కరోనా సోకిన ఇండోనేషియన్లు వచ్చిన ఆ రైలు బోగీలో 82మంది ప్రయాణికులు, వారి కోసం గాలింపు
తెలంగాణ ప్రజలను కరోనా వైరస్ కలవరపెడుతోంది. చాపకింద నీరులా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. బుధవారం(మార్చి

తెలంగాణ ప్రజలను కరోనా వైరస్ కలవరపెడుతోంది. చాపకింద నీరులా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. బుధవారం(మార్చి
తెలంగాణ ప్రజలను కరోనా వైరస్ కలవరపెడుతోంది. చాపకింద నీరులా కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. బుధవారం(మార్చి 18,2020) ఒక్క రోజే 8 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వాస్తవానికి బుధవారం(మార్చి 18,2020)సాయంత్రం వరకు కొవిడ్-19 కేసులు 6 నమోదయ్యాయి. రాత్రి 10 గంటల సమయంలో కరోనాపై వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. మరో ఏడు కొత్త కేసులు నమోదైనట్టు అధికారికంగా వెల్లడైంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13కి పెరిగింది. దీంతో తెలంగాణ వాసులు భయాందోళనకు గురవుతున్నారు.
ఇండోనేషియా నుంచి వచ్చిన 11మందిలో ఏడుగురికి కరోనా:
కొత్తగా కరోనా పాజిటివ్‌గా తేలిన బాధితులెవరూ తెలంగాణ వారు కాదు. వారంతా ఇండోనేషియాకు చెందినవారే. ఇండోనేషియా నుంచి వచ్చిన ఇస్లామిక్ ప్రచారకుల్లో కరోనా లక్షణాలు ఉండడంతో వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడే వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో వారికి గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డులో చికిత్స అందిస్తున్నారు. ఇండోనేషియా నుంచి 11మంది ఇస్లామిక్ మత ప్రచారకులు ఢిల్లీ వచ్చారు. మార్చి 14న ఢిల్లీ నుంచి రైలులో(సంపర్క్ క్రాంతి-ఎస్9 బోగీలో) రామగుండం చేరుకున్నారు. అక్కడి నుంచి ఓ ప్రైవేట్ వాహనంలో మార్చి 15న కరీంనగర్ వచ్చారు. నగరంలో 48 గంటల పాటు గడిపారు. నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీ, మకరంపురలో మూడు ప్రార్థనా మందిరాలకు వెళ్లారు. మత ప్రచారంలో భాగంగా నగరంలో పలు ప్రాంతాలకు వెళ్లి పలువురు స్థానికులను కలిశారని అధికారులు తెలిపారు. వారికి కరోనా సోకిందని తేలడంతో కరీంనగర్ వాసులు ఉలిక్కిపడ్డారు. (work from home : తుమ్మినా..దగ్గినా లీవ్)
కరోనా బాధితులు వచ్చిన ఎస్-9 బోగీలో 82మంది ప్రయాణికులు:
అప్రమత్తమైన అధికారులు బాధితులు ప్రయాణించిన రైలు బోగిలోని ఇతర ప్రయాణికుల గురించి ఆరా తీస్తున్నారు. ఎస్9 బోగీలో 82మంది ప్రయాణించినట్టు అధికారులు తెలుసుకున్నారు. వారి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. వారంతా వైద్య పరీక్షలు చేయించుకోవడం మంచిదని అధికారులు సూచించారు. 14 రోజుల పాటు ఇంట్లోనే ఉండటం మంచిదన్నారు. మరోవైపు కరీంనగర్ లో కరోనా బాధితులను కలిసిన 13మందిని గుర్తించిన అధికారులు వారిని ఆసుపత్రికి తరలించారు. వారికి వైద్య పరీక్షలు చేస్తున్నారు. కాగా, ఎస్9 బోగీలో ప్రయాణించిన వారు ఎవరె? వారు ఎక్కడ ఉన్నారు? వారి పరిస్థితి ఏ విధంగా ఉంది? అనే ప్రశ్నలు అందరిని హడలెత్తిస్తున్నాయి.
కరీంనగర్ లో ప్రతి ఇంటికి వెళ్లి వైద్య పరీక్షలు:
7 పాజిటివ్ కేసులు వెలుగు చూడటంతో అధికారులు అలర్ట్ అయ్యారు. కరీంనగర్ జల్లా కేంద్రంలో హైఅలర్ట్ ప్రకటించారు. కరీంనగర్ కలెక్టరేట్ చుట్టూ 3 కిలోమీటర్ల మేర ఆంక్షలు విధించారు. జనం ఎవరూ బయటకు రావొద్దని కలెక్టర్ ఆదేశించారు. 4 రోజుల పాటు ఇళ్లలోనే ఉండాలన్నారు. ముందు జాగ్రత్తగా హోటళ్లు, దుకాణాలు మూసివేశారు. ఇండోనేషియా నుంచి మత ప్రచారకులు కరీంనగర్ పట్టణంలో పలు ప్రదేశాల్లో సంచరించారు. 8మందితో సన్నిహితంగా ఉన్నట్టు ప్రాథమిక సమాచారం. అనుమానితులను క్వారంటైన్ లో ఉంచారు. మరోవైపు 100 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపారు అధికారులు. కరీంనగర్ నగరంలో ప్రతి ఇంటికి వెళ్లి వైద్య పరీక్షలు చేయనున్నారు.