బాబోయ్ అక్రమాస్తులు అన్నికోట్లా..! బయటపడుతున్న ఉమామహేశ్వరరావు అక్రమ భాగోతాలు
సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు అక్రమాస్తుల చిట్టా బయటపడుతోంది. భారీ సంఖ్యలో ఆయన అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

ACP Uma Maheswara Rao
ACP Uma Maheswara Rao : సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు అక్రమాస్తుల చిట్టా బయటపడుతోంది. భారీ సంఖ్యలో ఆయన అక్రమాస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఉమామహేశ్వరరావు వద్దకు న్యాయంకోసం వెళ్లిన బాధితులకు చుక్కలు చూపించాడు. ఆయన వ్యవహారశైలిపై గతంలోనూ అనేక ఫిర్యాదులు ఉన్నతాధికారులకు అందాయి. అతనిపై ఇప్పటికే మూడు సార్లు సస్పెన్షన్ వేటుసైతం పడింది. అయినా ఉమామహేశ్వరరావు తనతీరు మార్చుకోలేదు.
Also Read : ACB Raids : హైదరాబాద్‌లో ఆరు చోట్ల ఏసీబీ అధికారులు ఏకకాలంలో దాడులు
సివిల్ కేసులను క్రిమినల్ కేసులుగా మార్చి లక్షల రూపాయలను ఉమామహేశ్వరరావు జేబులో వేసుకున్నాడు. సీసీఎస్ లో బాధితులకు న్యాయం చేయాల్సిన హోదాలో ఉoటూ వారితోనే బేరసారాలు సాగించాడు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఒక ఎన్నారై నుసైతం బెదిరించి డబ్బులు దండుకున్న వైనం వెలుగులోకి వచ్చింది. ఉమా మహేశ్వర రావు బూతుపురాణంపైనా సిబ్బంది పలుసార్లు అసహనం వ్యక్తం చేశారు. తోటి సిబ్బందినిసైతం తిట్లతో అవహేళన చేసిన సందర్భాలు ఉన్నాయి. తన దగ్గరికి వచ్చినప్రతి కేసు లోను ఉమా మహేశ్వర రావు చేతివాటం ప్రదర్శించేవాడని ఫిర్యాదులు ఉన్నాయి.
Also Read : అధిక వడ్డీ ఆశచూపి రూ.200 కోట్లతో పరార్.. టెస్కాబ్ ఉన్నతాధికారి వాణి బాల సస్పెండ్..
అక్రమ ఆస్తులను కూడబెట్టుకుని నగర శివారులో విలాసవంతమైన విల్లాలను ఉమామహేశ్వరరావు కొనుగోలు చేశారు. తన ఇంట్లో నగదు ఉంచకుండా, తన అత్త, మామల ఇంట్లో డబ్బును ఉంచారు. ఈ అవినీతి తిమింగలం లావాదేవీలు మొత్తాన్ని ట్యాబ్ లో రాసుకున్నాడు. ఉమామహేశ్వరరావు అక్రమాస్తుల విలువ బహిరంగ మార్కెట్ లో 50కోట్ల మేర ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇదిలాఉంటే ఏసీబీ అధికారులు ఉమామహేశ్వరరావును కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరుస్తారు.
ఆదాయానికి మించి ఆస్తులను కలిగిఉన్నాడనే ఫిర్యాదులతో ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయం సోదాలు ప్రారంభించారు. ఉమాహేశ్వరరావు ఇంటితోపాటు ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లలో మొత్తం 14 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. అర్ధరాత్రి వరకు సోదాలు కొనసాగాయి. సోదాలు పూర్తయ్యాక ఉమాహేశ్వరరావును అరెస్టు చేశారు.