MLC Candidates : టీఆర్‌ఎస్‌ లోకల్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..!

టీఆర్‌ఎస్‌ నుంచి 12 మంది లోకల్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారైనట్లు తెలుస్త్తోంది. పెద్దల సభకు పంపే నేతల లిస్ట్‌కు సీఎం కేసీఆర్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం.

MLC Candidates : టీఆర్‌ఎస్‌ లోకల్ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే..!

Trs Mlc

Updated On : November 21, 2021 / 6:37 PM IST

TRS Local MLC candidates : టీఆర్‌ఎస్‌ నుంచి 12 మంది లోకల్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారైనట్లు తెలుస్త్తోంది. పెద్దల సభకు పంపే నేతల లిస్ట్‌కు సీఎం కేసీఆర్‌ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చినట్లు సమాచారం. సిట్టింగ్‌లలో ఐదుగురికే మరో చాన్స్ ఇవ్వగా.. తెరపైకి ఏడు కొత్త ముఖాలు వచ్చినట్లు తెలుస్తోంది. 12మంది ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎల్లుండి నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.

సిట్టింగ్‌లలో కరీంనగర్ నుంచి భానుప్రసాద్, వరంగల్ నుంచి పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, రంగారెడ్డి నుంచి శంభీపూర్‌ రాజు, పట్నం మహేందర్‌రెడ్డి, మహబూబ్‌నగర్ నుంచి కసిరెడ్డికి మరోసారి అవకాశం ఇచ్చారు. కొత్తగా ఏడుగురికి ఎమ్మెల్సీ ఛాన్స్‌ ఇచ్చారు. ఆదిలాబాద్ ఎమ్మెల్సీ పురాణం సతీశ్ స్థానంలో దండే విఠల్ కు అవకాశం ఇచ్చారు. 2014 ఎన్నికల్లో దండే విఠల్ సనత్‌నగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు.

Tragedy : కన్నతండ్రి ఎదుటే వాగులో కొట్టుకుపోయి అక్కాతమ్ముడు మృతి

కరీంనగర్ నుంచి నారదాసు స్థానంలో ఎల్.రమణ, నల్లగొండ నుంచి తేరా చిన్నపరెడ్డి స్థానంలో ఎంసీ కోటిరెడ్డికి ఛాన్స్‌ ఇచ్చారు. నిజామాబాద్ నుంచి మరోసారి పోటీకి కవిత ఆసక్తి చూపలేదు. మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలితకు అవకాశం ఇచ్చారు. ఖమ్మం ఎమ్మెల్సీ కోసం హోరాహారీ పోటీ సాగింది. చివరికి సిట్టింగ్ ఎమ్మెల్సీ బాలసాని స్థానంలో తాతా మధుకు ఛాన్స్ ఇచ్చారు.

మెదక్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి స్థానంలో డాక్టర్ యాదవరెడ్డికి ఛాన్స్ ఇచ్చారు.  మహబూబ్‌నగర్ నుంచి దామోదరరెడ్డి స్థానంలో సింగర్‌ సాయిచంద్ కు అవకాశం ఇచ్చారు. ఖరారైన 12మంది అభ్యర్థులు రేపు నామినేషన్‌ వేయనున్నారు.