తెలంగాణలో కొత్తగా 1410 కరోనా కేసులు…ఏడుగురు మృతి

తెలంగాణలో 30 వేల కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో కొత్తగా 1410 కరోనా కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో ఇవాళ కరోనాతో ఏడుగురు మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా నుంచి మరో 913 మంది బాధితులు కోలుకున్నారు. తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు 30,946కి చేరాయి. తెలంగాణలో ఇప్పటివరకు కరోనాతో 331 మంది మృతి చెందారు.
రాష్ట్రంలో 12,423 యాక్టివ్ కేసులున్నాయి. 18, 192 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు 1,40,755 శ్యాంపిళ్లను పరీక్షించగా ఇవాళ 5,954 మందికి పరీక్షలు నిర్వహించారు. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 918 కరోనా కేసులు నమోదు అయ్యాయి.
రంగారెడ్డి 125, సంగారెడ్డి 79, మేడ్చల్ 67, వరంగల్ అర్బన్ 34, కరీంనగర్ 32, భద్రాద్రి కొత్తగూడెం 23, నల్గొండ 21, నిజామాబాద్ 18, మెదక్ 17, సూర్యపేట 10, మహబూబ్ నగర్ 8, రాజన్న సిరసిల్ల 8, వరంగల్ (రూరల్) 7, భూపాలపల్లి 6 చొప్పున కరోనా బారిన పడ్డారు.
వికారాబాద్ 5, మహబూబాబాద్ 5, కామారెడ్డి, యాదాద్రి, జనగామ, వనపర్తి, గద్వాల్ లో రెండేసీ చొప్పున కరోనా కేసులు నమోదు అయ్యాయి. జగిత్యాల, పెద్దపల్లి ఆదిలాబాద్, ములుగు, సిద్ధిపేట్ లో ఒక్కో కేసు నమోదు అయింది.
Read Here>>కరోనా వచ్చిన వ్యక్తి ఇళ్లకు ప్రత్యేక నోటీసు బోర్డు…