Agnipath Protest: సికింద్రాబాద్ నిరసనలు పక్కా ప్లాన్‌తో చేసినవే

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆందోళన పక్కా ప్లాన్ తో నిర్వహించినట్లు తెలుస్తుంది. సోషల్ మీడియాలో గ్రూప్స్ ఏర్పాటు చేసుకుని.. దాని ద్వారానే కమ్యూనికేట్ అయ్యారు. ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, ట్విట్టర్ ద్వారా ఆర్మీ అభ్యర్థులకు సమాచారం.

Agnipath Protest: సికింద్రాబాద్ నిరసనలు పక్కా ప్లాన్‌తో చేసినవే

Agnipath

Updated On : June 17, 2022 / 1:28 PM IST

Agnipath Protest: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఆందోళన పక్కా ప్లాన్ తో నిర్వహించినట్లు తెలుస్తుంది. సోషల్ మీడియాలో గ్రూప్స్ ఏర్పాటు చేసుకుని.. దాని ద్వారానే కమ్యూనికేట్ అయ్యారు. ఇన్‌స్టాగ్రామ్, వాట్సాప్, ట్విట్టర్ ద్వారా ఆర్మీ అభ్యర్థులకు సమాచారం.

శుక్రవారం ఆందోళన చేపట్టాలని ముందస్తుగా నిర్ణయించుకున్నారు. కేంద్ర ప్రభుత్వం దృష్టిలో తమ సమస్యలు తీసుకురావాలని అభ్యర్థులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎంచుకున్నట్లుగా కనిపిస్తుంది. ఆందోళనలు అదుపుచేసేందుకు ఫైరింగ్ చేయగా.. ఒకరి పరిస్థితి విషమం కాగా, మరొకరు మృతి చెందారు. వందలాది అభ్యర్థులకు గాయాలు అయినట్లు తెలుస్తోంది.

ఆందోళన పరిస్థితిపై రైల్వే డీజీ సందీప్ శాండిల్య ఆరా తీశారు. ఆందోళనను కట్టడి చేయడంతో పాటు రైళ్ల పునరుద్ధరణ కోసం అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఆర్పీఎఫ్, సీఐఎస్ఎఎఫ్, లా అండ్ ఆర్డర్ పోలీసులు భారీగా రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు.

Read Also: అగ్నిపథ్​ పథకంలో కీలక మార్పు.. వయో పరిమితిని పెంచిన కేంద్రం

కేంద్రం ప్రవేశపెట్టిన ‘అగ్నిపథ్’ పథకానికి వ్యతిరేకంగా నిరసనకారులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. రైల్వే స్టేషన్ రక్తసిక్తమైంది. ఆందోళనకారులపై రైల్వే పోలీసులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు యువకులు మృతి చెందారు. మరికొందరు యువకులు గాయపడ్డారు.

శుక్రవారం ఉదయం భారీ ఎత్తున రైల్వే స్టేషన్‌కు చేరుకున్న ఆందోళనకారులు పలు రైళ్లకు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో మూడు ఎక్స్‌ప్రెస్ రైళ్లు, ఎంఎంటీఎస్ రైళ్లు దహనమయ్యాయి. రైల్వే స్టేషన్‌కు చెందిన పలు ఆస్తులు ధ్వంసమయ్యాయి. స్టేషన్ చేరుకున్న పోలీసులు ఆందోళనకారుల్ని అదుపు చేసేందుకు ప్రయత్నించారు.

ఫైర్ సిబ్బంది, పోలీసులపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. దీంతో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. అయినప్పటికీ ఆందోళనకారులు తగ్గకపోవడంతో పోలీసులు కాల్పులు ప్రారంభించారు.