Ponnala Lakshmaiah : కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక.. గాంధీభవన్ వద్ద పొన్నాల లక్ష్మయ్య వీరంగం
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని 238 ప్రతినిధులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే పోలింగ్ జగురుతున్న వేళ గాంధీభవన్ దగ్గర మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య వీరంగం సృష్టించారు.

ponnala lakshmaiah
Ponnala Lakshmaiah : కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రంలోని 238 ప్రతినిధులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. అయితే పోలింగ్ జగురుతున్న వేళ గాంధీభవన్ దగ్గర మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య వీరంగం సృష్టించారు. జనగామ జిల్లాకు చెందిన శ్రీనివాస్ రెడ్డిని ఓటు వేయకుండా పీఆర్వో అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
45 ఏళ్ల కాంగ్రెస్ మనిషికి అవమానం జరిగిందంటూ మండిపడ్డారు. ఓటరు లిస్టు నుంచి శ్రీనివాస్ రెడ్డి పేరును చివరి క్షణంలో ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. అయితే పీఆర్వోతో పొన్నాల లక్ష్మయ్య వాగ్వాదానికి దిగారు. పొన్నాల లక్ష్మయ్యను జానారెడ్డి సముదాయించి అక్కడి నుంచి తీసుకెళ్లారు. కాగా, అధ్యక్ష ఎన్నికల్లో ఓటేసేందుకు ప్రతి నియోజకవర్గం నుంచి ఇద్దరికి అవకాశం కల్పించారు.
ఇందులో భాగంగా జనగామ నుంచి పొన్నాల లక్ష్మయ్య, చెంచారపు శ్రీనివాస్ రెడ్డికి ఏఐసీసీ ఓటింగ్ కార్డు జారీ చేసింది. అయితే గత రాత్రి శ్రీనివాస్ రెడ్డి స్థానంలో కొమ్మూరు ప్రతాప్ రెడ్డి పేరును రాష్ట్ర నాయకత్వం చేర్చింది. దీంతో ఓటు వేయడానికి గాంధీభవన్‌కు వచ్చిన శ్రీనివాస్ రెడ్డిని పీఆర్వో సిబ్బంది అడ్డుకున్నారు.
దీంతో అక్కడే ఉన్న పొన్నాల.. సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాత్రికి రాత్రే కొమ్మూరి పేరును ఎలా చేర్చుతారని ప్రశ్నించారు. శ్రీనివాస్ రెడ్డికి ఓటువేసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. కాగా, ప్రస్తుతం శ్రీనివాస్ రెడ్డి, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఇద్దిరినీ ఓటేయకుండా పీఆర్వో సిబ్బంది ఆపేశారు.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.