Xiaomi : ఫేస్ బుక్‌కు ధీటుగా షావోమీ స్మార్ట్ గ్లాసెస్, రకరకాల ఫీచర్స్
చైనీస్ స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ తొలిసారి ‘వేరబుల్ డివైజ్ కాన్సెప్ట్’ పేరిట స్మార్ట్ గ్లాసెస్ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.

Smart
Xiaomi Smart Glasses : టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. రోజుకో కొత్త కొత్త ఆవిష్కరణలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటివి వస్తాయా ? అని ఊహించలేని మార్పులు..చేర్పులు జరుగుతున్నాయి. స్మార్ట్ యుగంలో మరింత స్మార్ట్ గా మార్చేస్తూ..అనేక రకాల గ్యాడ్జెట్స్ వస్తున్నాయి. ఫోన్ తో చేసే పనులకు ఇక కాలం చెల్లిపోతుందా ? అనే డౌట్స్ వస్తున్నాయి. ఫోన్ ద్వారా చేసేవి ఇక నుంచి కళ్లజోడు నుంచి కూడా చేయొచ్చు. సోషల్ మీడియాలో ఫేస్ బుక్ ..ఇప్పటికే స్మార్ట్ గ్లాసెస్ రూపొందించిన సంగతి తెలిసిందే.
Read More : Face Mask Covid : ఫేస్ మాస్క్‌తో కొవిడ్‌ను నిర్ధారించవచ్చు.. ఈ సెన్సార్ టెక్నాలజీతో సాధ్యమేనట!
‘రే బాన్ స్టోరీస్’ పేరిట గ్లాసెస్ అమ్మకాలు ప్రారంభించింది. వీటితో…ఫొటోలు, వీడియోలను క్యాప్చర్ చేయవచ్చు. కళ్లజోడుతో ఏదైనా ఫేస్ బుక్ లో ఇతరులతో లైవ్ లో పంచుకోవచ్చు. దీనికి పోటీగా…చైనీస్ స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ తొలిసారి ‘వేరబుల్ డివైజ్ కాన్సెప్ట్’ పేరిట స్మార్ట్ గ్లాసెస్ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. స్మార్ట్ గ్లాస్ లా ఉండే ఈ కళ్లజోడులో రకరకాల ఫీచర్స్ ఉన్నాయి. నోటిఫికేషన్లు పంపించడం, ఫోన్ కాల్స్ మాట్లాడడం, నావిగేషన్, ఇమేజ్ లను క్యాప్చర్ చేయడం వంటివి ఈజీగా చేసుకొనేలా రూపొందించారు. టెక్ట్స్ ను సైతం ట్రాన్స్ లేట్ చేసుకొనే సౌకర్య ఉంది.
Read More : Facebook : స్మార్ట్ గ్లాసెస్‌తో వీడియో, ఫొటోలు క్లిక్..రికార్డు చేయొచ్చు!
బ్యాక్ లైటింగ్ కోసం 2.4 MMX2.02 MM పరిణామంలో మైక్రో LED డిస్ ప్లే, మల్టీపుల్ కలర్స్ డిస్ట్రబ్ చేయకుండా ఒక్క కలర్ మాత్రమే కనిపించేలా మోనోక్రోమ్ ప్యానెల్ ను రూపకల్పన చేసింది. ఫొటోలు తీసేందుకు.. 5 మెగాపిక్సెల్ కెమెరా, డ్యూయల్ మైక్స్, స్పీకర్, బ్లూ టూత్, వైఫై, టచ్‌ప్యాడ్, ఆండ్రాయిడ్ వెర్షన్ కోసం క్వాడ్ కోర్ అడ్వాన్స్డ్ రిస్క్ మెషిన్(ARM) ప్రాసెసర్ ఉంది. దీనిని పెట్టుకోవడం వల్ల కళ్లకు ఎలాంటి సమస్య రాదని వెల్లడిస్తోంది. అందంగా కనిపించే వీలుగా…మైక్రోలెడ్ డిస్ ప్లే, ఫేస్ బుక్ స్మార్ట్ గ్లాసెస్ లాగే, షావోమీ..వాయిస్ అసిస్టెంట్ షావోఏఐని వినియోగించుకోవచ్చు.
Introducing #XiaomiSmartGlasses, our first pair of smart eyewear.
Imagine every smartphone function integrated into what you wear.? #NeverStopExploring https://t.co/jdykEJX4UT
— Xiaomi (@Xiaomi) September 14, 2021