Face Mask Covid : ఫేస్ మాస్క్‌తో కొవిడ్‌ను నిర్ధారించవచ్చు.. ఈ సెన్సార్ టెక్నాలజీతో సాధ్యమేనట!

ఫేస్ మాస్క్‌లతో కొవిడ్-19 నిర్ధారణ సాధ్యమేనని అంటున్నారు హార్వర్డ్ అండ్ MIT రీసెర్చర్లు అంటున్నారు. సరికొత్త సెన్సార్ టెక్నాలజీ ద్వారా కొవిడ్-19 నిర్ధారించవచ్చునని చెబుతున్నారు. కొవిడ్ నిర్ధారణ కోసం రీసెర్చర్లు ఓ కొత్త సెన్సార్ టెక్నాలజీని డెవలప్ చేశారు.

Face Mask Covid : ఫేస్ మాస్క్‌తో కొవిడ్‌ను నిర్ధారించవచ్చు.. ఈ సెన్సార్ టెక్నాలజీతో సాధ్యమేనట!

Face Mask That Can Detect Covid

Face mask that can detect COVID : ఫేస్ మాస్క్‌లతో కొవిడ్-19 నిర్ధారణ సాధ్యమేనని అంటున్నారు హార్వర్డ్ అండ్ MIT రీసెర్చర్లు అంటున్నారు. సరికొత్త సెన్సార్ టెక్నాలజీ ద్వారా కొవిడ్-19 నిర్ధారించవచ్చునని చెబుతున్నారు. కొవిడ్ నిర్ధారణ కోసం రీసెర్చర్లు ఓ కొత్త సెన్సార్ టెక్నాలజీని డెవలప్ చేశారు. ఈ ఫేస్ మాస్క్ ధరించినవారికి కరోనావైరస్ ఉందో లేదో వెంటనే తెలుసుకోవచ్చునని అంటున్నారు. మహమ్మారి వ్యాప్తిని నివారించడంలో అద్భుతంగా పనిచేస్తుందని చెబుతున్నారు హార్వర్డ్ యూనివర్శిటీ రీసెర్చర్లు. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైంటిస్టులు ఈ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. ఈ ఫేస్ మాస్క్ ధరించడం ద్వారా శ్వాసలో కరోనావైరస్ కణాలు ఉన్నాయో లేదో 90 నిమిషాల్లో గుర్తించగలదు. ఈ మేరకు పరిశోధకులు విడుదల చేసిన శాస్త్రీయ అధ్యయనంలో వెల్లడించారు.

ఫేస్ మాస్క్ పై అమర్చిన సెన్సార్ ఫీచర్.. బటన్-యాక్టివేట్ అవుతుంది. ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్టు మాదిరిగానే రిజల్ట్స్ చూసుకోవచ్చు. ఫలితాలు గోల్డ్-స్టాండర్డ్ పాలిమరేస్ చైన్ రియాక్షన్ (PCR) పరీక్షల వలె ఖచ్చితమైనవి అని పరిశోధకులు స్పష్టం చేశారు. ఫేస్ మాస్క్‌లతో పాటు, ప్రోగ్రామబుల్ బయోసెన్సర్‌లను ఇతర వస్త్రాలతో కలిపి ధరించడం ద్వారా ప్రమాదకరమైన పదార్థాలను ముందుగానే గుర్తించవచ్చునని చెబుతున్నారు. మూడేళ్ల పరిశోధన ఫలితమే ఈ టెక్నాలజీ అని పరిశోధకులు తెలిపారు. శాస్త్రవేత్తలు మొదట ఈ టెక్నాలజీని 2015లో జికా వైరస్‌ను గుర్తించడానికి ఒక టూల్ ఉపయోగించారు. అందులో ఫలితాలు సానుకూలంగా వచ్చాయి. ఇప్పుడు మరికంత సాంకేతికతను జోడించి ఫేస్ మాస్క్ మాదిరిగా ధరించగలిగేలా డెవలప్ చేశారు. ఈ పరిశోధనకు డిఫెన్స్ థ్రెట్ రిడక్షన్ ఏజెన్సీ, హార్వర్డ్ యూనివర్శిటీ జాన్సన్ & జాన్సన్ నిధులు సమకూర్చాయి.

ఈ ఫేస్ మాస్క్ ధరించేవారు స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ ద్వారా హానికరమైన కెమికల్స్ కు గురికాకుండా జాగ్రత్త పడవచ్చు. ఈ టెక్నాలజీని ప్రమాదకర పదార్థాలు లేదా వ్యాధికారక పదార్థాలతో పనిచేసే శాస్త్రవేత్తలు, వైద్యులు, నర్సులు, సైనిక సిబ్బంది యూనిఫాంలు ప్రమాదకరమైన వ్యాధికారక లేదా విషపూరిత వాయువులకు గురయ్యే ప్రదేశాల్లో వినియోగించుకోవచ్చునని చెప్పారు. కరోనా మహమ్మారి సమయంలో ఈ టెక్నికల్ ఫేస్ మాస్క్‌ను ఉత్పత్తి చేసే భాగస్వాముల కోసం పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు.