తెలంగాణలో ఒక్కరోజే 1,597 కరోనా కేసులు…11 మంది మృతి

తెలంగాణలో బుధవారం (జులై 15, 2020) 1,597 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఇందులో ఒక్క గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోనే 796 నమోదయ్యాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 39,342 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
కరోనా బారిన పడి బుధవారం 11 మంది మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 386 కు చేరింది. ఇవాళ 1,159 మంది వైరస్ నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 25,999 మంది డిశ్చార్జ్ అయ్యారు. మరో 12,958 మంది మంది హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్నారు.
రంగారెడ్డి 212, మేడ్చల్ 115, సంగారెడ్డి 75, సంగారెడ్డి 73, నల్గొండ 58, వరంగల్ అర్బన్ 44, కరీంనగర్ 41, కామారెడ్డి 30, సిద్ధిపేట 27, మంచిర్యాల 26, పెద్దపల్లి 20, మెదక్ 18, జయశంకర్ భూపాలపల్లి 15, సూర్యపేట 14, యాదాద్రి 13 మందికి కరోనా సోకింది.
జనగాం 8, భద్రాద్రి కొత్తగూడెం 7, రాజన్నసిరిసిల్ల 6, ఖమ్మం 6, నారాయణపేట 5, వికారాబాద్ 5, నాగర్ కర్నూలు 5, వనపర్తి 5, మహబూబాద్ 5, ములుగు 4, గద్వాల 4, ఆదిలాబాద్ జిల్లాలో ఒకరు కరోనా బారిన పడ్డారు.