WhatsApp Web Users : వాట్సాప్‌ వెబ్ యూజర్లు త్వరలో ఫోన్ నెంబర్ బదులుగా యూజర్ నేమ్‌తో కనెక్ట్ అవ్వొచ్చు..!

WhatsApp Web Users : వాట్సాప్ యూజర్లు త్వరలో తమ ఫోన్ నంబర్‌ను షేర్ చేయకుండానే ఇతర యూజర్లతో ఈజీగా కమ్యూనికేట్ కావచ్చు. మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్ ఇందుకోసం కొత్త ఫీచర్‌పై పనిచేస్తున్నట్టు నివేదిక వెల్లడించింది.

WhatsApp Web Users : వాట్సాప్‌ వెబ్ యూజర్లు త్వరలో ఫోన్ నెంబర్ బదులుగా యూజర్ నేమ్‌తో కనెక్ట్ అవ్వొచ్చు..!

WhatsApp web users will be able to connect with others without disclosing their phone number

Updated On : December 29, 2023 / 8:24 PM IST

WhatsApp Web Users : వాట్సాప్ అనేది ప్రపంచవ్యాప్తంగా అత్యంత విస్తృతంగా ఉపయోగించే మెసేజింగ్ అప్లికేషన్‌లలో ఒకటి. ప్రతిరోజూ బిలియన్ల కొద్దీ వినియోగదారులు ఒకరితో ఒకరు కనెక్ట్ అవుతారు. ఇప్పుడు, అందరూ వాట్సాప్‌లో గుర్తుతెలియని వారితో వాట్సాప్ మెసేజ్ చేయాల్సి వస్తోంది.

ఈ క్రమంలో వాట్సాప్ యూజర్లు ప్రైవసీపరంగా తమ ఫోన్ నంబర్‌ను ఇతరులతో షేర్ చేయడానికి ఆసక్తి చూపడం లేదు. ఉదాహరణకు.. మీరు క్యాబ్‌కి కాల్ చేశారు.. డ్రైవర్ మీ లొకేషన్‌ను షేర్ చేయమని అడుగుతాడు. కానీ, వాట్సాప్‌తో లింక్ చేసిన ఫోన్ నంబర్‌కు వారు యాక్సెస్ పొందడం మీకు ఇష్టం ఉండదు. ఇలాంటి సందర్భాల్లో ఫోన్ నెంబర్ కాకుండా కేవలం యూజర్ నేమ్ ద్వారా కనెక్ట్ అయ్యేలా కొత్త ఫీచర్ రాబోతోంది.

Read Also : Dangerous Android Malware : ఈ 14 యాప్స్‌లో కొత్త డేంజరస్ ఆండ్రాయిడ్ మాల్వేర్.. మీ ఫోన్లో ఉంటే వెంటనే డిలీట్ చేయండి!

ఇటీవలి నివేదికల ప్రకారం.. వాట్సాప్ వినియోగదారులు వారి ఫోన్ నంబర్‌లను బహిర్గతం చేయకుండా ఒకరితో ఒకరు కనెక్ట్ అయ్యేందుకు అనుమతించే ఒక ఫీచర్‌పై పనిచేస్తోంది. తద్వారాఫోన్ నంబర్‌ను షేర్ చేయకుండానే కనెక్ట్ అయ్యేలా వినియోగదారులను వాట్సాప్ అనుమతిస్తుంది. బీటా ఇన్ఫో నివేదిక ప్రకారం.. ఆండ్రాయిడ్ వెబ్‌లోని వాట్సాప్ వినియోగదారులు వారి ప్రొఫైల్‌లను కస్టమైజ్ చేయడానికి యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోవచ్చు. ప్రత్యేకమైన ఐడెంటిఫైయర్‌ని ఉపయోగించి స్నేహితులు, కుటుంబం, ఇతర కాంటాక్టులతో కనెక్ట్ అవ్వడాన్ని యూజర్లను అనుమతిస్తుంది.

సెర్చ్ బార్‌లో యూజర్‌నేమ్‌ ఎంటర్ చేస్తే చాలు :
వాట్సాప్ అకౌంట్లలో యూజర్ నేమ్ ఎంచుకున్న తర్వాత వారి ఫోన్ నంబర్ ప్రైవేట్‌గా ఉంటుంది. ఈ అదనపు భద్రతా యూజర్లు తమ వ్యక్తిగత కాంటాక్టు వివరాలను బహిర్గతం చేయకుండా ఇతరులతో కమ్యూనికేట్ చేయగలరు. అలాగే, యూజర్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు తమ యూజర్ నేమ్ మార్చుకోవచ్చు. అంతే కాదు, ఈ ప్రత్యేకమైన యూజర్‌నేమ్‌ని ఉపయోగించడం ద్వారా యూజర్లు ఇతర యూజర్ల కోసం వెతకడానికి వీలు కల్పించే ఫీచర్‌పై వాట్సాప్ కూడా పని చేస్తోంది.

WhatsApp web users will be able to connect with others without disclosing their phone number

WhatsApp web users disclosing phone number

బీటా ఇన్ఫో షేర్ చేసిన స్క్రీన్‌షాట్ ప్రకారం. సెర్చ్ బార్‌లో యూజర్‌నేమ్‌ను ఎంటర్ చేయడం ద్వారా వినియోగదారులు ఇతర యూజర్ల కోసం సెర్చ్ చేయొచ్చునని వెల్లడించింది. అందువల్ల, యూజర్లు వాట్సాప్‌లో కనిపించేలా ఇకపై వారి ఫోన్ నంబర్ అవసరం లేదు. వారి ఫోన్ నెంబర్ స్థానంలో యూజర్ పేరును ఎంటర్ చేయడం ద్వారా వారితో కనెక్ట్ కావచ్చు. ఈ ఫీచర్ యాప్ మొబైల్, వెబ్ వెర్షన్‌లలో కూడా అందుబాటులో ఉంటుంది.

వాట్సాప్ వెబ్ కొత్త డార్క్ మోడ్ :
వాట్సాప్ వెబ్ వెర్షన్ డార్క్ థీమ్ కోసం కొత్త బ్యాక్‌గ్రౌండ్ కలర్‌పై పనిచేస్తోందని బీటా ఇన్ఫోలోని గత నివేదిక వెల్లడించింది. తక్కువ-కాంతి వాతావరణంలో యూజర్ల కళ్ళపై పడే ఒత్తిడిని తగ్గిస్తుంది. కలర్ డార్క్ థీమ్ కోసం ప్రత్యేకంగా రూపొందించినట్టు నివేదిక పేర్కొంది.

#111b20 నుంచి #12181cకి మారడం అనేది సూక్ష్మమైన మార్పును తీసుకువస్తుందని, కంటి ఒత్తిడిని తగ్గించేలా ఇంటర్‌ఫేస్ విజువల్ అప్పీల్‌ను మెరుగుపరుస్తుందని నివేదిక పేర్కొంది. ఈ కొత్త అప్‌డేట్ అధికారికంగా వాట్సాప్ ద్వారా ధృవీకరించలేదు. అయితే, కొన్ని బీటా టెస్టర్ల కోసం భవిష్యత్ అప్‌డేట్‌లో భాగంగా వినియోగదారులకు అందుబాటులో ఉంటుందని నివేదిక పేర్కొంది. దీనితో పాటు, వాట్సాప్ వెబ్ వెర్షన్ సైడ్‌బార్‌ను కూడా ఎడ్జెస్ట్ చేస్తోంది.

Read Also : iQoo Neo 9 and Pro Series Launch : అద్భుతమైన కెమెరాలతో ఐక్యూ నియో 9 సిరీస్ వచ్చేసింది.. ధర, ఫీచర్ల వివరాలివే!