Whatsapp Join Group : జూమ్ తరహాలో వాట్సాప్‌లో కొత్త ఫీచర్ వస్తోంది..!
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ యూజర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లను రిలీజ్ చేస్తోంది. ఇప్పటికే పలు ఫీచర్లను రిలీజ్ చేసిన వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్‌తో రానుంది.

Whatsapp Join Group Whatsapp To Provide ‘link’ In Future For Users To Join Group Call. Know More
Whatsapp Join Group : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ యూజర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లను రిలీజ్ చేస్తోంది. ఇప్పటికే పలు ఫీచర్లను రిలీజ్ చేసిన వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్‌తో రానుంది.. అదే.. గ్రూపు జాయిన్ లింక్.. అంటే.. ఈ ఫీచర్ ద్వారా Zoom, Webex, Google Meet మాదిరిగా గ్రూపు కాల్ లో జాయిన్ అయ్యేందుకు లింక్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ప్రస్తుతానికి ఈ ఫీచర్ ఈ యాప్స్ లో మాత్రమే అందుబాటులో ఉంది. రాబోయే రోజుల్లో వాట్సాప్ లో కూడా ఈ కొత్త ఫీచర్ యాడ్ కానుంది. సాధారణంగా గూగుల్ మీట్, జూమ్ యాప్స్‌లో గ్రూపు కాల్స్ కోసం యూజర్లు తమ లింక్ క్రియేట్ చేసుకోవచ్చు. అలా క్రియేట్ చేసిన లింకును ఇతరులకు పంపుకునే వీలుంది. అదే తరహాలో వాట్సాప్‌లో కూడా ఈ సరికొత్త ఫీచర్ మెసేజింగ్ ప్లాట్ ఫాంపై రానుంది.
ఇప్పటికే ఈ ఫీచర్ కోసం వాట్సాప్ టెస్టింగ్ మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. వాట్సాప్ గ్రూపులో హోస్ట్ చేసే వ్యక్తి ఈ లింక్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అలా గ్రూపులోని అందరికి ఆ లింకును పంపవచ్చు. మీ మొబైల్ కాంటాక్ట్ లిస్టులో ఉన్నవారే కాదు. మీ మొబైల్ కాంటాక్టు లిస్టులో లేనివారికి కూడా ఈ గ్రూపు జాయిన్ లింక్ పంపుకోవచ్చు. టెస్టింగ్ దశలో ఉన్న ఈ కొత్త ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది అనేది క్లారిటీ లేదు. వాట్సాప్ లో రాబోయే ఈ కొత్త ఫీచర్ డెవలపింగ్ స్టేజీలో ఉందని WhatsApp tracker ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫారమ్‌లో మాత్రమే ఈ ఫీచర్ టెస్టింగ్ జరుగుతోంది. భవిష్యత్తులో ఆండ్రాయిడ్ తర్వాత iOS ఆపై డెస్క్‌టాప్‌కు వచ్చే అవకాశం ఉంది.
వాట్సాప్ లో రాబోయే ఈ కొత్త ఫీచర్ డెవలపింగ్ స్టేజీలో ఉందని WhatsApp tracker ఒక ప్రకటనలో వెల్లడించింది. ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫారమ్‌లో మాత్రమే ఈ ఫీచర్ టెస్టింగ్ జరుగుతోంది. భవిష్యత్తులో ఆండ్రాయిడ్ తర్వాత iOS ఆపై డెస్క్‌టాప్‌కు వచ్చే అవకాశం ఉంది. ఈ ఫీచర్ ద్వారా ఎవరైనా ఫేస్‌బుక్ అకౌంట్ లేకుండా కూడా మెసెంజర్ రూమ్‌లో జాయిన్ కావొచ్చు. మీరు WhatsApp కాల్ లింక్ క్రియేట్ చేసినప్పుడు.. కాల్ WhatsAppలో హోస్ట్ అవుతుంది. ఎండ్-టు ద్వారా మాత్రమే కాల్ కనెక్ట్ అవుతుంది. యూజర్ల ప్రైవసీ పరంగా ఎలాంటి సమస్య ఉండదని అంటోంది. అయితే ఈ గ్రూపులో జాయిన్ కావాలంటే యూజర్ తప్పనిసరిగా WhatsApp అకౌంట్ కలిగి ఉండాలి.
Read Also : Whatsapp Emoji : వాట్సాప్ యూజర్లకు వార్నింగ్.. ఆ ఎమోజీ పంపితే రూ.20లక్షలు ఫైన్, జైలు