WhatsApp Hide Lock Chats : వాట్సాప్‌లో కొత్త ప్రైవసీ ఫీచర్.. మీ లాక్ చాట్స్ ఈజీగా హైడ్ చేసుకోవచ్చు తెలుసా?

WhatsApp Hide Lock Chats : వాట్సాప్ కొత్త ప్రైవసీ ఫీచర్ తీసుకొస్తోంది. లాక్ చేసిన చాట్స్ కోసం ఎంట్రీ పాయింట్‌ను హైడ్ చేసేందుకు సీక్రెట్ కోడ్ ఫంక్షన్‌తో యూజర్ ప్రైవసీని అభివృద్ధి చేస్తోంది.

WhatsApp Hide Lock Chats : ప్రముఖ మెటా యాజమాన్యంలోని (WhatsApp) యూజర్లు లాక్ చేసిన తమ చాట్‌లను హైడ్ చేసేందుకు అనుమతించనుంది. ప్రస్తుతానికి ఈ కొత్త ప్రైవసీ ఫీచర్‌ (WhatsApp Hide Lock Chats)ను అభివృద్ధి చేసే ప్రక్రియలో ఉన్నట్లు నివేదించింది. కొంతకాలం క్రితమే వాట్సాప్ లాక్ చేసిన సంభాషణల కోసం సీక్రెట్ కోడ్ ఫీచర్‌ను తీసుకొచ్చే పనిలో ఉందని నివేదికలు చెబుతున్నాయి. (WABetaInfo) నివేదిక ప్రకారం.. ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ప్రస్తుతం కొత్త ఫీచర్‌ను రూపొందించే ప్రక్రియలో ఉంది.

లాక్ చాట్‌లను హైడ్ చేయాలంటే.. :
వినియోగదారులు తమ లాక్ చేసిన చాట్‌లను హైడ్ చేసుకునే సామర్థ్యాన్ని అందిస్తుంది. ప్రస్తుతం, లాక్ చేసిన చాట్‌ల జాబితాను యాక్సెస్ చేసేందుకు ఎంట్రీ పాయింట్ చాట్ లిస్ట్‌లో కనీసం ఒక ప్రొటెక్ట్ కన్వర్జేషన్ ఉన్నప్పుడల్లా స్టేబుల్‌గా కనిపిస్తుంది. లాక్ చేసిన సంభాషణలు ఉన్నట్లు ఫోన్ యాక్సెస్ ఉన్న ఎవరికైనా స్పష్టంగా తెలుస్తుంది.

Read Also : WhatsApp Multi Accounts : ఒకే ఫోన్‌లో రెండు వాట్సాప్ అకౌంట్లను వాడొచ్చు తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

ఈ రాబోయే ఫీచర్‌ని ఎనేబుల్ చేయడం ద్వారా యూజర్‌లు సెర్చ్ బార్‌లో సీక్రెట్ కోడ్‌ను ఎంటర్ చేయడం ద్వారా ఎంట్రీ పాయింట్‌ను డిలీట్ చేస్తుంది. తద్వారా లాక్ చేసిన చాట్‌ల లిస్టును బహిర్గతం చేసే అవకాశం ఉంటుంది. వాట్సాప్ ప్రకారం.. లాక్ చేసిన చాట్‌లను యాక్సెస్ చేయడానికి ఎంట్రీ పాయింట్‌ను హైడ్ చేయడానికి ఈ ప్రైవసీ ఫీచర్ అనుమతిస్తుంది.

WhatsApp to feature hide locked chats

వాట్సాప్ పాస్‌వర్డ్ పాస్‌కీ ఫీచర్ :
మెటా యాజమాన్యంలోని వాట్సాప్ ఆండ్రాయిడ్ యూజర్ల కోసం పాస్‌వర్డ్-లెస్ పాస్‌కీ ఫీచర్‌ (Whatsapp Passkey)ను రిలీజ్ చేసే ప్లాన్లను కూడా ప్రకటించింది. తద్వారా అసురక్షితమైన ట్రెడేషనల్ టూ-ఫ్యాక్టర్డ్ SMS అథెంటికేషన్ అవసరాన్ని డిలీట్ చేయడం ద్వారా సెక్యూరిటీ, సౌలభ్యాన్ని అందించేలా రూపొందించామని గత ప్రకటనలో కంపెనీ పేర్కొంది. ఆండ్రాయిడ్ యూజర్లు పాస్‌కీలతో సులభంగా, సురక్షితంగా తిరిగి లాగిన్ చేయవచ్చు. మీ ఫేస్, ఫింగర్ ఫ్రింట్ లేదా పిన్ మాత్రమే మీ వాట్సాప్ అకౌంట్ అన్‌లాక్ చేస్తుంది.

వాట్సాప్ బీటా ఛానల్‌ (Whatsapp Beta Channel)లో పాస్‌కీలు ప్రైవరీ టెస్టింగ్ గురైనప్పటికీ, ఇప్పుడు సాధారణ యూజర్ లొకేషన్ ఎనేబుల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అయినప్పటికీ, ఐఫోన్ యూజర్ల కోసం వాట్సాప్ పాస్‌కీలను చేర్చడానికి సంబంధించి ప్రస్తుతం ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. రాబోయే వారాలు, నెలల్లో పాస్‌కీల కోసం ఆండ్రాయిడ్ సపోర్టు క్రమంగా అందించనుందని కంపెనీ వెల్లడించింది. మీ డివైజ్‌లో పాస్‌కీలు ఉన్న అథెంటికేషన్ పద్ధతులను ఉపయోగించడం ద్వారా సాంప్రదాయ పాస్‌వర్డ్‌లకు ప్రత్యామ్నాయాన్ని అందిస్తాయి.

Read Also : Apple iPhone 12 Discount : ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్ 12పై భారీ డిస్కౌంట్.. ఈ డీల్ ఎలా పొందాలంటే?

ట్రెండింగ్ వార్తలు