WhatsApp Payments : వాట్సాప్‌ యూజర్లకు అలర్ట్.. గూగుల్ పే, పేటీఎం, క్రెడిట్, డెబిట్ కార్డులతో యూపీఐ పేమెంట్స్ చేసుకోవచ్చు..!

WhatsApp Payments : భారత్‌లో వాట్సాప్ యూజర్లు Gpay, Paytm, క్రెడిట్, డెబిట్ కార్డ్‌లపై UPI యాప్‌లను ఉపయోగించి పేమెంట్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

WhatsApp Payments : వాట్సాప్‌ యూజర్లకు అలర్ట్.. గూగుల్ పే, పేటీఎం, క్రెడిట్, డెబిట్ కార్డులతో యూపీఐ పేమెంట్స్ చేసుకోవచ్చు..!

WhatsApp Users in India can now pay using UPI apps like Gpay, Paytm and credit, debit cards

WhatsApp Payments : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) ఇప్పుడు భారత మార్కెట్లో యూజర్లను యూపీఐ యాప్‌లు, డెబిట్ కార్డ్‌లు, క్రెడిట్ కార్డ్‌లు, నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి యాప్‌లో పేమెంట్లను చేయడానికి అనుమతిస్తుంది. మెటా యాజమాన్యంలోని మెసేజింగ్ యాప్ యూజర్ల కోసం మరిన్ని పేమెంట్ ఆప్షన్లను తీసుకురావడానికి Razorpay, PayUతో భాగస్వామ్యం కలిగి ఉంది. ఈ ప్లాట్‌ఫారమ్‌లో కొనుగోళ్లకు వినియోగదారులను ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకుంది.

Read Also : iPhone 15 Battery Option : ఐఫోన్ 15లో కొత్త బ్యాటరీ ఫీచర్.. మీ ఐఫోన్ బ్యాటరీని 80శాతం కన్నా ఛార్జ్ చేయలేరు.. ఎందుకో తెలుసా?

కంపెనీ బ్లాగ్ ప్రకారం.. వాట్సాప్ ఇలాంటి ఫీచర్‌ను తీసుకువస్తోంది. వినియోగదారులు చాట్ చేస్తున్నప్పుడు సులభంగా కొనుగోళ్లు చేయొచ్చు. భారత్‌లోని వాట్సాప్ యూజర్లందరకూ తమ కార్ట్‌కు వస్తువులను యాడ్ చేసుకోవచ్చు. భారత్‌లోని అన్ని యూపీఐ యాప్‌ల ద్వారా డెబిట్, క్రెడిట్ కార్డ్‌ల వంటి వారి ప్రాధాన్య పద్ధతుల ద్వారా పేమెంట్లు చేయవచ్చు. మెసేజ్ పంపినంత సులువుగా ఏదైనా చెల్లించవచ్చు.

WhatsApp Users in India can now pay using UPI apps like Gpay, Paytm and credit, debit cards

WhatsApp Payments in India can now pay using UPI apps like Gpay, Paytm and credit, debit cards

ఆ వాట్సాప్ పేమెంట్లపై నో లిమిట్.. :
వాట్సాప్ పేమెంట్ల కోసం (Razorpay), (PayU)తో భాగస్వామిగా ఉంది. యూపీఐ యాప్‌లలో ఇప్పుడు Google Pay, PhonePe, Paytm మరిన్ని ఉన్నాయి. గతంలోనూ వాట్సాప్‌లో ఈ యాప్‌ల ద్వారా వినియోగదారులు పేమెంట్లు చేసుకోవచ్చు. కానీ, వాట్సాప్ బయటకు రీడైరెక్ట్ అయిన తర్వాత మాత్రమే వీలుంది. ముఖ్యంగా, భారత్‌లో 500 మిలియన్లకు పైగా వాట్సాప్ యూజర్లు ఉన్నారు, అయితే వాట్సాప్ పే వినియోగదారులు 100 మిలియన్లకు మాత్రమే పరిమితమయ్యారు.

వాట్సాప్ ప్రతినిధి మాట్లాడుతూ.. వాట్సాప్ పే (Whatsapp Pay) వినియోగదారులకు భారత్‌లో పరిమితులు ఉంటాయి. ఇతర పద్ధతులను ఉపయోగించి వాట్సాప్‌లోని వ్యాపారాలతో లావాదేవీలు చేసేందుకు అనుమతించిన యూజర్ల సంఖ్యపై అలాంటి పరిమితి లేదని గమనించాలి. ఇప్పటివరకు, రిలయన్స్ ఇండస్ట్రీస్ నిర్వహిస్తున్న ఆన్‌లైన్ గ్రోసరీ సర్వీస్ జియోమార్ట్ (JioMart), చెన్నై, బెంగుళూరులోని మెట్రో సిస్టమ్‌లు భారత్‌లో వాట్సాప్‌లో ఎండ్-టు-ఎండ్ షాపింగ్ ఎక్స్‌పీరియన్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి.

Read Also : Vivo V29 Series Launch : వివో V29 సిరీస్ లాంచ్ డేట్ తెలిసిందోచ్.. ఏయే ఫీచర్లు, ధర ఎంత ఉండొచ్చుంటే?