Covid : కరోనా వ్యాప్తి.. షాకింగ్ న్యూస్ చెప్పిన డబ్ల్యూహెచ్ఓ

ఏడాదిన్నర దాటింది... వ్యాక్సిన్లూ వచ్చాయి.. అయినా, ఇంకా కరోనావైరస్ మహమ్మారి ముప్పు మాత్రం పూర్తిగా తొలగలేదు. ఈ మహమ్మారి ఇంకా యావత్ ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. కరోనా కొత్త వేరియంట

Covid : కరోనా వ్యాప్తి.. షాకింగ్ న్యూస్ చెప్పిన డబ్ల్యూహెచ్ఓ

Covid Virus

Covid Virus : ఏడాదిన్నర దాటింది… వ్యాక్సిన్లూ వచ్చాయి.. అయినా, ఇంకా కరోనావైరస్ మహమ్మారి ముప్పు మాత్రం పూర్తిగా తొలగలేదు. ఈ మహమ్మారి ఇంకా యావత్ ప్రపంచాన్ని వణికిస్తూనే ఉంది. కరోనా కొత్త వేరియంట్లు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ మహమ్మారి పీడ ఎప్పుడు విరగడ అవుతుందా? మళ్లీ స్వేచ్చగా తిరిగే మాములు రోజులు ఎప్పుడు వస్తాయా? అని అంతా ఎదురుచూస్తున్నారు. అయితే, పరిస్థితులు చూస్తుంటే అలాంటి ఆశలు వదులుకోవాల్సిందే అన్నది స్పష్టమవుతోంది. తాజాగా కరోనా వ్యాప్తి గురించి డబ్ల్యూహెచ్ఓ అధికారి షాకింగ్ విషయం చెప్పారు. ఇప్పట్లో కొవిడ్ మనల్ని వీడే అవకాశం లేదని డబ్ల్యూహెచ్ఓ అధికారి పూనమ్ ఖేత్రపాల్ బాంబు పేల్చారు.

కరోనా వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పట్లో కరోనా మనల్ని వీడే అవకాశం లేదని డబ్ల్యూహెచ్ఓ సౌత్ ఈస్ట్ రీజనల్ డైరెక్టర్ పూనమ్ ఖేత్రపాల్ సింగ్ చెప్పారు. కోవిడ్ వైరస్ చాలా కాలం పాటు వ్యాప్తి చెందుతుందని భావిస్తున్నాం అన్నారు. అంతేకాదు, భవిష్యత్తులో వైరస్.. ఎండమిక్ గా(ఒక వ్యాధి శాశ్వతంగా మనమధ్యే ఉండిపోవడం) మారే అవకాశం ఉందన్నారు. అయితే, అది ప్రజల్లోని ఇమ్యూనిటీపై ఆధారపడి ఉంటుందన్నారు. మనం పూర్తిగా వైరస్ నియంత్రణలో ఉన్నాం. వైరస్ మన నియంత్రణలో లేదు అని ఆమె అన్నారు.

Bamboo Plants : ఎకరం భూమి.. ఏడేళ్లలో రూ.17లక్షల ఆదాయం.. ఆ రైతు ఏం పండించాడంటే

“కోవిడ్ -19 వైరస్ చాలా కాలం పాటు వ్యాప్తి చెందుతుందని భావిస్తున్నారు. దీర్ఘకాలంలో వైరస్ స్థానిక వ్యాధిగా మారుతుందో లేదో అనేది అనేక అంశాలు నిర్ణయిస్తాయి. వాటిలో ప్రధానమైనది టీకా ద్వారా సమాజంలో రోగనిరోధక శక్తి స్థాయి. అలాగే మునుపటి సంక్రమణ” అని సింగ్ చెప్పారు.

ఎండమిక్ అంటే ఒక వ్యాధి శాశ్వతంగా మన మధ్యే ఉండిపోవడం. అంటే కరోనా రాకముందు మన మధ్య ఉన్న మశూచి, తట్టూ, హైపటైటిస్-ఎ, హైపటైటిస్-బి లాంటి వ్యాధులు మనుషుల మధ్య ఉన్నాయి. ఇప్పుడు వాటితో పాటు కరోనా కూడా ఉంటుందని డబ్ల్యూహెచ్ఓ అధికారి వ్యాఖ్యలు చెబుతున్నాయి. కోవిడ్ ఎలా పుట్టిందో ఎవరూ నిర్దారించలేదు.

Bank Customers : బ్యాంకు ఖాతాదారులకు అలర్ట్.. అక్టోబర్ 1 నుంచి కొత్త రూల్స్

పాండమిక్ అంటే వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండడం. ఎండెమిక్ అంటే జనాల మధ్యే వ్యాధి ఉన్నా మరణించేంతగా ఉండకపోవచ్చని చెబుతున్నారు. కరోనా వైరస్ సోకకుండా ఇప్పటికే అనేక దేశాలు వ్యాక్సిన్లు తీసుకొచ్చాయి.

కరోనా మహమ్మారి కారణంగా కొత్త సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ మహమ్మారితో మనిషి సగటు ఆయుర్దాయం పడిపోయిందని తాజాగా వెల్లడైంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇది ఈ స్థాయిలో తగ్గడం ఇదే తొలిసారి. అమెరికాలో పురుషుల సగటు ఆయుష్షు ఏకంగా 2.2 ఏళ్లు తగ్గిపోయింది. 2020లో సంభవించిన మరణాల ఆధారంగా బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ చేపట్టిన అధ్యయనంలో ఈ చేదు నిజాలు వెలుగు చూశాయి. ఆయుర్దాయాన్ని పెంచేందుకు ఏన్నో ఏళ్లుగా చేస్తున్న కృషిని కరోనా తుడిచిపెట్టేసిందని వెల్లడైంది.

29 దేశాల్లో సంభవించిన మరణాల సమాచారాన్ని విశ్లేషించి పరిశోధకులు ఈ నిర్ధారణకు వచ్చారు. యూరప్ లోని అనేక దేశాలతోపాటు అమెరికా, చిలీపై ప్రధానంగా దృష్టి పెట్టారు. 2020కి సంబంధించి మరణాల అధికారిక నమోదును పరిశీలించారు. 29 దేశాలకు గాను 27 దేశాల్లో సగటు ఆయుర్దాయం తగ్గిపోయిందని గుర్తించారు. ఆయుర్దాయం తగ్గడానికి చాలా వరకు కరోనా మరణాలే కారణం అని తేల్చారు.