‌లో అన్‌నౌన్ యూజర్లు వారిని కాంటాక్టు కాకుండా బ్లాక్ చేయడానికి వారిని అనుమతిస్తుంది. అంతేకాకుండా, చాట్‌ని ఒకరితో చేయాలంటే వారికి యూజర్ నేమ్ ఉన్న ఇతర యూజర్లకు ఆ పిన్ అవసరం. వాట్సాప్‌లో ఇతరులు తమ ఫోన్ నంబర్‌లు లేదా యూజర్ నేమ్ చూడాలనుకుంటున్నారా అనే ఆప్షన్ కూడా యూజర్లు ఎంచుకోవచ్చు.

వాట్సాప్ ప్రైవసీనే లక్ష్యం :
వినియోగదారులకు మరింత కంట్రోల్ అందించే లక్ష్యంతో వాట్సాప్ మరో కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. మొదటి ఫీచర్ ఇది కాదు. యూజర్ నేమ్స్, పిన్ కాకుండా వాట్సాప్ ఇటీవల “అన్‌నౌన్ అకౌంట్ల నుంచి మెసేజ్‌లను బ్లాక్” అనే కొత్త ఫీచర్‌ను టెస్టింగ్ చేయడం ప్రారంభించింది. దాంతో పాటు, ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ ఇప్పటికే తెలియని కాలర్‌లను బ్లాక్ చేయడం, ప్రైవసీ డ్యాష్‌బోర్డ్ మరిన్ని వంటి అనేక ఇతర ప్రైవసీ-కేంద్రీకృత ఫీచర్‌లను రిలీజ్ చేసింది.

యూజర్ నేమ్స్, పిన్ వివరాలివే :
యూజర్‌నేమ్‌లు, పిన్ ఫీచర్‌లు రెండూ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్నాయి. ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటాకు వాట్సాప్‌లో అందుబాటులో ఉన్నాయి. స్టేబుల్ బిల్డ్‌కి ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో వాట్సాప్ వెల్లడించలేదు. అయితే, రాబోయే నెలల్లో వచ్చే అవకాశం ఉంది.

Read Also : Oppo F27 5G Price : కొత్త ఫోన్ కావాలా? ఈ ఒప్పో 5జీ ఫోన్ ఓసారి లుక్కేయండి.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు..!