18 Sarpanches Resign : బీఆర్ఎస్‌కు షాక్.. 18మంది సర్పంచ్‌లు రాజీనామా, ఆ ఎమ్మెల్యేనే కారణమట..!
ఆసిఫాబాద్ జిల్లాలో సర్పంచ్ లు బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చారు. 18 మంది సర్పంచ్ లు బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఎమ్మెల్యే ఆత్రం సక్కు తీరుకి నిరసనగా వాంకిడి మండలానికి చెందిన 18 మంది సర్చంచ్ లు రాజీనామా చేశారు.

18 Sarpanches Resign : ఆసిఫాబాద్ జిల్లాలో సర్పంచ్ లు బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చారు. 18 మంది సర్పంచ్ లు బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. ఎమ్మెల్యే ఆత్రం సక్కు తీరుకి నిరసనగా వాంకిడి మండలానికి చెందిన 18 మంది సర్చంచ్ లు రాజీనామా చేశారు. ఆదివాసీ సమస్యలపై చర్చించేందుకు ఎమ్మెల్యే తమకు సమయం ఇవ్వడం లేదని ఆరోపించారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలానికి సంబంధించి ఆదివాసీ సర్పంచ్ లు మొత్తం 18 మంది మూకుమ్మడిగా బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. దీనికి కారణం ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జెడ్పీ చైర్ పర్సన్ కోవా లక్ష్మి అని వారు చెబుతున్నారు. ఎమ్మెల్యే తమకు సహకరించడం లేదని.. నిధులు, అభివృద్ధి పనులకు సంబంధించి ఎమ్మెల్యే నుంచి తమకు ఎలాంటి సహకారం లేదని సర్పంచ్ లు ఆరోపించారు.
మూకుమ్మడిగా రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను ఎంపీపీకి అందించారు. ఈ వ్యవహారం బీఆర్ఎస్ శ్రేణుల్లో కలకలం రేపింది. ఈ విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే ఆత్రం సక్కు.. సర్పంచ్ లను పిలిపించి మాట్లాడారు. వారికి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వారికి ఉన్న ఇబ్బందులు, ఎలాంటి అభివృద్ధి పనుల్లో ఆటంకం కలిగింది అనే విషయాలు చెప్పిన తర్వాత ఈ సమస్య ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.