8 Lions Covid Positive : హైదరాబాద్ జూలో 8 సింహాలకు కరోనా పాజిటివ్..

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారి జంతువులకు సోకుతుందా? మనుషులే కాదు.. జంతువులనూ కరోనా వదలడం లేదు. హైదరాబాద్ జూలో సింహాలకు కరోనా వచ్చింది.

8 Lions Covid Positive : హైదరాబాద్ జూలో 8 సింహాలకు కరోనా పాజిటివ్..

8 Asian Lions Tested Covid Positive In Nehru Zoo Park

Updated On : May 4, 2021 / 11:10 AM IST

8 Lions Covid-19 Positive : ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మహమ్మారి జంతువులకు సోకుతుందా? మనుషులే కాదు.. జంతువులనూ కరోనా వదలడం లేదు. హైదరాబాద్ జూలో సింహాలకు కరోనా వచ్చింది.

దేశంలో తొలిసారి జంతువులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. నెహ్రూ జూ పార్క్ లోని ఎనిమిది ఆసియా సింహాలకు పాజిటివ్ వచ్చింది. అయితే ఆ సింహాల్లో వైరస్ లక్షణాలు లేవంటున్న జూ నిర్వాహకులు చెబుతున్నారు.

సింహాల ఆరోగ్య పరిస్థితిలో మార్పు లేదని వైద్యులు అంటున్నారు. ప్రస్తుతం కరోనా సోకిన ఎనిమిది సింహాలు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నాయి. ఇంతకీ కరోనా ఎవరి ద్వారా ఎలా సింహాలకు వ్యాపించి ఉంటుంది? అనేది ప్రశ్నార్థకంగా మారింది.

మనుషుల నుంచి జంతువులకు వైరస్ సోకుతుందనడానికి కచ్చితమైన ఆధారాలేమి లేవు. ఈ పరిస్థితుల్లో సింహాలకు వైరస్ సోకడంతో అధికారులు వాటి ఆరోగ్యంపై ఎప్పటికప్పుడూ పర్యవేక్షిస్తున్నారు.