Corona : తెలంగాణలో కొత్తగా 220 కరోనా కేసులు
తెలంగాణలో కొత్తగా 220 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో ఒకరు మృతి చెందారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,65,504కు చేరింది.

Corona
corona cases in Telangana : తెలంగాణలో కొత్తగా 220 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో ఒకరు మృతి చెందారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,65,504కు చేరింది. 24 గంటల వ్యవధిలో ఒకరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 3,915కు చేరింది.
ఒక్కరోజులో కరోనా నుంచి కోలుకుని 255 మంది డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 6,57,040కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,549 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇవాళ 44,200 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
Covid : కరోనా వ్యాప్తి.. షాకింగ్ న్యూస్ చెప్పిన డబ్ల్యూహెచ్ఓ
మరోవైపు ఏపీలో కొత్తగా 771 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత 24గంటల్లో వైరస్ బారినపడి 8 మంది మృతి చెందారు. ఏపీలో ఇప్పటివరకు 20,48,230 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో కరోనా బారిన పడి మొత్తం 14,150 మంది మృతి చెందారు.
ఒక్క రోజులో ఏపీలో 1,333 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్పటివరకు 20,22,168 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 11,912 యాక్టివ్ కేసులు ఉన్నాయి.