Telangana New Secretariat: తెలంగాణ చరిత్రను ప్రతిభింబించేలా నూతన సచివాలయం.. ఆర్కిటెక్ట్‌లు ఏం చెప్పారంటే ..
తెలంగాణ రాష్ట్ర పాలనకు కేంద్ర బింధువైన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం భవన నిర్మాణం తుదిదశకు చేరింది. ఫిబ్రవరి 17న ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నూతన సచివాలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.

Dr BR Ambedkar Telangana State Secretariat
Telangana New Secretariat: తెలంగాణ రాష్ట్ర పాలనకు కేంద్ర బింధువైన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం భవన నిర్మాణం తుదిదశకు చేరింది. ఫిబ్రవరి 17న ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నూతన సచివాలయాన్ని ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఈ ప్రారంభోత్సవానికి పలు రాష్ట్రాల సీఎంలతోపాటు పలువురు రాజకీయ ప్రముఖులను ఆహ్వానించే యోచనలో ప్రభుత్వం ఉంది.

Dr BR Ambedkar Telangana State Secretariat
మరికొద్ది రోజుల్లో ప్రారంభమయ్యే నూతన సచివాలయం తెలంగాణ చరిత్రను ప్రతిభింబించేదిలా ఉంటుంది. ఈ భవన నిర్మాణానికి ఆర్కిటెక్స్‌గా చెన్నైకు చెందిన ఆస్కార్ అండ్ పొన్ని ఆర్కిటెక్టస్ అధిపతి ఆస్కార్ జి.కాన్సెస్సో, తన భార్య పొన్ని జి.కాన్సెస్సో దంపతులు పనిచేశారు. ఈ సందర్భంగా భవన నిర్మాణం, తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా భవనంలో నిర్మాణాలు తదితర అంశాలపై వారు చెప్పారు.

Dr BR Ambedkar Telangana State Secretariat
సచివాలయ నిర్మాణం ఎలా ఉండాలనే విషయాలపై సీఎం కేసీఆర్ చాలారోజులు తమకు సలహాలు, సూచనలు చేశారని ఆర్కిటెక్ట్స్ తెలిపారు. ముఖ్యమంత్రి చాంబర్, సమావేశ మందిరాలు, క్యాబినెట్ రూమ్‌లు, వీవీఐపీలు, అధికారులు, సందర్శకులకోసం ప్రత్యేక గదులు, సమావేశ మందిరాలు, సహాయ సిబ్బంది వర్క్ స్టేషన్లు ఇలా అన్ని వాస్తు ప్రకారం, తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఉండాలని సూచించినట్లు తెలిపారు.

Dr BR Ambedkar Telangana State Secretariat
ప్రాజెక్టు రూపకల్పన సమయంలో ఎదురైన సవాళ్లపై, సచివాలయంలోని వివిధ భాగాలకు సంబంధించిన మాస్టర్ ప్లానింగ్, వాస్తు సూత్రాలు, సైట్ గ్రేడింగ్, ఫ్లోర్ బై ఫ్లోర్ జోనింగ్ పై ముఖ్యమంత్రి సవివరంగా తమతో చర్చించారని ఆర్కిటెక్ట్స్ చెప్పారు. ప్రాజెక్టు సమయంలో మేం చాలా లోతైన సమీక్షలు చేశామని తెలిపారు. ఎందుకంటే, ముఖ్యమంత్రి ఇచ్చిన సూచనల్లో ఒకటి.. భవనం 150 సంవత్సరాలు పటిష్టంగా ఉండాలని చెప్పారు. దీంతో పునాదుల సమయంలో చాలా బండరాళ్లను తొలగించాల్సి వచ్చిందన్నారు. పునాదులు, స్లాబ్‌ల నిర్మాణం సజావుగా సాగింది. సచివాలయం ప్లానింగ్ మొత్తం వాస్తు ప్రకారం జరిగింది.

Dr BR Ambedkar Telangana State Secretariat
నిర్మాణ శైలులు ప్రధానంగా దక్కన్ కాకతీయుపై ఆధారపడి ఉంటాయి. తెలంగాణ సచివాలయ ముఖద్వారంపై గంభీరంగా ఉండే గోపురాల ఆలోచనలు తెలంగాణలోని ప్రముఖ దేవాలయాలు, రాజభవనాల నుంచి వచ్చినట్లు తెలిపారు. వీటి డిజైన్ ప్రేరణ రెండు రకాలుగా ఉంటాయి. అందులో ఒకటి తెలంగాణ వారసత్వ నిర్మాణ శైలికి చెందిన సాంస్కృతిక, సామరస్య సమ్మేళనం. అదేవిధంగా హైదరాబాద్, వనపర్తి ప్యాలెస్‌కు సమీపంలో ఉన్న నీలకంఠేశ్వర ఆలయానికి నిర్దిష్ట సూచనతో శివుడు ప్రేరేపణకు మరొక మూలం అని ఆర్కిటెక్ట్ పొన్ని కాన్సెసావో చెప్పారు. గోపురం, దాని అనుబంధ నిర్మాణ లక్షణాలు శివునికి అంకితం చేయబడిన దేవాలయాల నుండి ప్రేరణలని, హిందూ దక్కన్ కాతీయ వాస్తు శిల్పానికి అద్భుతమైన ఉదాహరణలుగా ఉంటాయని తెలిపారు. వైభవం, సరళత, అందంలో ప్రజాస్వామ్యాన్ని వ్యక్తపరుస్తాయని పొన్ని కాన్సెపావో చెప్పారు.

Dr BR Ambedkar Telangana State Secretariat
నూతన సచివాలయం మొత్తం డిజైన్ తెలంగాణ చరిత్ర, విభిన్న సంస్కృతులు ప్రతిబింబించేలా ఉంటాయి. వెలుపలి పోడియం క్లాడింగ్ ఎర్ర ఇసుక రాయితోనూ, సెంట్రల్ టవర్ రాజస్థాన్ లేతగోధుమ రంగు ధోల్పూర్ ఇసుకరాయి క్లాడింగ్‌తో ఉంటుంది. ఇతర నిర్మాణంపై తెలుపు రంగులో ఉన్నాయి. మనస్తత్వ శాస్త్రం ప్రకారం.. గోధుమ రంగు ప్రశాంతంగా, విశ్రాంతిగా ఉంటుంది. తెలుపు స్వచ్ఛత, కొత్త ప్రారంభాలు, సమగ్రత అని పొన్ని కాన్సెపావో అన్నారు. భవనం పూర్తిగా సాంప్రదాయ సౌష్టవ అనుభూతిని ఇస్తుంది, ఇందులో ప్రతీఒక్కటి వాస్తుశాస్త్రం ప్రకారం ఉంటుందని అన్నారు. ప్రధాన ద్వారం తూర్పువైపుకు ఉంటుంది. ముఖ్యమంత్రికి ప్రత్యేక ప్రవేశ ద్వారం ఉంది. సీఎం ఫ్లోర్ 7వ అతస్తులో ఉంటుంది. ముఖ్యమంత్రి చాంబర్, కేబినెట్ మీటింగ్ హాల్, చీఫ్ సెక్రటరీ అడ్వైజర్లు, పర్సనల్ సెక్రటరీలు, సపోర్టిగ్ స్టాఫ్, వీఐపీ వెయిటింగ్ ఏరియాలు మొత్తం ప్రత్యేక వాస్తుతో నిర్మాణం చేయడం జరిగిందని తెలిపారు. అన్ని లిఫ్టులు, మెట్లు, యుటిలిటీ గదుల రూపకల్పన ప్రణాళిక ప్రకారం ఉంటుందని అన్నారు.

Dr BR Ambedkar Telangana State Secretariat
భవనం విషయానికి వస్తే.. గ్రౌండ్ ఫ్లోర్‌తో కలుపుకొని మొత్తం ఏడు అంతస్తులు. మధ్యలో టవర్ 11 అంతస్తులు. మొత్తం భవనం వైశాల్యం దాదాపు 10 లక్షల చదరపు అడుగులు ఉంటుంది. ఈ భవనంలో మూడు అంతస్తులు అరైవల్ గ్రౌండ్ పోర్టికోతో 15 అడుగుల ఎత్తైన ఎంట్రీ పోడియంతో గొప్ప ప్రవేశ ద్వారం ఉంది. ఎల్ఈడీ గోడతో తెలంగాణ రాష్ట్రంలోని అభివృద్ధి కార్యక్రమాలను ప్రదర్శిస్తారు. అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల కళ, సంస్కృతిని ప్రదర్శించే కుడ్య చిత్రాలు గోడలపై ఉంటాయని ఆర్కిటెక్ట్స్ చెప్పారు.