Online Game: కొంపముంచిన ఆన్‌లైన్ గేమ్.. కింగ్ 527 గేమ్ ఆడి రూ.95 లక్షలు పోగొట్టుకున్న డిగ్రీ విద్యార్థి

ఆన్‌లైన్ గేమ్స్ ఆడుతున్నారా? అయితే.. జాగ్రత్త! ఎందుకంటే ఈ గేమ్స్ ఆడితే ఆస్తులే పోగొట్టుకోవాల్సి రావొచ్చు. ఎందుకంటే ఇది నిజం. ఒక యువకుడు ఆన్‌లైన్ గేమ్‌ ఆడి రూ.95 లక్షలు పోగొట్టుకున్నాడు.

Online Game: కొంపముంచిన ఆన్‌లైన్ గేమ్.. కింగ్ 527 గేమ్ ఆడి రూ.95 లక్షలు పోగొట్టుకున్న డిగ్రీ విద్యార్థి

Updated On : December 20, 2022 / 5:51 PM IST

Online Game: యువకుడి ఆన్‌లైన్ గేమ్ పిచ్చితో ఒక కుటుంబం రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. ఆన్‌లైన్ గేమ్ ఆడిన యువకుడు రూ.95 లక్షలు పోగొట్టుకున్నాడు. దీంతో ఆ కుటుంబం డబ్బు పోగొట్టుకుని, తీవ్ర ఆవేదన చెందుతోంది. తెలంగాణ, రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం, సీతారాంపూర్‌లో ఈ ఘటన జరిగింది.

Bihar: రోజు కూలీకి ఐటీ అధికారుల షాక్.. రూ.14 కోట్లు పన్ను కట్టాలంటూ నోటీసులు

డిగ్రీ చదువుతున్న ఒక విద్యార్థి ఇటీవల ‘కింగ్ 527’ అనే ఆన్‌లైన్ గేమ్‌ డౌన్‌లోడ్ చేసుకున్నాడు. ఈ గేమ్ ఆడాలంటే బ్యాంక్ అకౌంట్ లింక్ చేయాల్సి ఉంటుంది. దీంతో తన తండ్రి బ్యాంక్ అకౌంట్ లింక్ చేసి, దాని ద్వారా డబ్బులు చెల్లించేవాడు. ఈ క్రమంలో తండ్రి అకౌంట్‌లో ఉన్న రూ.95 లక్షలు పోగొట్టుకున్నాడు. డబ్బులు అన్నీ అయిపోయాక విషయం తండ్రికి తెలిసింది. దీంతో తమ డబ్బులన్నీ పోవడంతో ఆ కుటుంబం తీవ్ర వేదనకు గురవుతోంది. యువకుడి తల్లిదండ్రులు లబోదిబో మంటున్నారు. ఇటీవలే యువకుడి తండ్రికి భూ సేకరణ పరిహారం ఇచ్చింది ప్రభుత్వం.

ఆ డబ్బుల్ని ఆ తండ్రి బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నాడు. ఇలా వచ్చిన డబ్బులతోనే యువకుడు ఆన్‌లైన్ గేమ్‌ ఆడాడు. ఇప్పుడు భూమి పోయి, దాన్నుంచి వచ్చిన డబ్బు కూడా పోయి ఆ తల్లిదండ్రులు కన్నీరు పెట్టుకుంటున్నారు.