Threads Account Delete : థ్రెడ్స్ యూజర్లకు అలర్ట్.. ఇన్‌స్టాగ్రామ్ నుంచే థ్రెడ్స్ అకౌంట్ డిలీట్ చేసుకోవచ్చు తెలుసా?

Threads Account Delete : ఇన్‌స్టాగ్రామ్ నుంచి నిష్క్రమించకుండానే వినియోగదారులు తమ అకౌంట్లను డిలీట్ చేసేందుకు థ్రెడ్స్ త్వరలో అనుమతించనుంది. ప్రస్తుతం ఇన్‌స్టాగ్రామ్ (Instagram Account) యూజర్లు అకౌంట్‌ నుంచి థ్రెడ్స్ అకౌంట్ డిలీట్ చేయలేరు.

Threads Account Delete : థ్రెడ్స్ యూజర్లకు అలర్ట్.. ఇన్‌స్టాగ్రామ్ నుంచే థ్రెడ్స్ అకౌంట్ డిలీట్ చేసుకోవచ్చు తెలుసా?

You will soon be able to delete your Threads account without leaving Instagram

Updated On : September 27, 2023 / 9:02 PM IST

Threads Account Delete : ప్రముఖ మెటా (Meta) టెక్స్ట్-ఆధారిత సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ థ్రెడ్స్ (Threads) యాప్ ఈ 2023 జూలైలో ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్‌ (X)కు పోటీగా అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్ ప్రారంభమైన 5 రోజుల్లోనే మిలియన్ల కొద్దీ డౌన్‌లోడ్‌లను పొందింది. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు అయితే, థ్రెడ్స్ అకౌంట్ (Threads Account) సులభంగా క్రియేట్ చేసేందుకు అనుమతి ఉంది. మీరు థ్రెడ్స్ ఉపయోగించడానికి మీ ఇన్‌స్టాగ్రామ్ లాగిన్ వివరాలతో లాగిన్ చేయవచ్చు.

మీరు థ్రెడ్స్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత ఇన్‌స్టాగ్రామ్ నుంచి నిష్క్రమించకుండానే మీ అకౌంట్ డిలీట్ చేయడం కుదరదు. మరో మాటలో చెప్పాలంటే.. ఒక యూజర్ వారి థ్రెడ్స్ అకౌంట్ డిలీట్ చేసినట్టుయితే తమ (Instagram) అకౌంట్ కూడా ఆటోమాటిక్‌గా డిలీట్ అవుతుంది. కానీ, ఇటీవలి నివేదికల ప్రకారం.. ఇన్‌స్టాగ్రామ్ నుంచి నిష్క్రమించకుండానే యూజర్లు వారి థ్రెడ్స్ అకౌంట్ డిలీట్ చేసుకునేలా మెటా కంపెనీ అనుమతించనుంది.

థ్రెడ్స్ అకౌంట్ డిలీట్ చేసేందుకు అనుమతి :
టెక్ క్రంచ్ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది చివరి నాటికి ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లను కూడా డిలీట్ చేయకుండా వినియోగదారులు తమ థ్రెడ్స్ అకౌంట్లను డిలీట్ చేసేలా మెటా యోచిస్తోంది. ప్రొడక్టుకు సంబంధించిన మెటా చీఫ్ ప్రైవసీ అధికారి (Michel Protti) కంపెనీ ప్లాన్ల గురించి రివీల్ చేశారు. థ్రెడ్స్ లాంచ్ అయినప్పుడే ఫీచర్ ఎందుకు లేదనే దానిపై ప్రోట్టి మాట్లాడుతూ.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎటువంటి ప్రభావం లేకుండా థ్రెడ్స్ అకౌంట్ డిలీట్ చేసేలా అనుమతించడం పెద్ద సవాలుగా ప్రోట్టి చెప్పారు.

Read Also : Instagram Reel Duration : ఇన్‌స్టా యూజర్లకు గుడ్ న్యూస్.. ఇకపై రీల్స్ 90 సెకన్లు కాదు.. 10 నిమిషాలకు పొడిగింపు..!

అందువల్ల, మెటా టీమ్ (Meta Team) మొత్తం కంటెంట్‌ను హైడ్ చేయడం లేదా అకౌంట్ ఇన్‌యాక్టివ్ చేయడం ద్వారా దానిని ప్రైవేట్‌గా సెట్ చేయడం లేదా ప్రైవేట్ థ్రెడ్స్ డిలీట్ చేయడం ద్వారా యూజర్లు ఇప్పటికీ వారి డిలీట్ రైట్స్ వినియోగించుకోవచ్చు.

థ్రెడ్స్, ట్విట్టర్ మధ్య తేడాలివే :
థ్రెడ్స్ ట్విట్టర్‌ని పోలి ఉండే వివిధ ఫీచర్లను కలిగి ఉన్నాయి. మెటా యాజమాన్యంలో యాప్‌లోని కంటెంట్ ఫీడ్ యాక్సస్ చేసేందుకు ఫాలోయింగ్ కేటగిరీలుగా విభజించింది. థ్రెడ్స్‌పై మీ ఫీడ్ ఇప్పుడు రెండు ఆప్షన్లలో ఇతర ప్రొఫైల్స్ నుంచి పోస్ట్‌లను వీక్షించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది.

Threads Users Alert

Threads Account Delete

మీరు ఫాలో చేయడానికి ఎంచుకున్న ప్రొఫైల్‌లు, సిఫార్సు చేసిన అకౌంట్ల నుంచి పోస్ట్‌లను కలిగిన థ్రెడ్స్ ఫీడ్ వ్యూను పొందవచ్చు. మీరు కాలక్రమానుసారం ఫాలో అయ్యే యూజర్ల నుంచి పోస్ట్‌లను కూడా పొందేలా కొత్త ఫీచర్‌ ఉంటుందని కంపెనీ తెలిపింది.

థ్రెడ్స్ ట్రాన్సులేట్ ఫీచర్‌ కూడా :
ఇది కాకుండా, థ్రెడ్స్ ట్రాన్సులేట్ ఫీచర్‌ (Threads Translate Feature)ను కూడా లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా, యూజర్ ఫీడ్‌లోని థ్రెడ్స్ పోస్ట్‌లు లాంగ్వేజీలో వీక్షించే యూజర్ లాంగ్వేజీ సెట్టింగ్‌లలో ఆటోమాటిక్‌గా ట్రాన్సులేట్ అవుతాయి. మీరు వేరే భాషలో థ్రెడ్‌ని చూసినట్లయితే.. మీ లాంగ్వేజీ ట్రాన్సులేట్ అందుబాటులో ఉంటే.. మీరు పోస్ట్‌కు దిగువన కుడివైపున ఉన్న ట్రాన్సులేట్ బటన్‌ను నొక్కవచ్చు లేదా రిప్లయ్ ఇవ్వవచ్చు.

అలాగే, థ్రెడ్స్, ట్విట్టర్ రెండూ, రిపోర్ట్, లైక్, కామెంట్‌తో సహా అనేక మార్గాల్లో పోస్ట్‌లు చేసేందుకు యూజర్లను అనుమతిస్తాయి. రెండు యాప్‌లు టెక్స్ట్-ఆధారిత సోషల్ మీడియా యాప్‌లు, అయితే ఇటీవల Twitter (X) యూజర్లు పొడవైన వీడియోలను అప్‌లోడ్ చేసేందుకు అనుమతించింది.

Read Also : Threads First Update : మెటా ‘థ్రెడ్స్‘ ఫస్ట్ మేజర్ అప్‌డేట్ ఇదిగో.. ఇక యూజర్లకు పండగే.. ట్విట్టర్‌కు పోటీగా కొత్త ఫీచర్లు..!