WhatsApp Multi-Account : వాట్సాప్‌‌లో మల్టీ అకౌంట్ ఫీచర్.. ఒకే ఫోన్‌లో 2 అకౌంట్లు వాడొచ్చు.. ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

WhatsApp Multi Account : వాట్సాప్ యూజర్లకు అలర్ట్. 2024 అప్లికేషన్ అప్‌డేట్ వచ్చేసింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా యూజర్లు ఒక డివైజ్‌లో రెండు అకౌంట్లను ఉపయోగించవచ్చు. ఈ ఫీచర్ ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.

WhatsApp Multi-Account : వాట్సాప్‌‌లో మల్టీ అకౌంట్ ఫీచర్.. ఒకే ఫోన్‌లో 2 అకౌంట్లు వాడొచ్చు.. ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

WhatsApp Multi Account

WhatsApp Multi-Account : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తమ యూజర్ల కోసం సరికొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా మల్టీ అకౌంట్లను ఒకే డివైజ్‌లో వాడొచ్చు. భారత మార్కెట్లో అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్ అప్లికేషన్లలో వాట్సాప్ ఒకటి. రెగ్యులర్ అప్‌డేట్‌లు, టాప్ ఫీచర్‌లతో అందుబాటులో ఉంది. ఈ ప్లాట్‌ఫారమ్‌లో ఇప్పటికే గత ఏడాదిలో ప్రధాన వాట్సాప్ అప్‌డేట్‌లలో మల్టీ అకౌంట్ సపోర్టు, మల్టీ డివైజ్ సపోర్టు, పిన్ మెసేజ్‌లు, లాక్ స్క్రీన్ నుంచి రిప్లయ్, పోల్స్ క్విజ్‌లు, స్క్రీన్ షేర్ వంటివి మరెన్నో ఉన్నాయి.

Read Also : TVS Apache RTR 160 Series : సరికొత్త బ్లాక్ ఎడిషన్‌తో టీవీఎస్ అపాచీ RTR 160 సిరీస్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతంటే?

ఈ ఫీచర్లను ఎలా ఉపయోగించాలి? :
మల్టీ అకౌంట్ సపోర్టు వాట్సాప్ ఫీచర్‌‌ను పరిశీలిస్తుంది. వాట్సాప్ పర్సనల్ నంబర్ ద్వారా సపోర్టు ఇస్తుంది. మీ ఫోన్ డ్యూయల్ సిమ్‌కు సపోర్టు కలిగినప్పటికీ యూజర్లు రెండు అకౌంట్లను వాట్సాప్ అనుమతించలేదు. కానీ, ఇకపై అలా కాదు. 2024 అప్లికేషన్ అప్‌డేట్ వచ్చింది. తద్వారా యూజర్లు ఒక డివైజ్‌లో రెండు అకౌంట్లను ఉపయోగించవచ్చు.

మల్టీపుల్ అకౌంట్ సపోర్ట్ ఫీచర్ అంటే ఏంటి? : 
వాట్సాప్ యూజర్లు ఒకే డివైజ్‌‌లో అకౌంట్ల మధ్య మారవచ్చు. ఆండ్రాయిడ్‌లో ఒకేసారి 2 వాట్సాప్ అకౌంట్లను లాగిన్ చేసే సామర్థ్యాన్ని అందిస్తుంది. మీరు పర్సనల్ లేదా ఆఫీసు వర్క్ చాట్‌ల మధ్య మారాల్సిన ప్రతిసారీ ఒకేసారి రెండు ఫోన్‌లను తీసుకెళ్లడం లేదా లాగ్ అవుట్ చేయాల్సిన అవసరం ఉండదు. ఈ ఫీచర్‌కి ఇప్పటికీ రెండో నంబర్‌ కలిగి ఉండాలి.

మల్టీ అకౌంట్ సపోర్టును ఎలా సెటప్ చేయాలి? :
వాట్సాప్ అకౌంట్ సెటప్ చేయడానికి రెండో ఫోన్ నంబర్, సిమ్ కార్డ్ లేదా మల్టీ-సిమ్ లేదా ఇసిమ్ సపోర్టు అవసరం. మీ వాట్సాప్ సెట్టింగ్‌లను ఓపెన్ చేసి ప్రొఫైల్ నేమ్ పక్కన ఉన్న యారోపై క్లిక్ చేసి ‘Add Account’ క్లిక్ చేయండి. మీరు ప్రతి అకౌంట్లలో మీ ప్రైవసీ, నోటిఫికేషన్ సెట్టింగ్‌లను కంట్రోల్ చేయొచ్చు. మీ అప్లికేషన్ అప్‌డేట్ చేసి ఉండాలి. ఆ తర్వాత టాప్ రైట్ కార్నర్‌లో ఉన్న త్రిడాట్స్ మెను ఐకాన్ నొక్కండి. సెట్టింగ్‌లను ఎంచుకోండి. సెట్టింగ్‌ల పేజీలో మీ ప్రొఫైల్ ట్యాబ్ పక్కన ఉన్న డ్రాప్-డౌన్ ఆప్షన్‌పై నొక్కండి. డ్రాప్-డౌన్ ఆప్షన్ అకౌంట్‌ను ఆప్షన్ అందిస్తుంది.

వాట్సాప్ అకౌంట్ కోసం మరో కాంటాక్టు నంబర్‌ తీసుకోవాలి. ఆ తర్వాత 6 అంకెల వెరిఫైడ్ కోడ్‌ను ఎంటర్ చేయొచ్చు. ప్రొఫైల్ ఫొటోను ఎంచుకోవడం ద్వారా మీ ప్రొఫైల్ డేటాను ఎంటర్ చేయండి. ప్రొఫైల్ పేరును టైప్ చేయండి. ఆ తర్వాత ‘Next’ ఆప్షన్ నొక్కండి. అప్పటినుంచి రెండో అకౌంట్ అదే యాప్‌కి లాగిన్ అవుతుంది. మీరు టాప్ రైడ్ కార్నర్‌లో త్రిడాట్ మెనూ కింద ఉన్న స్విచ్ అకౌంట్స్ ఆప్షన్ ఉపయోగించి ఈ అకౌంట్ల మధ్య మారవచ్చు. ఈ అకౌంట్లను ఎక్స్చేంజ్ చేసుకోవడానికి మరో మార్గం.. మీ ప్రొఫైల్ ట్యాబ్ పక్కన డ్రాప్-డౌన్ ఆప్షన్ ఎంచుకోవాలి.

Read Also : Mahindra XUV700 AX5 : మహీంద్రా ఎక్స్‌యూవీ700 AX5 కారు వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే? పూర్తి ధరల జాబితా ఇదే!