AC Common Mistakes : వేసవిలో ఏసీ వాడుతున్నారా? ఈ కామన్ మిస్టేక్స్ అసలు చేయొద్దు.. లేదంటే భారీ మూల్యం చెల్లించక తప్పదు!

AC Common Mistakes : ఏసీల వాడకం విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఏ మాత్రం చిన్న మిస్టేక్ చేసినా ఏసీ తొందరగా పాడైపోతుంది. రిపేరింగ్ ఖర్చుల బిల్లు తడిసి మోపెడుతు అవుతుంది..

AC Common Mistakes : వేసవిలో ఏసీ వాడుతున్నారా? ఈ కామన్ మిస్టేక్స్ అసలు చేయొద్దు.. లేదంటే భారీ మూల్యం చెల్లించక తప్పదు!

AC Common Mistakes

Updated On : April 13, 2025 / 4:32 PM IST

AC Common Mistakes : అసలే ఎండకాలం.. ఎండలు మండిపోతున్నాయి. వేసవి కాలంలో గరిష్టంగా ఏప్రిల్, మేలో ఎయిర్ కండిషనర్లు ఎక్కువ వాడేస్తుంటారు. ఎండ వేడిని తట్టుకునేందుకు వినియోగదారులు రోజువారీ ఏసీలను వాడుతుంటారు. కానీ, ఎండలు పెరిగేకొద్దీ ఏసీ వాడకంలో అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే కొత్త ఏసీ కూడా తొందరగా పాడైపోయే అవకాశం ఉంటుంది.

Read Also : Vivo V50e Sale : వివో లవర్స్‌కు పండగే.. భారీ బ్యాటరీతో వివో V50e ఫోన్.. ఈ నెల 17 నుంచే ఫస్ట్ సేల్.. డోంట్ మిస్..!

చాలా మంది తమ ఎయిర్ కండిషనర్లను ఉపయోగిస్తున్నప్పుడు చేసే ఒక సాధారణ మిస్టేక్ ఒకటే.. అదేపనిగా ఏసీలను డైరెక్టుగా ఆఫ్ చేస్తుంటారు. ఇలా చేయడం వల్ల ఏసీలు దెబ్బతిని తరచూ రిపేర్లు చేయాల్సి వస్తుంది. మీ ఏసీ వేసవి సీజన్ అంతటా పనిచేయాలని కోరుకుంటే.. మీరు ఇప్పటినుంచే ఏసీని తప్పుగా ఆఫ్ చేయడం మానుకోవాలి. ఇంతకీ ఏసీ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పవర్ స్విచ్‌తో ఏసీ స్విచ్ ఆఫ్ చేయొద్దు :
చాలా మంది వినియోగదారులు రిమోట్‌ని వాడకుండా నేరుగా వాల్ స్విచ్ నుంచి ఏసీలను ఆపివేస్తారు. దీనివల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని అనుకుంటారు. కానీ, దీర్ఘకాలంలో మీ ఎయిర్ కండిషనర్‌ను తీవ్రంగా దెబ్బతీస్తుంది.

ముఖ్యంగా విండో, స్ప్లిట్ మోడల్స్‌కు సరైనది కాదు. ఇలా తరచుగా చేయడం వల్ల ఏసీ ముఖ్యమైన భాగాలు పాడైపోతాయి. దాంతో పదేపదే మెకానిక్‌ దగ్గరకు తీసుకెళ్లి రిపేరింగ్ చేయాల్సి వస్తుందని ఎక్స్‌పర్ట్స్ హెచ్చరిస్తున్నారు.

కంప్రెసర్ ఫెయిల్యూర్ ముప్పు : :
ఏ ఎయిర్ కండిషనర్‌కైనా కంప్రెసర్ అనేది గుండెలాంటిది. వాల్ స్విచ్‌తో ఒక్కసారిగా పవర్ కట్ చేస్తే.. అది సిస్టమ్‌కు అకస్మాత్తుగా పవర్ కట్ అవుతుంది. కంప్రెసర్‌పై తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తుంది. చివరికి బ్రేక్‌డౌన్‌ అవుతుంది. కంప్రెసర్ రిపేర్లు లేదా రిప్లేస్‌మెంట్స్ చాలా ఖరీదైనవి. చివరికి ఏసీలో కూలింగ్ లేకుండా పోతుంది.

కూలింగ్ కెపాసిటీ తగ్గడం :
ఏసీని సరైన విధంగా ఆఫ్ చేయడం వల్ల కూలింగ్ కెపాసిటీ దెబ్బతింటుంది. ఇలా ప్రతిసారి చేయడం వల్ల కంప్రెసర్ వీక్ అవుతుంది. చివరికి మొత్తం కూలింగ్ సిస్టమ్‌పై ప్రభావం చూపవచ్చు. ఫలితంగా మీ గది అంత త్వరగా కూల్ కాదు. అసలు కూలింగ్ కాకపోవచ్చు. అసౌకర్యంతో పాటు పవర్ వినియోగం కూడా భారీగా పెరుగుతుంది.

మోటారు, ఫ్యాన్‌ పనిచేయవు :
ఏసీ మోటారు, ఇంటర్నల్ ఫ్యాన్ సరైన విధంగా షట్‌డౌన్ చేయాలి. స్విచ్‌ని ఉపయోగించి అకస్మాత్తుగా పవర్ ఆఫ్ చేయొద్దు. అలా చేస్తే తొందరగా కాలిపోయే ప్రమాదం ఉంది. అంతేకాదు.. వాటి లైఫ్ టైమ్ కూడా తగ్గుతుంది. కాలక్రమేణా, ఈ పార్ట్స్ అరిగిపోవచ్చు లేదా పనిచేయకపోవచ్చు.

Read Also : Jio Annual Plan : జియో బంపర్ ఆఫర్.. ఈ రీచార్జ్ ప్లాన్‌తో 912GB హైస్పీడ్ డేటా, ఫ్రీ కాల్స్, OTT బెనిఫిట్స్.. ఏడాదంతా ఎంజాయ్ చేయొచ్చు!

పవర్ సాకెట్లు కాలిపోవచ్చు :
ఎయిర్ కండిషనర్లకు ఉపయోగించే పవర్ సాకెట్లు, స్విచ్‌లు వెంటనే కాలిపోతుంటాయి. తరచుగా స్విచ్ ఆఫ్ చేయడం వల్ల ఫ్యూజ్‌లు, సర్క్యూట్ బోర్డులతో సహా ఇంటర్నల్ పవర్ భాగాలు పాడైపోతాయి.
ఫలితంగా రిపేరింగ్ ఖర్చులు భారీగా పెరిగిపోతాయి.

ఏసీని  ఎలా ఆఫ్ చేయాలి? :
మీ ఏసీని ఎల్లప్పుడూ ఆఫ్ చేసేందుకు రిమోట్‌ని వాడండి. ఇంటర్నల్ పార్ట్స్ ఎలాంటి నష్టం జరగకుండా యూనిట్ సురక్షితంగా పవర్ ఆఫ్ అయ్యేలా చేస్తుంది. అవసరమైతే స్విచ్ నుంచి పవర్ కట్ చేసే ముందు మెషిన్‌ను క్రమంగా షట్ డౌన్ చేయనివ్వండి. ఈ ఒక్క మిస్టేక్ ఆపితే మీ ఏసీ లైఫ్ టైమ్ మరింత పొడిగించవచ్చు. రిపేర్ల కోసం డబ్బు వృథా చేయాల్సిన అవసరం ఉండదు.