Minister Niranjan Reddy: 28నుంచి రైతుల ఖాతాల్లోకి రైతు బంధు నిధులు.. ఆ విధానం ఖచ్చితంగా పాటించాలి

తెలంగాణ ప్రభుత్వం ప్రతీయేటా రెండు దఫాలుగా రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరానికి ఏడాదికి రూ. 10వేలు అందిస్తున్న విషయం విధితమే. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. రైతులు ఖరీఫ్ పంటలసాగులో నిమగ్నమయ్యారు. అయితే ఖరీఫ్ పెట్టుబడి సాయం రూ. 5వేలు ఇప్పటి వరకు రాలేదు. గత రెండు రోజుల క్రితం మరో వారం రోజుల్లో రైతు బంధు నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

Minister Niranjan Reddy: 28నుంచి రైతుల ఖాతాల్లోకి రైతు బంధు నిధులు.. ఆ విధానం ఖచ్చితంగా పాటించాలి

Ministaer Niranjan Reddy

Updated On : June 26, 2022 / 4:40 PM IST

Minister Niranjan Reddy: తెలంగాణ ప్రభుత్వం ప్రతీయేటా రెండు దఫాలుగా రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరానికి ఏడాదికి రూ. 10వేలు అందిస్తున్న విషయం విధితమే. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. రైతులు ఖరీఫ్ పంటలసాగులో నిమగ్నమయ్యారు. అయితే ఖరీఫ్ పెట్టుబడి సాయం రూ. 5వేలు ఇప్పటి వరకు రాలేదు. గత రెండు రోజుల క్రితం మరో వారం రోజుల్లో రైతు బంధు నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా ఈ విషయంపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. ఈ నెల 28నుంచి రైతుల ఖాతాల్లో రైతు బంధు నిధులు జమ అవుతాయని తెలిపారు.

Rythu Bandhu: 28 నుంచి రైతుల ఖాతాల్లోకి రైతు బంధు

తెలంగాణలో తొమ్మిదో విడత రైతు బంధు నిధులు 28నుంచి రైతుల ఖాతాల్లో జమ అవుతాయని, రైతు బంధు పథకం ద్వారా ఎకరానికి ఏడాదికి రూ. 10వేల చొప్పున ఇప్పటి వరకు రూ. 50,447,33 రైతుల ఖాతాల్లో జమచేసినట్లు మంత్రి వివరించారు. దీనికితోడు రైతు బీమా పథకం ద్వారా 83,118 మంది రైతు కుటుంబాలకు రూ. 4,150.90 కోట్లు పరిహారం అందజేసినట్లు తెలిపారు. సీజన్ కు ముందే ఏ పంటలు వేయాలో రైతులకు సూచించడానికి దేశంలోనే తొలిసారి మార్కెట్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ ను ఏర్పాటు చేశామని మంత్రి అన్నారు.

Maharashtra Political Crisis: షిండేకు షాక్.. ఉద్ధవ్‌తో టచ్‌లో 20మంది రెబల్స్?

ఖరీఫ్ సాగులో రైతులు పంటల మార్పిడి విధానాన్ని ఖచ్చితంగా పాటించాలని, ఈ మేరకు వ్యవసాయశాఖ అధికారులు రైతులు అవగాహన కల్పించాలని మంత్రి అన్నారు. ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహించడంలో భాగంగా 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ విస్తీర్ణం పెంపునకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. వరికి ప్రత్యామ్నాయంగా పత్తి సాగుతో పాటు పప్పు, నూనె గింజలు, కందులు, వేరుశెనగ, ఆవాలు, నువ్వులు, పొద్దు తిరుగుడు, మినుములు, పెసర సాగుకు ప్రోత్సాహం అందిస్తున్నామని మంత్రి తెలిపారు.