Whatsapp Status Feature : వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్.. ఇకపై మీ స్టేటస్ ఫేస్‌బుక్‌లో ఈజీగా షేర్ చేసుకోవచ్చు..!
Whatsapp Status Feature : వాట్సాప్ యూజర్లకు అలర్ట్.. మీ వాట్సాప్ స్టేటస్ (Whatsapp Status) ఫేస్‌బుక్‌లో ఈజీగా షేర్ చేయొచ్చు తెలుసా? ఇదిగో ప్రాసెస్..

WhatsApp releases Facebook sharing option for status, details here
Whatsapp Status Feature : ప్రముఖ మెటా (Meta) యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ (Whatsapp) తమ యూజర్ల కోసం ఇంట్రెస్టింగ్ ఫీచర్ తీసుకొచ్చింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా వినియోగదారులు సులభంగా తమ వాట్సాప్ స్టేటస్‌ను ఫేస్‌బుక్ (Facebook) అకౌంట్లలో షేర్ చేసుకోవచ్చు. వాట్సాప్ యూజర్ ఎక్స్‌పీరియన్స్‌తో పాటు ప్రైవసీని మరింత మెరుగుపరచేందుకు (WhatsApp) దాదాపు ప్రతి నెలా కొత్త ఫీచర్లు, అప్‌డేట్‌లను రిలీజ్ చేస్తోంది. లేటెస్ట్ అప్‌డేట్‌లో.. సరికొత్త ఫీచర్ అప్‌డేట్‌ను ప్రకటించింది.
వాట్సాప్‌లో స్టేటస్ షేరింగ్ (Whatsapp Status Sharing)ను వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సాప్ ద్వారా షేర్ చేసిన డేటా మెటా ఇతర ప్లాట్‌ఫారమ్‌లతో సులభంగా సింకరైజ్ అవుతుంది. ఈ ఫొటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్ (Instagram) మాదిరిగానే.. ఇప్పుడు, వాట్సాప్ స్టోరీని లింక్ చేసిన ఫేస్‌బుక్ అకౌంట్లలో ఆటోమేటిక్‌గా షేర్ చేసేందుకు యూజర్లకు అనుమతిస్తుంది.
వాట్సాప్ యూజర్లు తమ వాట్సాప్ స్టేటస్‌ను ఆటోమేటిక్‌గా ఫేస్‌బుక్ స్టోరీలకు షేర్ చేయొచ్చు. ముందుగా.. ఆటో షేర్ ఆన్ (Auto Share On) ఫేస్‌బుక్ ఆప్షన్ ఆన్ చేయాల్సి ఉంటుంది. మెటా ప్లాట్‌ఫారమ్‌లలో స్టేటస్‌ను షేర్ చేసేందుకు యూజర్లకు అనుకూలమైన మార్గాన్ని కంపెనీ అందిస్తోంది. వాట్సాప్ డిఫాల్ట్‌గా ఫేస్‌బుక్‌లో షేరింగ్ స్టేటస్ నిలిపివేసింది.
Read Also : WhatsApp New Feature : వాట్సాప్ యూజర్లు ఇకపై ఒకేసారి నాలుగు డివైజ్‌ల్లో లాగిన్ కావొచ్చు.. ఇదిగో ప్రాసెస్..!
అయితే, యాప్ సెట్టింగ్‌లను మార్చడం ద్వారా యూజర్లు ఎప్పుడైనా ఈ ఫీచర్ వినియోగించవచ్చు.. లేదంటే స్టాప్ చేయొచ్చు. ముఖ్యంగా, ‘ఫేస్‌బుక్‌లో ఆటోమేటిక్‌గా షేర్ స్టేటస్’ అప్‌డేట్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తోంది. రాబోయే వారాల్లో వాట్సాప్ యూజర్లు అందరికీ అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ అందుబాటులో ఉన్న వాట్సాప్ యూజర్లు.. ‘Automatically Facebook‘ అనే షేరింగ్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవచ్చు. ఈ కింది విధంగా ఫాలో కావాల్సి ఉంటుంది.

Whatsapp Status Feature : WhatsApp releases Facebook sharing option for status
– WhatsApp స్టోరీ మీడియాను షేర్ చేయండి.
– స్టోరీని షేర్ చేసిన తర్వాత Facebook స్టోరీకి షేర్ స్టేటస్‌ని ఎనేబుల్ చేయండి.
– సెటప్ ఆప్షన్ మీకు కనిపిస్తుంది.
– సెటప్‌పై Tap చేయండి.
– కనిపించే సూచనలను ఫాలో అవ్వండి.
– ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత మీ అన్ని WhatsApp స్టేటస్‌లు ఫేస్‌బుక్‌లో కూడా ఆటోమాటిక్‌గా షేర్ అవుతాయి.
– మీరు ఎప్పుడైనా అదే మెథడ్ అనుసరించి Facebook షేరింగ్‌ని కూడా నిలిపివేయవచ్చు.
వాట్సాప్ యూజర్ల కోసం వారి షేర్డ్ స్టేటస్ ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ద్వారా ప్రొటెక్ట్ చేస్తుంది. వినియోగదారులు తమ స్టేటస్ ఎవరు చూడవచ్చో కూడా ఎంచుకోవచ్చు. ఒకవేళ, వాట్సాప్ యూజర్లు తమ ఫేస్‌బుక్‌తో తమ స్టేటస్‌ను షేర్ చేయడాన్ని ఎంచుకుంటే.. అవసరమైన కనీస డేటా మాత్రమే షేర్ అవుతుంది. వారి వ్యక్తిగత మెసేజ్‌లు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ద్వారా ప్రొటెక్ట్ అవుతాయి. కాంటాక్టులు, ఫోన్ నంబర్‌లను ఫేస్ బుక్‌లో షేర్ కావని గమనించాలి.
మరోవైపు.. వాట్సాప్ యూజర్లు యానిమేటెడ్ ఎమోజీ (Whatsapp Emoji) లను పంపేందుకు అనుమతించే కొత్త ఫీచర్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు నివేదించింది. (WAbeta.info) ప్రకారం.. కొత్త ఎమోజి ఫీచర్ ప్రస్తుతం టెస్టింగ్‌లో ఉంది. ఇటీవలి డెస్క్‌టాప్ బీటాలోనూ జాయిన్ అయింది. ఆండ్రాయిడ్, iOS యూజర్ల కోసం WhatsApp బీటా ఫ్యూచర్ అప్‌డేట్స్‌లో కూడా ఈ ఫీచర్ రానుందని నివేదికలు సూచిస్తున్నాయి. స్టిక్కర్‌లు, GIFలు, స్టాండర్డ్ స్టాటిక్ ఎమోజీలను షేర్ చేసేందుకు కూడా అనుమతించనుంది.
Read Also : WhatsApp Animated Emoji : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. లేటెస్ట్ బీటాలో యానిమేటెడ్ ఎమోజీ వస్తోంది..!