వాట్సాప్‌లో మరిన్ని కొత్త ఫీచర్లు వస్తున్నాయ్..!

  • Published By: sreehari ,Published On : September 4, 2020 / 04:50 PM IST
వాట్సాప్‌లో మరిన్ని కొత్త ఫీచర్లు వస్తున్నాయ్..!

Updated On : September 4, 2020 / 5:09 PM IST

ప్రముఖ ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్లను తీసుకొస్తోంది. ఎప్పటికప్పుడూ కొత్త అప్ డేట్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇప్పుడు మరిన్ని కొత్త ఎట్రాక్టీవ్ ఫీచర్లను ప్రవేశపెడుతోంది.. వాట్సాప్ తీసుకొచ్చే కొత్త ఫీచర్లలో Vacation mode, new UI లాంటి మరిన్ని ఫీచర్లు ఉంటాయి.



ఇండియాలో మిలియన్ల మంది యూజర్లు ఉన్న వాట్సాప్.. అందరిని ఆకట్టుకునేందుకు ఈ కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది.. అందులో animated stickers, QR codes కూడా ఉన్నాయి. ఇంతకీ ఆయా ఫీచర్లు ఏంటో ఒక్కొక్కటిగా తెలుసుకుందాం..

Vacation Mode :
ఎంతగానో ఎదురుచూస్తోన్న కొత్త ఫీచర్.. Vacation Mode. ఇదివరకే చాట్ చేసిన మెసేజ్‌లను అదే… archived చాట్ మెసేజ్‌లను mute చేస్తుంది.. చాట్‌కు సంబంధించి archived చేసిన వాటిలో కొత్త మెసేజ్‌లు వచ్చినప్పటికీ కూడా మ్యూట్‌లో ఉంచుతుంది. ఒకవేళ ఏదైనా ఒక చాట్.. వ్యక్తిగత చాట్ లేదా గ్రూపు చాట్‌లో కొత్త మెసేజ్ రాగానే వెంటనే మీకో పాప్ అప్ వస్తుంది. కొత్త మెసేజ్ లు మాత్రం టాప్‌లో కనిపిస్తాయి.. ఈ ఫీచర్ ద్వారా ఆయా మెసేజ్‌లను archive చేయొచ్చు..



New WhatsApp Wallpapers :
వాట్సాప్ అందించే డిఫాల్ట్ వాల్ పేపర్లు వాడుతున్నారా? ఆ వాల్ పేపర్లనే మీ వాట్సాప్ బ్యాక్ గ్రౌండ్ లో వాడుతున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్.. వాట్సాప్ మీ కోసం కొత్త ఫీచర్ తీసుకొస్తోంది.. ఈ ఫీచర్ ద్వారా ఒక్కో చాట్ బాక్సులో వేర్వేరు బ్యాక్ గ్రౌండ్ సెట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి ఈ ఫీచర్ డెవలప్ మెంట్ స్టేజ్ లో ఉంది. రెగ్యులర్ లేదా బీటా యూజర్ల కూడా అందుబాటులో లేదు. అతి త్వరలో ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అందుబాటులోకి రానుంది.

Storage section redesign, Call UI :
మీ వాట్సాప్ అకౌంట్లో Storage Usage Section చూసే ఉంటారు.. దీన్ని వాట్సాప్ సరికొత్తగా రూపొందిస్తోంది.. కొత్త డిస్ ప్లే రాబోతోంది.. ఈ కొత్త ఫీచర్ ద్వారా వాట్సాప్ యూజర్లు తమ స్టోరేజీని సులభంగా వినియోగించుకోవచ్చు.. ఫోన్ స్టోరేజీలో తిష్టవేసిన అవసరంలేని చెత్త ఫైళ్లను డిలీట్ చేసుకోవచ్చు… WABetaInfo ప్రకారం.. వాట్సాప్ UIలో కాల్ స్ర్కీన్‌లో కింది భాగంలోకి ఎలిమెంట్స్ మూవ్ చేస్తోంది. అతి త్వరలో ఈ ఫీచర్ రిలీజ్ కానుంది.



New Sticker animations :
వాట్సాప్ ఇటీవలే యానిమేటెడ్ స్టిక్కర్లు అనే ఫీచర్ ప్రవేశపెట్టింది.. ఇప్పుడు దీనికి కొత్త యానివేషన్ టైప్ తీసుకొస్తోంది. యానిమేటెడ్ స్టిక్కర్లను యాడ్ చేస్తోంది. ఒకసారి ఈ యానిమేటెడ్ స్టిక్కర్లను ఇప్పుడు చాట్ బాక్సులోకి పంపితే 8 సార్లు లూప్ అవుతాయి.. స్టిక్కర్ స్టోర్‌లో కొత్త స్టిక్కర్ ప్యాక్ అనే మోడ్ కూడా రాబోతోంది. నచ్చిన యానిమేటెడ్ స్టిక్కర్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు..