WhatsApp Tips : మీ ఫోన్ స్టోరేజీ సేవ్ చేయాలా? వాట్సాప్‌లో ఫొటో వీడియో ఆటో డౌన్‌లోడ్ డిసేబుల్ చేయండిలా..!

WhatsApp Tips : వాట్సాప్‌లో అనవసరమైన ఫొటోలు, వీడియోలతో మీ ఫోన్ స్టోరేజీ నిండిపోతుందా? అయితే, ఈ ఫోన్ స్టోరేజీని సేవ్ చేసుకోవాలంటే ఇప్పుడే ఇలా చేయండి.

WhatsApp Tips : మీ ఫోన్ స్టోరేజీ సేవ్ చేయాలా? వాట్సాప్‌లో ఫొటో వీడియో ఆటో డౌన్‌లోడ్ డిసేబుల్ చేయండిలా..!

How to save phone's storage space and disable auto-download of photos or videos

WhatsApp Tips : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌ (Whatsapp)ను మిలియన్ల మంది వినియోగదారులు ఉపయోగిస్తున్నారు. చాలామంది వాట్సాప్ గ్రూపులలో పాల్గొంటున్నారు. మీలో కొందరు టన్నుల కొద్దీ ఫొటోలు, వీడియోలు లేదా GIFలను స్వీకరించే గ్రూపులలో ఉండే ఉంటారు. మీరు వాట్సాప్ యాప్‌లో ఒకసారి అనుమతించిన తర్వాత ఆటోమాటిక్‌గా మీ స్మార్ట్‌ఫోన్‌లో డౌన్‌లోడ్ అవుతుంటాయి. ఫ్యామిలీ, ఆఫీసుతో పాటు స్నేహితుల గ్రూపులు వంటి అనేక మీడియా ఫైల్స్ కలిగి ఉంటాయి. కానీ, మీ ఫోన్ స్టోరేజీ స్పేస్ నిండకుండా ఉండాలంటే.. మీ ఫోన్‌లో మొత్తం వాట్సాప్ కంటెంట్ డౌన్‌లోడ్ చేయకూడదు.

ఎందుకంటే.. మీరు సమయాన్ని వెచ్చించవలసి ఉంటుంది. అనవసరమైన మీడియాను డిలీట్ చేయడానికి కొద్దిగా ఎక్కువ సమయం వెచ్చించాల్సి రావొచ్చు. ఈ సమస్యను నివారించడానికి.. ప్రతి చాట్ మీడియా ఆటో-డౌన్‌లోడ్‌ను నిలిపివేయడమే సరైన మార్గం. వాట్సాప్ మీకు ఆప్షన్ అందిస్తుంది. కానీ, ఈ ఫీచర్‌ను నిలిపివేయడం ద్వారా కొన్ని అవసరమైన ఫొటోలు, వీడియోలు ఆటో‌డౌన్ లోడ్ కావని గమనించాలి.

Read Also : WhatsApp Silence Callers Feature : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఆండ్రాయిడ్, ఐఫోన్‌లో ఇక ఫేక్ కాల్స్‌కు చెక్ పడినట్టే..!

వాట్సాప్‌లో ఆటో-డౌన్‌లోడ్ మీడియా అంటే ఏంటి? :
మీరు వాట్సాప్‌లో మీడియా ఫైల్‌ను పొందినప్పుడు.. యాప్ ఆటోమేటిక్‌గా మీ ఫోన్ గ్యాలరీలో సేవ్ చేస్తుంది. మీడియా విజిబిలిటీ ఎంపిక డిఫాల్ట్‌గా ఆన్ అవుతుంది. ఈ ఫీచర్ ఆన్ లేదా ఆఫ్ చేసిన తర్వాత డౌన్‌లోడ్ చేసిన కొత్త మీడియాను మాత్రమే ఈ ఫీచర్ ప్రభావితం చేస్తుంది. అంటే.. అప్పటికే డౌన్‌లోడ్ చేసిన పాత మీడియాకు వర్తించదు. ఫొటోలు, వీడియోల కోసం వాట్సాప్‌లో ఆటో-డౌన్‌లోడ్‌ను ఎలా ఆఫ్ చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

How to save phone's storage space and disable auto-download of photos or videos

How to save phone’s storage space and disable auto-download of photos or videos

* వాట్సాప్‌ని ఓపెన్ చేసి.. ఆటో-డౌన్‌లోడ్‌ని నిలిపే ఏదైనా చాట్‌పై నొక్కండి.
* ఇప్పుడు, చాట్ పేరుపై నొక్కడం ద్వారా ఆ చాట్ ప్రొఫైల్ సెక్షన్‌కు వెళ్లండి.
* కిందికి స్క్రోల్ చేసి, మీడియా విజిబిలిటీపై మళ్లీ నొక్కండి.
* వాట్సాప్‌లో ఆటో డౌన్‌లోడ్‌ని నిలిపివేయడానికి ‘No’పై నొక్కండి.

Note : మీరు ఫీచర్ ఎనేబుల్ చేయాలనుకుంటే.. మీరు అదే విధానాన్ని అనుసరించి ‘No’ బటన్‌కు బదులుగా ‘Yes’పై నొక్కండి.

వాట్సాప్ ఆటో డౌన్‌లోడ్ ఫీచర్ డిసేబుల్ చేశారా? :
మీరు వాట్సాప్‌లో ఫీచర్ డిసేబుల్ చేసిన తర్వాత.. ఆటో-డౌన్‌లోడ్ డిసేబుల్ అవుతుంది. మీరు నిర్దిష్ట చాట్‌లోని ఫొటోలు, వీడియోలు లేదా డాక్యుమెంట్లను మాన్యువల్‌గా డౌన్‌లోడ్ చేయాల్సి ఉంటుందని గుర్తుంచుకోండి. దీనికి పరిష్కారం ఒకటే.. మీకు అనవసరమైన మీడియా అని భావించే గ్రూపులు లేదా వ్యక్తిగత చాట్‌ల కోసం మాత్రమే ఫీచర్‌ని డిసేబుల్ చేయడం మంచిది.

మీరు ఆ చాట్ నుంచి ఏదైనా ముఖ్యమైనది పొందినట్లయితే.. మీ సొంతంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ అదనపు బెనిఫిట్స్ ఏంటంటే.. మీ మొబైల్ డేటాలో కొంత మొత్తాన్ని కూడా సేవ్ చేస్తుంది. మీ ఫోన్‌లోని అన్ని ఫొటోలు, డాక్యుమెంట్లు లేదా వీడియోలను ఆటోమాటిక్ డౌన్‌లోడ్ చేసేందుకు వాట్సాప్ మీ ఇంటర్నెట్‌ని ఉపయోగించకపోతే.. ఆ డేటా సేవ్ అవుతుంది.

Read Also : Realme intelligence Feature : రియల్‌మి ఫోన్లలో ఇంటెలిజెంట్ సర్వీసెస్ ఫీచర్ డిసేబుల్.. యూజర్ల డేటా ఇక సేఫ్.. కొత్త అప్‌డేట్ ఇదిగో..!