కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్‌ బోల్తా.. 20 మందికి తీవ్ర గాయాలు

కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్‌ బోల్తా.. 20 మందికి తీవ్ర గాయాలు

Updated On : January 22, 2021 / 9:42 AM IST

20 people injured in road accident : మహబూబాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. నెల్లికుదురులో కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్‌ బోల్తా పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 20 మంది గాయపడ్డారు. మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి నుంచి 30 మంది ఇసుక ఎత్తేందుకు ట్రాక్టర్‌లో వెళ్తున్నారు.

అయితే కొద్దిదూరం వెళ్లాకా ఉదయం 6 గంటల ప్రాంతంలో ట్రాక్టర్‌ అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న 20 మంది కూలీలకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

క్షతగాత్రులను చికిత్స కోసం 108 అంబులెన్సులో సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. వీరిలో నలుగురికి తీవ్రంగా గాయాలవడంతో  మెరుగైన చికిత్స కో్సం మహబూబాబాద్‌లోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.