Divyavani : కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న నటి దివ్యవాణి

ప్రముఖ నటి దివ్యవాణి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆసక్తికరంగా మారింది.

Divyavani : కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న నటి దివ్యవాణి

Divyavani

Updated On : November 22, 2023 / 10:32 AM IST

Divyavani : ప్రముఖ సినీ నటి దివ్యవాణి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ రావ్ ఠార్రే సమక్షంలో ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

Telangana Assembly Elections 2023 : తెలంగాణ ఎన్నికల పర్వంలో గల్ఫ్ కార్మికుల గోస

దివ్యవాణి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఏఐసీసీ ఇంచార్జ్ మానిక్ ఠాక్రే దివ్యవాణికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. దివ్యవాణి 2019 లో టీడీపీలో చేరారు. టీడీపీ అధికార ప్రతినిధి హోదాలో పార్టీలో యాక్టివ్ రోల్ పోషించారు. ప్రత్యర్ధులపై విరుచుకుపడుతూ ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్నారు. ఉన్నట్టుండి 2022 లో పార్టీని వీడారు. ఆ పార్టీ అంతర్గత వ్యవహారాలపై పలు ఇంటర్వ్యూల్లో సంచలన వ్యాఖ్యలు చేసారు.

Today Headlines : హుస్నాబాద్ నియోజకవర్గంలో కేటీఆర్ రోడ్ షో.. ప్రధాని అధ్యక్షతన G20 వర్చువల్‌ సమావేశం

తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో దివ్యవాణి కాంగ్రెస్‌లో చేరడం ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ నెలకొని ఉండటంతో ఆమె కాంగ్రెస్ వైపు మొగ్గుచూపినట్లు అందరూ భావిస్తున్నారు.