Whatsapp Passwordless Key : వాట్సాప్‌‌‌లో కొత్త ఫీచర్.. పాస్‌వర్డ్ లేకుండానే లాగిన్ చేయొచ్చు.. ఎనేబుల్ చేయాలంటే? ఇదిగో ప్రాసెస్..!

Tech Tips in Telugu : వాట్సాప్‌లో కొత్త సెక్యూరిటీ ఫీచర్ వచ్చేసింది. ఇకపై ఆండ్రాయిడ్ యూజర్లు పాస్‌వర్డ్ (Whatsapp passwordless login feature) లేకుండా ఈజీగా లాగిన్ చేయొచ్చు.

Whatsapp Passwordless Key : వాట్సాప్‌‌‌లో కొత్త ఫీచర్.. పాస్‌వర్డ్ లేకుండానే లాగిన్ చేయొచ్చు.. ఎనేబుల్ చేయాలంటే? ఇదిగో ప్రాసెస్..!

Tech Tips in Telugu _ WhatsApp gets passwordless login feature

Whatsapp Passwordless Feature : ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ (Whatsapp) సరికొత్త సెక్యూరిటీ ఫీచర్ వచ్చేసింది. పాస్‌వర్డ్ లెస్ లాగిన్ ఆప్షన్ ద్వారా (WhatsApp passwordless login feature) తమ (Android) అప్లికేషన్ సెక్యూరిటీ, యూజర్ ఎక్స్ పీరియన్స్ అందించనుంది. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ యూజర్లకు మరింత ప్రయోజకరంగా ఉంటుంది. తద్వారా టూ-ఫ్యాక్టర్డ్ SMS అథెంటికేషన్ అవసరం లేదనే చెప్పవచ్చు. వాట్సాప్ లాగిన్ ప్రక్రియను క్రమబద్ధీకరించడంతో పాటు సెక్యూరిటీని మరింత పెంచడం లక్ష్యంగా పెట్టుకుంది.

సాధారణంగా వినియోగదారులు వాట్సాప్ అకౌంట్లను అన్‌లాక్ చేసేందుకు ఫేస్ లాక్, ఫింగర్ ఫ్రింట్ లేదా (PIN)ని ఉపయోగించడానికి అనుమతిస్తుంది. ఈ కొత్త పాస్‌వర్డ్ లెస్ ఫీచర్‌ను గతంలో బీటా వెర్షన్‌లో ఈ ఫీచర్‌ను టెస్టింగ్ చేసింది. ఇప్పుడు సాధారణ ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. దురదృష్టవశాత్తూ, ఐఫోన్ యూజర్లకు వాట్సాప్ పాస్‌కీలు (Whatsapp Passkeys) ఎప్పుడు అందుబాటులోకి వస్తాయనేది అధికారిక సమాచారం లేదు.

Read Also : WhatsApp AI Stickers : వాట్సాప్ యూజర్లు ఏఐ స్టిక్కర్లు క్రియేట్ చేసి షేర్ చేయొచ్చు.. ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

మిలియన్ల కొద్దీ ఆండ్రాయిడ్ వాట్సాప్ యూజర్ల కోసం మరికొద్ది నెలల్లో పాస్‌కీ సపోర్టు పూర్తి స్థాయిలో అందించనుంది. పాస్‌కీలు సాంప్రదాయ పాస్‌వర్డ్‌లకు ప్రత్యామ్నాయాన్ని అందిస్తాయి. మీ డివైజ్‌లో అందుబాటులో ఉన్న స్ట్రాంగ్ అథెంటికేషన్ మెథడ్‌పై ఆధారపడి పనిచేస్తాయి. ఆపిల్ (Apple), గూగుల్ (Google) రెండూ ఇప్పటికే ఈ టెక్నాలజీని స్వీకరించాయి. వినియోగదారులకు పాస్‌కీలకు సపోర్టు అందిస్తాయి. గూగుల్ ప్రత్యేకించి యూజర్లను సంప్రదాయ పాస్‌వర్డ్‌ల నుంచి పాస్‌కీలకు మార్చమని ప్రోత్సహిస్తోంది.

Tech Tips in Telugu _ WhatsApp gets passwordless login feature

Whatsapp Passwordless Feature

గూగుల్ ప్రకారం.. పాస్‌కీలు సాంప్రదాయ పాస్‌వర్డ్‌ల కన్నా దాదాపు 40 శాతం వేగంగా మరింత భద్రతను అందిస్తాయి. ఈ ఏడాది ప్రారంభంలో గూగుల్ కూడా సొంత పాస్‌కీలను అందించింది. ఈ టెక్నాలజీ అథెంటికేషన్‌తో కొత్త టెక్నాలజీని స్వీకరించడానికి సమయం పడుతుందని గూగుల్ పేర్కొంది. సాంప్రదాయ పాస్‌వర్డ్‌లు కొంతకాలం పాటు వాడుకలో ఉండవచ్చు. అయినప్పటికీ, ఆన్‌లైన్ అకౌంట్లకు లాగిన్ చేయడానికి సురక్షితమైన మార్గంగా పాస్‌కీలను వినియోగించవచ్చు. భవిష్యత్తులో ఆండ్రాయిడ్ వాట్సాప్ యూజర్లు ఈ ఫీచర్‌ను పూర్తి స్థాయిలో వినియోగించుకోవచ్చు.

ఆండ్రాయిడ్ వాట్సాప్‌లో పాస్‌కీలను ఎనేబుల్ చేయాలంటే? :
ఈ కొత్త సెక్యూరిటీ ఫీచర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న డివైజ్‌లకు అందుబాటులోకి రాలేదు. వాట్సాప్‌లో కొత్త పాస్‌కీల ఆప్షన్ ఎలా ఎనేబుల్ చేయాలో ఇప్పుడు చూద్దాం.

 WhatsApp gets passwordless login feature

Whatsapp Passwordless Feature in telugu

* వాట్సాప్‌ని ఓపెన్ చేసి Settings మెనుని యాక్సెస్ చేయండి.
* *Account’పై Tap చేయండి.
* ‘Passkeys’ ఎంచుకోండి.
* ‘Create Passkeys’ ఎంచుకోండి.
* Passkey functionality సమాచార PopUp కనిపిస్తుంది.
* ‘Continue’ ఆప్షన్ Tap చేయండి.
* మీరు వాట్సాప్ Passkey క్రియేట్ చేయాలని అనుకుంటున్నారా? గూగుల్ పాస్‌వర్డ్ మేనేజర్ (Google Password Manager) నుంచి ఇలా నోటిఫికేషన్ కనిపిస్తుంది.
* మీ ఫోన్ స్క్రీన్ లాక్ మెథడ్‌లో లాగిన్ ‘Continue’ ఎంచుకోండి. ‘Use screen lock’ని ఎంచుకోండి.
* మీ వాట్సాప్‌లో పాస్‌కీ ఇప్పుడు డిస్‌ప్లే అవుతుంది. వెంటనే ఎనేబుల్ చేసుకోండి.

Read Also : WhatsApp End Support : అక్టోబర్ తర్వాత ఈ ఆండ్రాయిడ్ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.. ఈ లిస్టులో మీ ఫోన్ ఉందేమో చెక్ చేసుకోండి!