రెడ్‌మీ నోట్ 7 ప్రొ ధర, మార్కెట్లోకి ఎప్పుడంటే..

జియోమీ కంపెనీ ఫోన్ రిలీజ్‌కు ముందే టీజర్‌లా ఓ ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేసి సంబంధిత సమాచారం మార్కెట్ లో ఉంచింది.  గతేడాది అక్టోబర్‌లోనే క్వాల్ కామ్ 11నానో మీటర్ల స్నాప్ డ్రాగన్ 675 ప్రొసెసర్‌ను ప్రవేశపెట్టింది.

రెడ్‌మీ నోట్ 7 ప్రొ ధర, మార్కెట్లోకి ఎప్పుడంటే..

Updated On : January 21, 2019 / 11:18 AM IST

జియోమీ కంపెనీ ఫోన్ రిలీజ్‌కు ముందే టీజర్‌లా ఓ ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేసి సంబంధిత సమాచారం మార్కెట్ లో ఉంచింది.  గతేడాది అక్టోబర్‌లోనే క్వాల్ కామ్ 11నానో మీటర్ల స్నాప్ డ్రాగన్ 675 ప్రొసెసర్‌ను ప్రవేశపెట్టింది.

జియోమీ రెడ్‌మీ మొబైల్స్ నుంచి మరో కొత్త మోడల్ మార్కెట్లోకి రానుంది. ఇప్పటికే చైనాలో లాంచ్ అయిపోయిన రెడ్ మీ నోట్ 7 ప్రొ మోడల్‌ను ఫిబ్రవరిలో భారత మార్కెట్‌లోకి తీసుకురానున్నారు. ఈ సందర్భంగా ఆన్‌లైన్‌లో ఆ ప్రొడక్ట్ వివరాలు లీకైయ్యాయి. క్వాల్ కామ్ స్నాప్‌డ్రాగన్ 675 ప్రోసెసర్‌తో  మొబైల్ నడవనుంది. అంతకుముందే మార్కెట్లోకి వచ్చిన రెడ్‌మీ 2 ప్రొ కూడా అదే ప్రొసెసర్‌తో మార్కెట్లోకి రానుంది. మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్‌లో సంబంధిత అధికారి దీని ధర 1,499యూఆన్‌లు అని పేర్కొన్నాడు. అంటే దాదాపు ఇది భారత్‌లో రూ.16వేలు కావొచ్చని అంచనా.

జియోమీ కంపెనీ ఫోన్ రిలీజ్‌కు ముందే టీజర్‌లా ఓ ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేసి సంబంధిత సమాచారం మార్కెట్ లో ఉంచింది.  గతేడాది అక్టోబర్‌లోనే క్వాల్ కామ్ 11నానో మీటర్ల స్నాప్ డ్రాగన్ 675 ప్రొసెసర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్రాసెసర్‌లో ఆక్టా కోర్ క్రియో 675 సీపీయూతో అడ్రెనో 612 జీపీయూ కూడా అనుసంధానించారు. ఈ ఫోన్ 48 మెగా పిక్సెల్ సోనీ ఐఎమ్ఎక్స్ 586 ప్రైమరీ సెన్సార్‌తో పాటు రెడ్‌మీ నోట్ 48ఎమ్‌పీ శాంసంగ్ ఐసోసెల్ జీఎమ్1 సెన్సార్‌ను కూడా కల్గి ఉంది. 

రెడ్‌మీ నోట్ 7 మూడు ర్యామ్/అంతర్గత స్టోరేజి సదుపాయాలుగా అందుబాటులోకి రానుంది. 3జీబీ ర్యామ్/32జీబీ ఇంటర్నల్ స్టోరేజి ఫోన్ (సుమారు రూ10వేలు), 4జీబీ ర్యామ్/64జీబీ ఇంటర్నల్ స్టోరేజి ఫోన్ (సుమారు రూ12వేలు), 6జీబీ ర్యామ్/64జీబీ ఇంటర్నల్ స్టోరేజి ఫోన్ (సుమారు రూ14వేలు)అయితే ఇవన్నీ సుమారుగా మాత్రమే తెలిపిన కంపెనీ గ్లోబల్ ధరను మాత్రం వెల్లడించలేదు. 

ఫోన్‌లో ఉన్న ఇతర ఫీచర్లు:

  •  రెడ్‌మీ నోట్ 7 ప్రొ 2340 x 1080 రిసొల్యూషన్‌తో కూడిన 6.3 అంగుళాల హెచ్‌డీ స్క్రీన్
  •  3జీబీ/4జీబీ/6జీబీలతో కూడిన క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్
  •  32జీబీ, 64 జీబీలతో పాటుగా ఎక్స్‌పాండబుల్ మెమొరీ కార్డు సదుపాయం.
  •  గూగుల్ ఆండ్రాయిడ్ 9.0 ఆపరేటింగ్ సిస్టమ్‌తో ఎమ్ఐయూఐ 10 కవర్‌తో కూడి ఉంటుంది. 
  •  అనుసంధానించబడి ఉండే 4,000ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం ఉంది. క్వాల్‌కమ్ క్విక్ ఛార్జ్ 4.0ద్వారా వెంటనే చార్జింగ్ అయ్యే సదుపాయంతో ఉంది
  •  రెడ్‌మీ నోట్ 7 స్పోర్ట్స్ ప్రైమరీ సెన్సార్ 48ఎమ్‌పీతో పాటు సెకండరీ సెన్సార్ 5 ఎమ్‌పీ ఉండనుంది. ముందుభాగంలో 13ఎమ్‌పీ సెన్సార్‌ కలిపి అన్ని సదుపాయాలతో మార్కెట్‌లోకి రానుంది.