హుజూరాబాద్ ఉప ఎన్నికకు 92 నామినేషన్లు..రాజేందర్ పేరుతో నలుగురు
తెలంగాణలో ఆసక్తి రేపుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల బరిలో 92 నామినేషన్లు దాఖలయ్యాయి. బీజేపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు మినహా మిగతా వారంతా గుర్తింపులేని పార్టీలు, స్వతంత్రులే.

Huzurabad (1)
తెలంగాణలో ఆసక్తి రేపుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల బరిలో 92 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిని 61మంది అభ్యర్థులు దాఖలు చేశారు. బీజేపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు మినహా మిగతా వారంతా గుర్తింపులేని పార్టీలు, స్వతంత్రులే ఉన్ననట్టు అధికారులు తెలిపారు. రాజేందర్ పేరుతో నలుగురు నామినేషన్ వేయడం ఓటర్లలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే అవకాశముంది. ఈ నెల 11న నామినేషన్ల స్క్రూటినీ చేపట్టనున్నారు అధికారులు. 13న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది.
హుజూరాబాద్ ఉప ఎన్నికలో 12 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు బరిలో నిలిచారు. వీరు ఎట్టిపరిస్థితుల్లోనూ పోటీ నుంచి తప్పుకోబోరని ఫీల్డ్ అసిసెంట్ల జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. జిల్లాల నుంచి ఫీల్డ్ అసిస్టెంట్లు అంచా వచ్చి వారి తరపున ప్రచారం చేయనున్నట్టు వెల్లడించారు. ఈ నెల 30న జరుగనున్న ఈ ఎన్నికలో అదృష్టం పరీక్షించుకోవడానికి అభ్యర్థులు పోటీ పడుతున్నారు.
Huzurabad : హుజూరాబాద్ ఉప ఎన్నికల బరిలో ఫీల్డ్ అసిస్టెంట్లు
ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోటీ నెలకొంది. సిట్టింగ్ సీటును నిలబెట్టుకునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తుంటే.. ఆత్మగౌరవ నినాదంతో ఈటల రాజేందర్ తన సత్తా చూపించేందుకు సిద్ధమయ్యారు. అటు పీసీసీ చీఫ్‌గా ఎన్నికైన తర్వాత వచ్చే మొదటి ఎలక్షన్ కావడంతో.. రేవంత్ రెడ్డి కూడా తమ అభ్యర్థి విజయానికి శాయాశక్తులా ప్రయత్నిస్తున్నారు.
నామినేషన్లు భారీ సంఖ్యలో దాఖలైతే బ్యాలెట్ పద్ధతిలో నిర్వహించాల్సి వచ్చేది. ప్రస్తుతం నామినేషన్లు సమర్పించిన వారి సంఖ్య 61 ఉండగా.. వారిలోనూ కొందరు ఉపసంహరించుకునే అవకాశం, మరికొందరి నామినేషన్లు తిరస్కరించే అవకాశం ఉండడంతో ఈవీఎం ద్వారానే పోలింగ్ నిర్వహించనున్నారు.