Shock To BRS : ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు బిగ్ షాక్ … కాంగ్రెస్ లో చేరిన ఆకుల లలిత, నీలం మధు, కపిలవాయి దిలీప్
బీఆర్ఎస్ నేత ఆకుల లలిత కాంగ్రెస్ పార్టీలో చేరారు. తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. పదవులు ఆశించి కాంగ్రెస్ పార్టీలో చేరలేదన్నారు.

BRS Leaders Join Congress
BRS Leaders Join Congress : ఎన్నిక వేళ తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. టికెట్ ఆశించి భంగపడిన ఆశావహులు పార్టీలు మారుతున్నారు. ముఖ్యంగా అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ ల నుంచి వలసలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎన్నికల వేళ బీఆర్ఎస్ కు షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. పలువురు కీలక నేతలు పార్టీని వీడుతున్నారు. తాజాగా మరికొందరు నేతలు గులాబీ పార్టీని వీడారు. బీఆర్ఎస్ నాయకులు ఆకుల లలిత, నీలం మధు ముదిరాజ్ తోపాటు మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు.
బీఆర్ఎస్ నేత ఆకుల లలిత కాంగ్రెస్ పార్టీలో చేరారు. తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. పదవులు ఆశించి కాంగ్రెస్ పార్టీలో చేరలేదన్నారు. బీఆర్ఎస్ లో తనకు ఉన్నత పదవులే ఇచ్చారని పేర్కొన్నారు. నిజామాబాద్ లో గట్టి అభ్యర్థి ఉంటే కాంగ్రెస్ గెలుస్తుందన్నారు. బీసీ మహిళగా నిజామాబాద్ అర్బన్ లో పోటీకి సిద్ధంగా ఉన్నానని ఆకుల లలిత తెలిపారు.
మరో బీఆర్ఎస్ నేత నీలం మధు ముదిరాజ్ కాంగ్రెస్ లో చేరారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. నీలం మధు ముదిరాజ్ పటాన్ చెరు బీఆర్ఎస్ టికెట్ ఆశించారు. టికెట్ రాకపోవడంతో బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన నీలం మధు కాంగ్రెస్ లో చేరారు. పటాన్ చెరు నుంచి నీలం మధు కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్నారు.
మరోవైపు కాంగ్రెస్ లో చేరిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డి.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేను కలిశారు. అలాగే మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏది ఆశించి కాంగ్రెస్ పార్టీలో చేరలేదన్నారు. ప్రస్తుతం బీఆర్ఎస్ ని ఓడించే పరిస్థితిలో బీజేపీ లేదన్నారు. కేసీఆర్ ను ఓడించేందుకే కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్పారు.
Jhansi Reddy : కాంగ్రెస్ నేత, ఎన్నారై ఝాన్సీ రెడ్డికి షాక్.. భారత పౌరసత్వం నిరాకరణ
కేసీఆర్, బీఆర్ఎస్ ను ఓడించే సత్తా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని తెలిపారు. బండి సంజయ్ తొలగింపు తరువాత బీజేపీ బలహీన పడిందన్నారు. 2009లో కేసీఆర్ ను మొదట విభేదించి బయటకి వచ్చింది తానేనని తెలిపారు. కేసీఆర్ ఎలాంటి వాడో మొదట చెప్పింది తానేనని పేర్కొన్నారు.