iPhone 16 vs iPhone 17 : అత్యంత సరసమైన ధరకే కొత్త ఆపిల్ ఐఫోన్ 17.. అదే ధరకు ఐఫోన్ 16 ఎందుకు కొనాలంటే? ఫుల్ డిటెయిల్స్..!
iPhone 16 vs iPhone 17 : ఆపిల్ కొత్త ఐఫోన్ కొంటున్నారా? ఐఫోన్ 16 ధరలో కొత్త ఐఫోన్ 17 తక్కువకు వస్తుంటే ఎలా కొనుగోలు చేయాలో ఇప్పుడు చూద్దాం..

iPhone 16 vs iPhone 17
iPhone 16 vs iPhone 17 : కొత్త ఆపిల్ ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఐఫోన్ 17 ఇటీవలే లాంచ్ అయింది. ఆశ్చర్యకరంగా, ఈ ఆపిల్ ఐఫోన్ ప్రారంభ లాంచ్ ధర కన్నా భారీ తగ్గింపు ధరకే లభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ వంటి ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు గతంలో పాత ఐఫోన్ 16పై భారీ డీల్స్ అందించాయి.
ఇదంతా ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 16 ఆర్డర్‌లు రద్దు (iPhone 16 vs iPhone 17) చేయడానికి ముందు రూ. 51,999 ప్రారంభ ధరకు విక్రయించాయి. ప్రస్తుతం ఐఫోన్ 16 దాదాపు రూ. 69,999 నుంచి అందుబాటులో ఉంది. ఐఫోన్ 16 కన్నా ఐఫోన్ 17 తగ్గింపు ధరకే వస్తుంటే ఐఫోన్ 16 ఎందుకు కొనాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఐఫోన్ 17పై బంపర్ ఆఫర్ :
ఐఫోన్ 17 ప్రారంభ ధర రూ.82,900కి లాంచ్ అయింది. ప్రస్తుతం లాంచ్ ధర కన్నా రూ.6వేలు తక్కువకు లభిస్తుంది. ప్రస్తుత ఆఫర్ల ద్వారా బేస్ ధర మరింత తగ్గింపు పొందింది. తద్వారా మరింత సరసమైన ధరకే కొనుగోలు చేయొచ్చు.
క్రోమాలో డిస్కౌంట్ల వివరాలివే :
ప్రారంభ డిస్కౌంట్ : ఐఫోన్ 17 ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ తర్వాత రూ. 76,900 ప్రారంభ ధరకు లభిస్తుంది.
ఎక్స్ఛేంజ్ ఆఫర్ : మీ పాత ఫోన్‌ను ఎక్స్చేంజ్ చేసి గరిష్టంగా రూ. 15వేలు ఎక్స్ఛేంజ్ వాల్యూ పొందవచ్చు. తద్వారా ఈ ఐఫోన్ 17 ప్రారంభ ధర కేవలం రూ. 61,900కి తగ్గుతుంది. ఐఫోన్ 16 256GB వేరియంట్ ధర ప్రస్తుతం రూ. 79,900గా ఉంది. ఇలా అయితే ఈ తగ్గింపు ధరకు కొత్త ఐఫోన్ 17 కొనేసుకోవడం బెటర్.
ఐఫోన్ 17 కీలక ఫీచర్లు :
కొత్తగా లాంచ్ అయిన ఐఫోన్ 17 ప్రీమియం ఫీచర్లతో వస్తుంది.
డిస్‌ప్లే : 6.3-అంగుళాల ప్రోమోషన్ డిస్‌ప్లే కలిగి ఉంది. 10Hz నుంచి 120Hz వరకు వేరియబుల్ రిఫ్రెష్ రేట్‌కు సపోర్టు
ప్రొటెక్షన్, బ్రైట్‌నెస్ : డిస్‌ప్లే సిరామిక్ షీల్డ్ 2 ద్వారా ప్రొటెక్షన్, 3000 నిట్‌ల వరకు టాప్ బ్రైట్‌నెస్ సపోర్టు
పర్ఫార్మెన్స్ : అత్యాధునిక 3nm టెక్నాలజీపై లేటెస్ట్ A19 బయోనిక్ చిప్‌సెట్
ఆపరేటింగ్ సిస్టమ్ : ఈ ఐఫోన్ iOS 26 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది.
కెమెరా స్పెసిఫికేషన్లు :
ఐఫోన్ 17 అడ్వాన్స్ డ్యూయల్-కెమెరా సిస్టమ్ కలిగి ఉంది.
బ్యాక్ కెమెరాలు :
ఇందులో 48MP మెయిన్ ఫ్యూజన్ కెమెరా, 2× ఆప్టికల్ జూమ్‌కు సపోర్టు ఇచ్చే 12MP టెలిఫోటో కెమెరా ఉన్నాయి.
ఫ్రంట్ కెమెరా : వీడియో కాల్స్ కోసం డెడికేటెడ్ సెంటర్ స్టేజ్ కెమెరా, సెల్ఫీల కోసం AI అప్‌గ్రేడ్స్, వైడ్-యాంగిల్, పోర్ట్రెయిట్ ఫొటోలు, 18MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంది.