Kishan Reddy : కాంగ్రెస్ అమ్ముడు పోయే పార్టీ, బీఅర్ఎస్ కొనే పార్టీ .. రాహుల్ గాంధీ ఓ రాజకీయ అజ్ఞాని : కిషన్ రెడ్డి కౌంటర్లు

ప్రగతి భవన్ అంటే కేసిఆర్ కుటుంబ భవన్ అంటూ విమర్శించారు కిషన్ రెడ్డి. బీజేపీ అధికారంలోకి రాగానే ప్రగతిభవనాన్ని ప్రజల ప్రగతి భవన్ గా మారుస్తామన్నారు.

Kishan Reddy : కాంగ్రెస్ అమ్ముడు పోయే పార్టీ, బీఅర్ఎస్ కొనే పార్టీ .. రాహుల్ గాంధీ ఓ రాజకీయ అజ్ఞాని : కిషన్ రెడ్డి కౌంటర్లు

Kishan Reddy

Updated On : October 27, 2023 / 1:21 PM IST

Kishan Reddy : బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఘాటు విమర్శలతో విరుచుపడ్డారు. హైదరాబాద్ లో పార్టీలో చేరిన కేస్ రత్నంకు స్వాగతం పలికిన అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతు..మాఫియా, అవినీతి పరుల చేతిలో తెలంగాణ బందీ అయ్యిందని..ఎవరు ఎన్ని రకాలుగా ప్రచారం చేసినా తెలంగాణలో గెలిచేది బీజేపీయే..ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది మేమే అని ధీమా వ్యక్తంచేశారు. ఈ సందర్బంగా కిషన్ రెడ్డి బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అంటూ విమర్శలు చేసే కాంగ్రెస్ పై మరీ ముఖ్యంగా రాహుల్ గాంధీపై ఘాటు విమర్శలు సంధించారు.

రాహుల్ రాజకీయ అజ్ఞాని అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అమ్ముడు పోయే పార్టీ, బీఅర్ఎస్ కొనే పార్టీ అంటూ విమర్శించారు. మాట్లాడితే కాంగ్రెస్ బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అంటూ అర్థం లేని ఆధారం లేని మాటలు మాట్లాడుతోంది..ఎవడ్రా బీఅర్ఎస్ కు బీ టీమ్?మీరు బీఅర్ఎస్ కు బీ టీమ్ అంటూ మండిపడ్డారు. రాహుల్ కు రాజకీయపరమైన అనుభవం లేదు.. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి వెళ్ళిపోతారు ఆయనో రాజకీయ అజ్ఞాని అంటూ సెటైర్లు వేశారు. కాంగ్రెస్ లో కేసిఆర్ పని చేస్తున్నప్పుడు రాహూల్ కి తెలీదు అప్పుడు ఆయన ఏ దేశంలో ఉన్నాడో..? అంటూ ఎద్దేవా చేశారు.మన్మోహన్ ను ముందుకి పెట్టీ రిమోట్ కంట్రోల్ గవర్నమెంట్ నడిపించిన రాహుల్ గాంధీ మాపై నిందలు వేస్తారా..? అంటూ మండిపడ్డారు.

Minister Harish Rao : కేసీఆర్ అంటే నమ్మకం .. కాంగ్రెస్ అంటే నాటకం : హరీశ్ రావు

కాంగ్రెస్ అమ్ముడు పోయే పార్టీ.బీఅర్ఎస్ కొనే పార్టీ..అమ్ముడు పోయే పార్టీకి ఓనర్ రాహుల్ గాంధీ అంటూ సెటర్లతో విరుచుకుపడ్డారు.కాంగ్రెస్ లో గెలిచి బీఅర్ఎస్ కు అమ్ముడుపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే లు మీ పార్టీ గుర్తు మీద గెలిచి ఇంకా మంత్రులుగా కొనసాగుతున్నారు..అటువంటి దరిద్రపు రాజకీయ చేస్తున్నది మీరు కాదా? అంటూ ప్రశ్నించారు. బీఅర్ఎస్, కాంగ్రెస్ కు ఏ టీమ్ ఎంఐఎం అని ఆ పార్టీ నేత అసదుద్దీన్ రాసిచ్చిన స్క్రిప్ట్ రాహూల్, కేసిఆర్ చదువుతారు అంటూ ఆరోపించారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో మీ అభ్యర్థికి ఇక్కడ ప్రచారం చేసింది ఎవరు? కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మజ్లిస్ తో బీజేపీ కలిసే ప్రసక్తే లేదు అంటూ స్పష్టంచేశారు.మజ్లిస్ తో దొస్తానాలో ఉన్న బీఅర్ఎస్ తో కలసి ముందుకి వెళ్ళే ప్రసక్తే అసలే లేదన్నారు.కేంద్రంలో కాంగ్రెస్ గెలిస్తే బీఅర్ఎస్ ది కీలకపాత్ర ఉంటుందని ఢిల్లీలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్ని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేస్తు..బీఆర్ఎస్, కాంగ్రెస్ కలవబోతురాన్నారు అనేదానికి ఇవన్నీ సాక్ష్యాలు కాదా? అని ప్రశ్నించారు.బీజేపీ నాయకులు అంటేనే శత్రువు దేశాలు ఉచ్చ పోసుకుంటున్నాయన్నారు. మోడీ పాకిస్తాన్ లో నున్న ఉగ్రవాద స్థావరాలను కూకటి వేళ్ళతో అణచి వేశారని ఈ విషయాన్ని రాహుల్ గాంధీ అర్థం చేసుకోవాలని అన్నారు.

ఇండియా కూటమికి ఫండ్ ఇస్తా తనను ప్రధానిని చేయమని కేసీఆర్ ఆఫర్ ఇచ్చారు : కోమటిరెడ్డి రాజగోపాల్

కాంగ్రెస్ మజ్లిస్ పార్టీని పెంచి పోషించినా..వారి మోచేతి నీళ్ళు తాగారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ హయాంలో మంత్రులు పాత బస్తీలో తిరిగే పరిస్థితి లేదని..అక్కడ మంత్రులు తిరగలన్నా ఓవైసీ పర్మిషన్ తీసుకుని వెళ్లే దుస్థితి ఉండేది అంటూ ఎద్దేవా చేశారు. పాతబస్తీ ఓట్ల కోసం మజ్లిస్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న బీఅర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటే అన్నారు. కేసిఆర్ కాంగ్రెస్ అభ్యర్థులకు డబ్బులు పంపిస్తున్నారు అంటూ ఆరోపించారు. కేసీఆర్ 2014, ,2018లో ఇదే ఫాలో అయ్యారు..యూపీఏ ప్రభుత్వ హయాంలో 12లక్షల కోట్లు దోపిడీ చేసిన చరిత్ర కాంగ్రెస్ ది అంటూ మండిపడ్డారు.

ప్రగతి భవన్ అంటే కేసిఆర్ కుటుంబ భవన్ అంటూ విమర్శించారు.బీజేపీ అధికారంలోకి రాగానే దాన్ని ప్రజల ప్రగతి భవన్ గా మారుస్తామన్నారు.బీజేపీ అధికారంలోకి రాగానే పంట భీమా అందిస్తాం పేదలకు ఉచిత విద్య ను అమలు చేస్తాం అని హామీ ఇచ్చారు.