WhatsApp AI Stickers : వాట్సాప్ యూజర్లు ఏఐ స్టిక్కర్లు క్రియేట్ చేసి షేర్ చేయొచ్చు.. ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

WhatsApp AI Stickers : వాట్సాప్ యూజర్లు ఇప్పుడు వాట్సాప్‌లో AI ఉపయోగించి సొంత స్టిక్కర్‌లను క్రియేట్ చేసుకోవచ్చు. AI స్టిక్కర్లను యూజర్లకు ప్రాంప్ట్‌ల ఆధారంగా కృత్రిమ మేధస్సు (AI) ద్వారా పనిచేస్తాయని మెటా తెలిపింది.

WhatsApp AI Stickers : వాట్సాప్ యూజర్లు ఏఐ స్టిక్కర్లు క్రియేట్ చేసి షేర్ చేయొచ్చు.. ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

WhatsApp now allow users to create and share AI stickers, here is how

Updated On : October 13, 2023 / 9:27 PM IST

WhatsApp AI Stickers : ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా (Meta) ఇటీవల వాట్సాప్ (WhatsApp) యూజర్ల కోసం అనేక కొత్త AI ఎక్స్‌పీరియన్స్, ఫీచర్లను ప్రకటించింది. వాట్సాప్ యూజర్ల కోసం క్రియేటివిటీ, వ్యక్తీకరణ, ఉత్పాదకత కోసం టూల్స్ అందించే లక్ష్యంతో AI-సపోర్టు గల ఫీచర్‌లలో AI స్టిక్కర్లు ఒకటి.

ఈ ఏఐ స్టిక్కర్ ఫీచర్ వాట్సాప్ యూజర్లకు యాప్‌లో వారి చాట్ ఎక్స్‌పీరియన్స్ మెరుగుపరచుకోవడానికి పవర్ అందిస్తుందని మెటా పేర్కొంది. మెటా అధికారిక బ్లాగ్ పోస్ట్ ప్రకారం.. ‘Llama 2 నుంచి టెక్నాలజీని ‘Emu‘ అనే ఇమేజ్ జనరేషన్ కోసం మోడల్‌ను ఉపయోగించవచ్చు. ఏఐ టూల్ మీ టెక్స్ట్ ప్రాంప్ట్‌లను సెకన్లలో మల్టీపుల్ ప్రత్యేకమైన, హై క్వాలిటీ స్టిక్కర్‌లుగా మారుస్తుంది.

Read Also : WhatsApp Payments : వాట్సాప్‌ యూజర్లకు అలర్ట్.. గూగుల్ పే, పేటీఎం, క్రెడిట్, డెబిట్ కార్డులతో యూపీఐ పేమెంట్స్ చేసుకోవచ్చు..!

ఇప్పటి వరకు, ఈ ఫీచర్ బీటా టెస్టింగ్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే, మెటా అధికారికంగా వాట్సాప్ యూజర్ల కోసం AI స్టిక్కర్ల లభ్యతను ఆవిష్కరించింది. ఈ AI స్టిక్కర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని ఉపయోగించి రూపొందించింది. యూజర్ల ప్రాంప్ట్‌ల ఆధారంగా స్టిక్కర్‌లను ఉత్పత్తి చేస్తుంది. పంపిన తర్వాత ఈ AI స్టిక్కర్‌లు ఆటోమాటిక్‌గా స్టిక్కర్ ట్రేలో కనిపిస్తాయి. ఎప్పుడైనా మీ కాంటాక్టులతో షేర్ చేసుకోవచ్చు.

వాట్సాప్‌లో AI స్టిక్కర్లను ఎలా క్రియేట్ చేయాలి? :
* వాట్సాప్ చాట్ ఓపెన్ చేయండి.
* ‘More’ ఐకాన్ నొక్కండి.
* ‘Create’ ఎంచుకోండి. ప్రాంప్ట్ ద్వారా ‘Continue’ నొక్కండి.
* మీరు క్రియేట్ చేయాలనుకునే స్టిక్కర్ కోసం description ఎంటర్ చేయండి.
* నాలుగు వరకు స్టిక్కర్లు రూపొందించవచ్చు.
* మీరు మీ description ఎడిట్ చేయొచ్చు. అవసరమైతే మళ్లీ Edit చేయొచ్చు.
* ఇప్పుడు స్టిక్కర్‌ను పంపేందుకు Send ఆప్షన్ నొక్కండి.

WhatsApp now allow users to create and share AI stickers, here is how

WhatsApp AI Stickers

మీకు ఇష్టమైన వాటికి స్టిక్కర్‌లను కూడా యాడ్ చేయొచ్చు..
* మీకు ఇష్టమైన AI స్టిక్కర్ ఉన్న చాట్‌ను ఓపెన్ చేయండి.
* మీ చాట్‌లోని స్టిక్కర్‌ను Tap చేయడం లేదా స్టిక్కర్ ట్రేలో స్టిక్కర్‌ను Tap చేసి పట్టుకోండి.
* ‘Add to favorites’ ఆప్షన్ ఎంచుకోండి.

ముఖ్యంగా, (WhatsApp AI) స్టిక్కర్లు ప్రస్తుతం ఇంగ్లీష్ లాంగ్వేజీని మాత్రమే సపోర్ట్ చేస్తాయి. AI స్టిక్కర్‌లను రూపొందించడానికి వినియోగదారులు తప్పనిసరిగా ఆంగ్లంలో description అందించాలి. అదనంగా, ఈ ఫీచర్ ప్రస్తుతం ఎంపిక చేసిన దేశాలలో అందుబాటులో ఉంది. ఇది మీ ప్రాంతంలో అందుబాటులో ఉందో లేదో చెక్ చేయడం మంచిది. ఇంతలో, వినియోగదారులను సురక్షితంగా ఉంచడానికి యూజర్లు అతను లేదా ఆమె అనుచితంగా భావించే ఏదైనా AI స్టిక్కర్‌ను నివేదించవచ్చని వాట్సాప్ హామీ ఇస్తుంది.

ఒక స్టిక్కర్ తప్పు అని మీరు విశ్వసిస్తే.. మీరు దానిని రిపోర్టు చేయొచ్చు. యూజర్లు మీ సర్వీసు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని విశ్వసిస్తే ఆయా యూజర్లను నిషేధించవచ్చు. అలాగే అనుచితమైన AI- రూపొందించిన కంటెంట్‌ను షేర్ చేయకుండా నివారించవచ్చు. ఆటోమాటిక్‌‌గా జనరేట్ చేసిన AI స్టిక్కర్‌ను రిపోర్టు చేయడానికి యూజర్లు ఈ కింది విధంగా ప్రయత్నించవచ్చు.

ఏఐ స్టిక్కర్‌ను రిపోర్టు చేయడానికి :
* మీరు రిపోర్టు చేయాలనుకునే స్టిక్కర్‌ను Tap చేసి పట్టుకోండి.
* ‘More’ ఐకాన్ (>) ఆపై ‘Report’ ఆపై ‘Report’ నొక్కండి.

Read Also : WhatsApp Auto Delete Channels : వాట్సాప్‌లో ఛానల్ క్రియేట్ చేశారా? త్వరలో మీ ఛానల్ ఆటో డిలీట్ చేసుకోవచ్చు..!