Puvvada Ajay Kumar : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పదికి పది అసెంబ్లీ స్థానాలు గెలిచి కేసీఆర్ కు గిఫ్టుగా ఇవ్వాలి : మంత్రి పువ్వాడ
ఓట్ల కోసం వస్తున్న కాంగ్రెస్ వాళ్లు కరోనా సమయంలో కాకరకాయ అయినా పంచిపెట్టారా అని అడిగారు. ఏజెన్సీ ఏరియాను ఏ రుగ్మతలైతే బాధ పెట్టాయో వాటిని దూరం చేశామని తెలిపారు.

Minister Puvvada Ajay Kumar
Puvvada Ajay Kumar – Manuguru : పినపాక నియోజకవర్గ ప్రజలకు బుల్లెట్ లాంటి ఎమ్మెల్యే ఉన్నాడని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. వేరొక ఎమ్మెల్యే ఉంటే ఈ నియోజకవర్గానికి ఇన్నిసార్లు వచ్చే వాడిని కాదన్నారు. మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో ఐదు సంవత్సరాల కాలంలో ఇన్ని కోట్ల నిధులు తీసుకొచ్చిన మొనగాడు ఎవరైనా ఉన్నారా అది కేవలం రేగా కాంతా రావుకు మాత్రమే సాధ్యం అన్నారు.
ఈ మేరకు శనివారం పువ్వాడ అజయ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో మీడియాతో మాట్లాడారు.
70 రోజులు కష్టపడితే అధికారం మనదే అవుతుందని తెలిపారు. ఓట్ల కోసం వస్తున్న కాంగ్రెస్ వాళ్లు కరోనా సమయంలో కాకరకాయ అయినా పంచిపెట్టారా అని అడిగారు. ఏజెన్సీ ఏరియాను ఏ రుగ్మతలైతే బాధ పెట్టాయో వాటిని దూరం చేశామని తెలిపారు.
Raghunandan Rao : బీఆర్ఎస్ లో చేరితేనే బీసీ బంధు ఇస్తామని బ్లాక్ మెయిల్ : ఎమ్మెల్యే రఘునందన్ రావు
వరదలు వచ్చినప్పుడు తాము ప్రజల్లో ఉంటే ఇప్పుడు బయటికి వచ్చి మాట్లాడే నాయకులు ఎక్కడ ఉన్నారో చెప్పాలన్నారు. గడిచిన రెండు దఫాల ఎన్నికలు జరిగితే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క సీటు మాత్రమే గెలిచింది కానీ అభివృద్ధి మాత్రం ఆగలేదన్నారు. అందుకు భిన్నంగా మూడోసారి పదికి పది అసెంబ్లీ స్థానాలు గెలిచి కేసీఆర్ కు గిఫ్టుగా ఇవ్వాలన్నారు.