Corona Vaccine : వ్యాక్సిన్ వేయించుకోనంటూ తలుపులు బిగించుకొని ఇంట్లో కూర్చున్న వ్యక్తి

సూర్యాపేట జిల్లాలో వాక్సినేషన్ డ్రైవ్ లో అధికారులు తిప్పలు పడుతున్నారు. కోవిడ్ వాక్సిన్ వేసుకోయించుకోనంటూ ఓ వ్యక్తి తలుపులు బిగించుకొని ఇంట్లో కూర్చున్నాడు.

Corona Vaccine : వ్యాక్సిన్ వేయించుకోనంటూ తలుపులు బిగించుకొని ఇంట్లో కూర్చున్న వ్యక్తి

Vaccine

Updated On : December 20, 2021 / 6:54 PM IST

man did not like to be vaccinated : ప్రపంచ దేశాలను కరోనా వైరస్ వణికిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచదేశాలతోపాటు భారత్ నూ కలవరపెడుతోంది. అయితే కరోనాను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. అయితే కొంతమంది వ్యాక్సిన్ పట్ల సరైన అవగాహన లేకపోవడంతో టీకా వేయించుకోవడానికి భయపడుతున్నారు.

మరికొందరు వ్యాక్సిన్ కు ఆమడదూరంలో ఉంటున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రజలకు వ్యాక్సిన్ వేయడానికి అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే కొంతమంది టీకా వేయించుకోవడానికి సుముఖత చూపడం లేదు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ వేయించడంలో అధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Akepati Amarnath Reddy : అన్నమయ్య మార్గంలో తిరుమలకు చేరుకున్న కడప జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పాదయాత్ర

సూర్యాపేట జిల్లాలో వాక్సినేషన్ డ్రైవ్ లో అధికారులు తిప్పలు పడుతున్నారు. కోవిడ్ వాక్సిన్ వేసుకోయించుకోనంటూ ఓ వ్యక్తి తలుపులు బిగించుకొని ఇంట్లో కూర్చున్నారు. దాంతో ఎంపీడీవో, ఎంపీవో, వైద్య సిబ్బంది అతని ఇంటి ముందు బైఠాయించారు. ఈ ఘటన పాలకవీడు మండల కేంద్రంలో చోటు చేసుకుంది.

పాలకవీడులో కొండ చిన్నఅచ్చయ్య ఇప్పటి వరకు మొదటి డోస్ వాక్సిన్ కూడా వేసుకోలేదని అధికారులు గుర్తించారు. అవగాహన కల్పించేందుకు మండల అధికారులు అచ్చయ్య ఇంటికి వెళ్లారు. అధికారులు ఇంట్లోకి రాకుండా అచ్చయ్య తలుపులు వేసుకున్నాడు.

Aishwarya Rai : పనామా పేపర్స్ కేసు.. ఈడీ ముందు హాజరైన బాలీవుడ్ నటి ఐశ్వర్య రాయ్​

ఎంత సేపటికి తలుపులు తీయకపోవడంతో ఎంపీడీవో జానయ్య, ఎంపీవో దయాకర్, వైద్య సిబ్బంది ఇంటి ముందు బైటాయించారు. గంట సేపు ఎంపీడీవో సహా మండల అధికారులు నేలపై కూర్చున్నా అచ్చయ్య స్పందించలేదు. చేసేది ఏమీ లేక మరోసారి వస్తామంటూ మండల అధికారులు వెనుదిరిగారు.