WhatsApp Feature : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. మీ స్టేటస్‌ను నేరుగా ఫేస్‌బుక్‌లో షేర్ చేసుకోవచ్చు తెలుసా?
WhatsApp Feature : వాట్సాప్‌లో త్వరలో ఇంట్రెస్టింగ్ ఫీచర్ రాబోతోంది. మీ స్టేటస్‌ను నేరుగా ఫేస్‌బుక్ (Facebook)లో షేర్ చేసుకునేందుకు అనుమతించనుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌పై వాట్సాప్ పనిచేస్తోంది.

WhatsApp’s upcoming feature will let users directly share status updates on Facebook from WhatsApp
WhatsApp Feature : ప్రముఖ మెటా (Meta) యాజమాన్యంలోని ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp)లో సరికొత్త ఫీచర్ రానుంది. ఈ కొత్త ఫీచర్ ద్వారా వాట్సాప్ స్టేటస్ అప్‌డేట్‌ను నేరుగా ఫేస్‌బుక్‌లో షేర్ చేసేందుకు అనుమతించనుంది. ప్రస్తుతానికి ఇదే ఫీచర్‌పై వాట్సాప్ పని చేస్తోంది. (WABetaInfo) నివేదికల ప్రకారం.. (WhatsApp) కొత్త ఫీచర్‌ను డెవలప్ చేస్తోంది. వాట్సాప్ యూజర్లు (Whatsapp Users) తమ స్టేటస్ అప్‌డేట్‌లను యాప్ నుంచి మారకుండానే Facebook స్టోరీలకు షేర్ చేసేందుకు అనుమతిస్తుంది.
ఈ కొత్త ఫీచర్ ద్వారా యూజర్లు తమ స్టేటస్ అప్‌డేట్‌లను రెండు ప్లాట్‌ఫారమ్‌లలో షేర్ చేసేందుకు అనుమతిస్తుంది. ప్రస్తుతం, వాట్సాప్ యూజర్లు (Instagram)లో మాత్రమే తమ స్టేటస్ షేర్ చేసుకునే వీలుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన అదే స్టేటస్ అప్‌డేట్‌ను ఫేస్‌బుక్‌లో కూడా షేర్ చేసేందుకు యూజర్లను అనుమతించనుంది.

WhatsApp Feature : Users directly share status updates on Facebook from WhatsApp
ఇంతకుముందు, వాట్సాప్ యూజర్లు (Facebook) స్టోరీలకు స్టేటస్ అప్‌డేట్స్ షేర్ చేసే వీలుంది. కానీ, కొత్త పోస్ట్ పెట్టిన ప్రతిసారీ మాన్యువల్‌గా షేర్ చేయాల్సి వచ్చేది. రాబోయే.. ఈ కొత్త ఫీచర్‌తో ఆప్షన్ ఆటోమాటిక్‌గా యూజర్లకు అనుమతించనుంది. నివేదిక ప్రకారం.. వాట్సాప్‌లోని స్టేటస్ ప్రైవసీ సెట్టింగ్‌లో కొత్త ఆప్షన్ కనిపిస్తోంది. వాట్సాప్ యూజర్లు తమ ఫేస్‌బుక్ అకౌంట్లో స్టేటస్ యాడ్ చేసుకోవచ్చు. అయితే, ఈ ఆప్షన్ డిఫాల్ట్‌గా కనిపించదు. యూజర్లు తమ స్టేటస్ అప్‌డేట్స్ ఫేస్‌బుక్ స్టోరీలకు షేర్ చేయాలనుకుంటే నేరుగా ఓపెన్ చేయాల్సి ఉంటుంది.
ఫేస్‌బుక్ స్టోరీస్‌లో స్టేటస్ అప్‌డేట్‌ల మాదిరిగా మాన్యువల్‌గా షేర్ చేయాల్సిన పనిలేదు. తద్వారా యూజర్లకు సమయం కూడా ఆదా అవుతుంది. ఆండ్రాయిడ్ (Android), ఐఓఎస్ (iOS) యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. వాట్సాప్ ‘Audio Chats‘ అనే కొత్త ఫీచర్‌పై పనిచేస్తోందని తెలిపింది. ఆండ్రాయిడ్‌లో అప్లికేషన్ ఫ్యూచర్ అప్‌డేట్‌లో చాట్స్‌లోనే అందుబాటులో ఉండనుంది.
ఈ ఫీచర్ చాట్ హెడర్‌లో కొత్త ఐకాన్ కలిగి ఉంటుంది. వాట్సాప్ యూజర్లు (Whatsapp Users) తమ ఆడియో చాట్‌లను ఓపెన్ చేసుకోవచ్చు. వాట్సాప్ కాల్ మాట్లాడుతుండగానే ఎండ్ చేయడానికి (Red) బటన్‌ను కలిగి ఉంటుంది. అదేవిధంగా, కొత్త ఆడియో చాట్స్ ఫీచర్ యాప్‌లో ఒకరితో ఒకరు కమ్యూనికేట్ అయ్యేందుకు యూజర్లను అనుమతిస్తుంది. రాబోయే రోజుల్లో ఈ ఫీచర్‌లు అందుబాటులోకి రానున్నాయి.