Fire Broke Out : గ్రీన్ బావర్చి హోటల్ లో అగ్నిప్రమాదం..బిల్డింగ్ లో చిక్కుకున్న 20 మంది!
రక్షించాలంటూ భవనం పైనుంచి బాధితులు ఆర్తానాదాలు చేస్తున్నారు. బిల్డింగ్ లో 20 మంది చిక్కుకున్నట్లు సమాచారం. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మూడు ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నారు.

Fire Accident
fire broke out : హైదరాబాద్ రాయదుర్గంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గ్రీన్ బావర్చి హోటల్ లో మంటలు చెలరేగాయి. ఐమాక్ చాంబర్ లోని 2 వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. హోటల్ లో భారీగా మండలు ఎగిసిపడుతున్నాయి. బాధితులు హోటల్ టెర్రస్ పైకి చేరుకున్నారు.
రక్షించాలంటూ భవనం పైనుంచి బాధితులు ఆర్తానాదాలు చేస్తున్నారు. బిల్డింగ్ లో 20 మంది చిక్కుకున్నట్లు సమాచారం. ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మూడు ఫైరింజన్లతో మంటలను ఆర్పుతున్నారు. ఘటనాస్థలంలో మూడు ఫైరింజన్లు, భారీ క్రేన్లతో సహాయక చర్యలు చేపట్టారు.
Delhi Fire Accident : ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. 26మంది సజీవ దహనం
గ్రీన్ బావర్చి హోటల్ లో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. రెస్క్యూ టీమ్స్ క్రేన్ ద్వారా బాధితులను కాపాడుతున్నారు. బిల్డింగ్ లో చిక్కుకున్న 20 మందిని కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారు. హోటల్ లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.